ETV Bharat / technology

రూ.35,000 బడ్జెట్లో మంచి ఫ్లాగ్​షిప్ ఫోన్​ కొనాలా? టాప్​-7 మోడల్స్ ఇవే! - Best Phones Under 35000

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2024, 1:28 PM IST

Best Phones Under 35000 : అదిరే ఫీచర్స్​, స్పెషిఫికేషన్స్​, కెమెరా కేపబిలిటీస్​ ఉన్న ఫ్లాగ్​షిప్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఇందు కోసం రూ.35,000 వరకు బడ్జెట్ పెట్టగలరా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్​-7 ఫ్లాగ్​షిప్​ ఫోన్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Best Phones Under 35000
Best Phones Under 35000 (ETV Bharat)

Best Phones Under 35000 : యువతలో ఉన్న క్రేజ్​ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ​ ఎలక్ట్రానిక్ కంపెనీలు అన్నీ మీడియం బడ్జెట్లో మంచి ఫ్లాగ్​షిప్ ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. వీటిలో లేటెస్ట్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లను పొందుపరుస్తున్నాయి. ప్రొఫెషనల్ డీఎస్​ఎల్​ఆర్​ కెమెరాలకు దీటుగా కటింగ్ ఎడ్జ్​ కెమెరా ఫీచర్లను అందిస్తున్నాయి. పవర్​ఫుల్ ప్రాసెసర్లు, బ్యాటరీలను వాటిలో ఇన్​స్టాల్ చేసి ఇస్తున్నాయి. అందుకే వీటికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. మరి మీరు కూడా ఇలాంటి మంచి ఫ్లాగ్​షిప్ ఫోన్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం రూ.35వేల బడ్జెట్లో దొరుకుతున్న టాప్​-10 మొబైల్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

1. Samsung Galaxy S21 FE 5G : ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ ప్లాగ్​షిప్​ ఫోన్లలో శాంసంగ్​ గెలాక్సీ ఎస్​21 ఎఫ్​ఈ 5జీ ఒకటి. దీని ధర సుమారుగా రూ.27,729 ఉంటుంది. ఇది క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 888 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 8జీబీ ర్యామ్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​ 13.0తో రన్​ అవుతుంది. ఈ మొబైల్​ 6.4 అంగుళాల ఫుల్​ హెచ్​డీ + డైనమిక్​ అమోలెడ్​ 2x డిస్​ప్లే, కార్నింగ్ గొరిల్లా క్లాస్​ విక్టస్​ ప్రొటక్షన్​తో వస్తుంది. కెమెరా సెటప్​ విషయానికి వస్తే, వెనుక వైపు 12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ ఆల్ట్రా-వైడ్ కెమెరా, 8 ఎంపీ టెలిఫొటో కెమెరాలు ఉంటాయి. ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

2. Oppo F27 Pro 5G : ఒప్పో ఎఫ్​27 ప్రో+ 5జీ ధర సుమారుగా రూ.29,999 ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్​ ఆక్టా-కోర్​ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్​ 14 బేస్డ్​ కలర్​ఓఎస్​ 14.0తో ఇది రన్ అవుతుంది. ఈ కెమెరాలో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్​ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్​ సెకెండరీ సెన్సార్​, 8 మెగా పిక్సెల్​ ఫ్రంట్ కెమెరా ఉంటాయి.

3. Realme GT 6T 5G : రియల్​మీ జీటీ 6టీ 5జీ ఫోన్​లో పవర్​ఫుల్​ స్నాప్​డ్రాగన్​ 7+ జెన్​ 3 చిప్​సెట్ ఉంది. ఈ ఫోన్​ ఆండ్రాయిడ్ బేస్డ్​ రియల్​మీ యూఐ 5తో రన్ అవుతుంది. ఈ మొబైల్​ 6.78 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ఎల్​టీపీఓ అమోలెడ్​ స్క్రీన్​తో వస్తుంది. కెమెరాలు, వీడియోలు తీయడానికి ఇందులో 50 మెగాపిక్సెల్​ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్​ వైడ్ యాంగిల్​ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ సోనీ IMX615 సెన్సార్ ఉంది. ఈ కెమెరాలో 5500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120వాట్ సూపర్​వూక్ ఛార్జింగ్​కు సపోర్ట్​ చేస్తుంది. మార్కెట్లో ఈ రియల్​మీ ఫోన్ ధర సుమారుగా రూ.30,999 ఉంటుంది.

