Boat Storm Call 3 Smartwatch Features : నేటి టెక్నాలజీ యుగంలో స్మార్ట్ వాచ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. కేవలం టైమ్ కోసమే కాకుండా ఫోన్ కాలింగ్, హెల్త్ ట్రాక్ ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉండడంతో ముఖ్యంగా యువత స్మార్ట్ వాచ్‌ల వాడకానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తూ యూత్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ బోట్(Boat) అదిరిపోయే ఫీచర్స్‌తో 'Boat Storm Call 3' అనే మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను(Smartwatch) లాంచ్ చేసింది. ఇంతకీ, దీనిలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? ధర ఎంత? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Boat Storm Call 3 ఫీచర్స్ :
- బోట్ తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌వాచ్ 1.83 అంగుళాల దీర్ఘ చతురస్రాకార డిస్ ప్లేను కలిగి ఉంది.
- ఇది 240*296 పిక్సెల్ రిజల్యూషన్, 550 నిట్స్ బ్రైట్ నెస్, బ్లూ టూత్ కాలింగ్, నావిగేషన్ సపోర్ట్‌తో వస్తోంది.
- ముఖ్యంగా Boat Storm Call 3 వాచ్‌లో అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడేలా SoS మోడ్ అనే సూపర్ ఫీచర్ ఉంది. దీని ఉపయోగం ఏంటంటే.. ఎమర్జెన్సీ టైమ్స్‌లో ముందుగా నమోదు చేసుకున్న ఫోన్ నంబర్లలకు సమాచారం అందజేయడంలో ఉపయోగపడుతుంది. ఇక దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి వాచ్ బటన్‌ను ఎక్కువసేపు నొక్కితే సరిపోతుందని బోట్ తెలిపింది.
నిద్రపోతున్నప్పుడు స్మార్ట్ వాచ్ ధరించడం డేంజరా?
- Boat Storm Call 3 స్మార్ట్‌వాచ్ 230mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.
- అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్‌లో ఎన్నో రకాల హెల్త్ ట్రాకర్లు ఉన్నాయి. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్లీప్ సైకిల్ ట్రాకర్ వంటి అనేక రకాల ట్రాకర్లు Boat Storm Call 3లో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
- 700+ ముందే ఇన్స్టాల్ చేసిన యాక్టివిటీ మోడ్‌లను ఇది కలిగి ఉంది. బోట్ యాప్ ద్వారా ఈ వివరాలను ట్రాక్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.
- స్టార్మ్ కాల్ 3లో బీటీ కాలింగ్ సామర్ధ్యంతో పాటు కెమెరా, మ్యూజిక్ కంట్రోల్స్, నోటిఫికేషన్ అలర్ట్స్, క్విక్ రిప్లయ్స్, డీఎన్‌డీ మోడ్, వెదర్ అప్‌డేట్స్, గేమ్స్, ఊబర్ అలర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర : Boat Storm Call 3 స్మార్ట్‌వాచ్.. యాక్టివ్ బ్లాక్, డార్క్ బ్లూ, చెర్రీ బ్లోసమ్, ఓలివ్ గ్రీన్, సిల్వర్ మెటల్ వంటి వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చిందని బోట్ కంపెనీ తెలిపింది. ఇక స్మార్ట్ వాచ్ ధర విషయానికొస్తే.. దీని స్టార్టింగ్ ఫ్రైస్ రూ. 1099గా ఉంది. అదే మీరు సిల్వర్ మెటల్ వేరియంట్ వాచ్ తీసుకోవాలంటే దాని ధర రూ. 1249గా ఉంది. ఇక మిగిలిన వేరియంట్ల ధరలు రూ.1588, రూ.1694 గా ఉన్నట్లు బోట్ వెల్లడించింది.
హెల్త్ ట్రాకింగ్ కోసం మంచి స్మార్ట్‌వాచ్ కొనాలా? రూ.5000 బడ్జెట్లోని టాప్-6 ఆప్షన్స్ ఇవే!