ETV Bharat / technology

సెల్ఫీలు బాగా రావడం లేదని వర్రీ అవుతున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే పర్ఫెక్ట్​ ఫొటో గ్యారెంటీ! - Best Tips to Take Perfect Selfie - BEST TIPS TO TAKE PERFECT SELFIE

Perfect Selfie: ఇప్పుడు సెల్ఫీలు ఓ ట్రెండ్. కొత్త డ్రెస్​ వేసుకున్నా.. కొత్త ప్రదేశానికి వెళ్లినా.. సెల్ఫీ దిగాల్సిందే, సోషల్ మీడియాలో పోస్టు చేయాల్సిందే! అయితే.. పర్ఫెక్ట్​గా సెల్ఫీ తీసుకోవడం అందరికీ రాదు. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్​ ఫేస్ చేస్తున్నారా? అయితే.. మీరు కొన్ని టిప్స్​ పాటించాల్ిసందే. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Perfect Selfie
Perfect Selfie (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 11:05 AM IST

Best Tips to Take Perfect Selfie: ఒక ప్రాంతంలో సెల్ఫీ దిగుతున్నారంటే.. అక్కడ చక్కటి బ్యాక్ గ్రౌండ్​ ఉంటుంది. అయితే.. చాలా మంది కేవలం బ్యాక్​ గ్రౌండ్​కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. కానీ.. బ్రైట్ నెస్​కూ అంతే ఇంపార్టెన్స్​ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫొటో దిగేటప్పుడు సరిపడా వెలుతురు ఉందో లేదో తప్పకుండా పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. కాంతి ఎటువైపు ఉందో ముందుగా గమనించాలి. కెమెరాను నేరుగా కాంతి వైపు కాకుండా.. దానికి ఆపోజిట్​ డైరెక్షన్​లో.. అంటే కాంతిపడే దిశలో ఫొటోలు తీయాలి. అప్పుడే ఫొటోలు చాలా స్పష్టంగా వస్తాయి. ఒకవేళ వెలుతురు ఎక్కువైనా పర్లేదు.. కాంట్రాస్ట్​లో తగ్గించుకోవచ్చు. కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి.

పోర్ట్రెయిట్ మోడ్‌: ప్రస్తుతం చాలా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు పోర్ట్రెయిట్ మోడ్‌ను కలిగి ఉంటాయి. ఇది బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేసి.. ప్రొఫెషనల్‌గా కనిపించేలా ఫొటోను డెలివరీ చేస్తుంది. కాబట్టి సెల్ఫీ దిగేటప్పుడు మీ ఫోన్‌లో పోర్ట్రెయిట్ మోడ్ సెట్​ చేసుకోవడం బెటర్​. ఒకవేళ మీ ఫోన్లో ఆ ఆప్షన్​ లేకుంటే.. మీరు మీ ఫోటోలకు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌ని యాడ్​ చేసుకోవడానికి Google ఫొటోలను ఉపయోగించవచ్చు.

సెల్ఫీల వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో! తెలిస్తే మీరే షాక్​ అవుతారు!

డిఫరెంట్​ కెమెరా యాంగిల్: కొద్దిమంది ఎప్పుడు చూసినా.. ఒకే రకమైన యాంగిల్​లో సెల్ఫీలు దిగుతుంటారు. అయితే ఎప్పుడూ ఒకే రకమైనటువంటివి కాకుండా అప్పుడప్పుడూ కొత్త యాంగిల్స్​ ట్రై చేయండి. దీనివల్ల ఫొటోలలో చేంజ్​ ఈజీగా తెలిసిపోతుంది. ఫొటో కూడా పర్ఫెక్ట్​గా వస్తుంది.​

యూజ్​ సెల్ఫీ స్టిక్​: ప్రస్తుతం చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. మరికొద్దిమంది మాత్రం నార్మల్​గానే సెల్ఫీలు దిగుతుంటారు. అయితే నార్మల్​గా దిగిన ఫొటోల కంటే.. సెల్ఫీ స్టిక్​ ద్వారా తీసుకున్నవి పర్ఫెక్ట్​గా వస్తాయి. ఎందుకంటే నార్మల్​గా సెల్ఫీ దిగితే అవి షేక్​ అయ్యి బ్లర్​ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ సారి సెల్ఫీ స్టిక్​తో ట్రై చేసి తేడా మీరే గమనించండి.

టైమర్​ సెట్​ చేసుకోండి: పర్ఫెక్ట్​ ఫోజ్​ పెట్టి.. సెల్ఫీ కెమెరాలో క్యాప్చర్​ బటన్​ ప్రెస్​ చేసేలోపు అది కొంచెం షేక్​ అయ్యి ఫొటో బ్లర్​గా రావడం వంటివి జరుగుతుంటాయి. అయితే.. ఆ టెన్షన్​ లేకుండా మీ ఫోన్​లో సెల్ఫీ కెమెరా టైమర్​ను సెట్​ చేయండి. అంటే 2సె, 3సె, 5సెకన్లు.. ఇలా టైమ్​ సెట్​ చేసుకుంటే ఆ లోపు మీరు పెట్టాలనుకున్న ఫోజ్​ పెట్టి సెల్ఫీ దిగొచ్చు.

మంచి బ్యాక్ గ్రౌండ్: ఒక్కోసారి మీరు ఫోటోలో ఎంత బాగా ఫోజిచ్చినా.. మీరు నిల్చున్న బ్యాక్ గ్రౌండ్ మీ ఫోటో అందాన్ని చెడగొడుతుంది. కాబట్టి సహజంగా అందంగా ఉన్న బ్యాక్ గ్రౌండ్​ను ఎంపిక చేసుకుంటే స్వీట్ అండ్ సింపుల్​గా ఉంటుంది.

ఆత్మవిశ్వాసంతో: కొంత మంది సెల్ఫీ తీసుకునేటప్పుడు ఎవరైనా చూస్తున్నారేమోనని భయం భయంగా.. సిగ్గుపడుతున్నట్లుగా కనిపిస్తుంటారు. కానీ సెల్ఫీ తీసుకునేటప్పుడు అలాంటి అనవసర భయాలకు తావివ్వకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. అప్పుడే పర్ఫెక్ట్​ ఫొటో వస్తుంది.

ఎడిటింగ్ యాప్స్: చాలా రకాల ఫొటో ఎడిటర్ యాప్స్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. వీటితో మీరు దిగిన ఫోటోను మీకు కావలసినట్టుగా మలచుకోవచ్చు. కాబట్టి, మీ మొబైల్​కు సూటయ్యే యాప్​ను డౌన్​లోడ్ చేసుకుని వాటిలో ఉన్న ఫీచర్స్​ను ఉపయోగించుకోండి.

నవ్వడం: చాలా మంది సెల్ఫీలు దిగేటప్పుడు ఫేక్​ నవ్వుతో దిగుతుంటారు. అలాకాకుండా నేచురల్​గా.. మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల మంచి లుక్​తో అవుట్​ పుట్​ వస్తుంది. అలానే కొద్దిమంది ఫ్లాష్​ ఆన్​ చేసి సెల్ఫీ దిగుతుంటారు. అలా కూడా చేయొద్దంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. కానీ, వీటిని పాటించడం, పాటించకపోవడం మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి:

ట్రోలింగ్​కు గురైన ఊర్వశి- చైనా ఫోన్ వల్లే తారక్​తో సెల్ఫీ అలా వచ్చిందట!

ఏముంది భయ్యా రష్మిక.. క్యూట్ సెల్ఫీలతో హాట్​ కిస్​ పోజులు.. ఇలా చూశారంటే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.