Best Tablets Under 20000 : ప్రస్తుత స్మార్ట్‌యుగంలో చాలా మంది ట్యాబ్లెట్స్ వాడేందుకు ఇష్టపడుతున్నారు. మీరు కూడా మంచి ట్యాబ్ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ కేవలం రూ.20 వేలు మాత్రమేనా? అయితే ఈ ఆర్టికల్‌లో మీ బడ్జెట్లో వచ్చే బెస్ట్ ట్యాబ్లెట్ల గురించి తెలుసుకుందాం. వీటితో పాటు ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ముందు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి అనే విషయాలను చూద్దాం.
మీరు ఎంత బడ్జెట్లో ట్యాబ్లెట్ కొనుగోలు చేయాలనుకుంటున్నప్పటికీ డిస్ప్లే క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, యూజర్ ఎక్స్పీరియన్స్, స్టోరేజ్, ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్, తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే ఈ ఆర్టికల్‌లో రూ.20 వేల బడ్జెట్లో మంచి ఫీచర్స్, స్పెక్స్ ఉన్న టాప్-5 ట్యాబ్స్ గురించి తెలుసుకుందాం.
1. Samsung Galaxy Tab A8 Specifications
- బ్రాండ్ : శాంసంగ్
- మోడల్ : SM-X205NZAAINU
- మెమొరీ స్టోరేజ్ : 32 జీబీ
- స్క్రీన్ సైజ్ : 26.69 సెం.మీ
- డిస్ప్లే రిజల్యూషన్ : 1920 1200
Pros
- ఇంటర్నల్ మెమొరీని 1 టిబీ వరకు పెంచుకునే సౌలభ్యం ఉంది.
- ఈ ట్యాబ్‌లో మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది. ట్యాబ్‌లో క్వాడ్ స్పీకర్లు ఉంటాయి.
- 15W ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యం ఉంది.
- ఈ Samsung Galaxy Tabలో ఆండ్రాయిడ్ 11.0 వెర్షన్ ఉంటుంది.
- ఈ ట్యాబ్‌లో UniSOC T618 octa-core ప్రాసెసర్ ఉంటుంది.
Samsung Galaxy Tab A8 price : ప్రస్తుతం మార్కెట్లో ఈ ట్యాబ్ ధర రూ.16,000గా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2.realme Pad Mini WiFi+4G Tablet Specifications
- డిస్ప్లే : 22.1 సెం.మీ HD డిస్ప్లే
- ప్రైమరీ కెమెరా : 8MP
- ఫ్రంట్ కెమెరా : 5 MP
- ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 11
- బ్యాటరీ : 6400 MAh లిథియం-అయాన్
- ప్రాసెసర్ : UNISOC T616 Octa-Core
- నెట్వర్క్ : వాయిస్ కాల్ ( డ్యూయల్ సిమ్, జీఎస్ఎమ్, WCDMA, LTE FDD, TD-LTE)
Pros
- ఈ ట్యాబ్‌లో 6 జీబీ ర్యామ్ ఉంటుంది. కనుక ఇది మల్టీటాస్క్ంగ్కు అనుకూలంగా ఉంటుంది.
- ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
- 6400mAh సామర్ధ్యం గల బ్యాటరీ ఉంది.
- శక్తిమంతమైన ప్రాసెసర్ ఈ ట్యాబ్‌లో ఉంది.
- వివిధ నెట్వర్క్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది.
Realme Pad Mini Tablet price : ప్రస్తుతం మార్కెట్లో ఈ ట్యాబ్ ధర రూ.14,999గా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. OnePlus Pad Go Tablet Specifications
- బ్రాండ్ : వన్‌ప్లస్
- మోడల్ : OnePlus Pad Go
- మెమొరీ స్టోరేజ్ కెపాసిటీ : 128 జీబీ
- స్క్రీన్ సైజ్ : 28.85 సె.మీ
- డిస్ప్లే రిజల్యూషన్ : 2408 x 1720 Pixels
- ఐకేర్ ఫీచర్లు : లో బ్లూ లైట్
Pros:
- ఈ ట్యాబ్‌లో ఐకేర్ ఫీచర్లు ఉన్నాయి.
- ఈ ట్యాబ్ స్క్రీన్ సైజ్ 28.85 సెం.మీగా ఉంటుంది.
- డిస్ప్లే రిజల్యూషన్ 2408X1720 పిక్సెల్స్ ఉంటుంది.
- 33W SUPERVOOC టెక్నాలజీ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంది.
- ఈ ట్యాబ్ Android Oxygen OS 13.2 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
OnePlus Pad Go Tablet Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ ట్యాబ్ ధర రూ.19,999గా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. HONOR Pad X8 Specifications
- బ్రాండ్ : హానర్
- మోడల్ : AGM3-W09HN
- మెమరీ : 64 జీబీ
- స్క్రీన్ సైజ్ : 10.1 అంగుళాలు
- డిస్ప్లే రిజల్యూషన్ : 1920x1200 పిక్సెల్‌లు
Pros
- ట్యాబ్ కేవలం 460 గ్రాముల బరువు ఉంటుంది. దీనివల్ల సులభంగా ఎక్కడైనా తీసుకువెళ్లవచ్చు.
- The Split-Screen ఫీచర్‌తో అనేక యాప్‌లను ఒకే సమయంలో ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది.
- ఈ ట్యాబ్ న్యూ మ్యాజిక్ ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌తో యూఐ 6.1 ఆధారంగా పనిచేస్తుంది.
- ఈ ట్యాబ్‌లో మీడియా టెక్ MT8786 8-core ప్రాసెసర్ ఉంటుంది.
- ఆన్లైన్ క్లాస్‌లు, ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ మీటింగ్‌లు, గేమింగ్‌లకు ఇది చాలా బాగుంటుంది.
HONOR Pad X8 Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ ట్యాబ్ ధర రూ.9,999ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Lenovo Tab M10 Specifications
- స్క్రీన్ సైజు : 10.61 అంగుళాలు
- డిస్ప్లే రిజల్యూషన్ : 2000 x 1200
- సౌండ్ సిస్టమ్ : 4 స్పీకర్లు, 1WX4 డాల్బీ ఆటమ్స్
- స్టోరేజ్, బ్యాటరీ : 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- బ్యాటరీ : 7700 mAh
Pros:
- డాల్బీ ఆటమ్స్ ఆప్టిమైజ్డ్ 4 స్పీకర్ సిస్టమ్
- ఈ ట్యాబ్‌లో స్నాప్‌డ్రాగన్ ఎస్డీఎమ్ 680 ప్రాసెసర్ ఉంటుంది.
- దీనిలో 7700 mAh బ్యాటరీ ఈ ట్యాబ్‌లో ఉంటుంది.
- దీనిలో 8 ఎంపీ హై క్వాలిటీ కెమెరా, 8 ఎంపీ రియర్ కెమెరా ఉన్నాయి.
- గూగుల్ కిడ్స్ ఆప్షన్ ఉంది. దీనితో పిల్లలకు చూడకూడని వాటిని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు.
Lenovo Tab M10 Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ ట్యాబ్ ధర రూ.15,998గా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మీ స్మార్ట్‌ఫోన్ డ్యామేజ్ కాకుండా క్లీన్ చేయాలా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!