4. OnePlus Nord 4 5G : భారత్​లో మోస్ట్​ పాపులర్ ఫోన్లలో వన్​ప్లస్​ నార్డ్ 4 5జీ ఒకటి. దీనిలో ఆక్టా-కోర్ స్నాప్​డ్రాగన్​ 7+ జెన్​ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 8జీబీ ర్యామ్​, అడ్రెనో 732 జీపీయూతో వస్తుంది. ఈ ఫోన్​ ఆండ్రాయిడ్​ 14 విత్​ ఆక్సిజన్ఓఎస్​ 14.1తో పనిచేస్తుంది. ఈ మొబైల్​ 6.74 అంగుళాల అమోలెడ్ డిస్​ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్​ 5జీ, 4జీ ఎల్​టీఈ, వైఫై6, బ్లూటూత్​ 5.4, జీపీఎస్​, గ్లోనస్​, బీడీఎస్​, గెలీలియో, ఎన్​ఎఫ్​సీ, క్యూజెడ్​ఎస్​ఎస్, యూఎస్​బీ టైప్​-సీ పోర్టు కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది. దీని ధర సుమారుగా రూ.32,999 ఉంటుంది.

5. Motorola razr 40 : మార్కెట్లో మోటరోలా రేజర్ 40 ధర సుమారుగా రూ.34,999 ఉంది. ఈ ఫోన్​ 6.9 అంగుళాల పీఓఎల్​ఈడీ డిస్​ప్లే, ఫుల్​ హెచ్​డీ రిజల్యూషన్​తో వస్తుంది. దీనిలో స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫ్లాగ్​షిప్​ ఫోన్​ 8 జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. ఈ ఫోన్​లో డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 64 మెగాపిక్సెల్​ ప్రైమరీ సెన్సార్​, 12 మెగాపిక్సెల్​ ఆల్ట్రా-వైడ్​ కెమెరా, 32 మెగా పిక్సెల్​ ఫ్రంట్ కెమెరా దీనిలో ఉంటాయి. మీడియం బడ్జెట్లో మంచి ఫ్లాగ్​షిప్ ఫోన్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

6. IQOO Neo9 Pro 5G : మార్కెట్లో ఉన్న క్రేజీ ఫోన్లలో ఐకూ నియో9 ప్రో 5జీ ఒకటి. ఈ ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 చిప్​సెట్​ అమర్చారు. దీనిలో 12 జీబీ ర్యామ్​ ఉంటుంది. ఈ మొబైల్​ ఫన్​టచ్​ ఓఎస్​ 14 బేస్డ్ ఆండ్రాయిడ్​ 14తో రన్​ అవుతుంది. ఈ ఫోన్​లో 6.78 అంగుళాల ఎల్​టీపీఓ అమోలెడ్ డిస్​ప్లే ఉంది. దీని ధర సుమారుగా రూ.34,999గా ఉంది.

7. Redmi Note 13 Pro Plus : రెడ్​మీ నోట్​ 13 ప్రో+లో 6.67 అంగుళాల అమోలెడ్​ స్క్రీన్ ఉంది. ఇది కార్నింగ్​ గొరిల్లా గ్లాస్ విక్టస్​ ప్రొటెక్షన్​తో వస్తుంది. ఈ మొబైల్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 7200 ఆల్ట్రా ప్రాసెసర్​ ఉంది. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్​తో వస్తుంది. దీనిలో ప్రధానంగా 200 మెగాపిక్సెల్​ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్​ ఆల్ట్రావైడ్​, 2 మెగా పిక్సెల్​ మ్యాక్రో రియర్​ కెమెరాలు, 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఫొటో లవర్స్​కు ఈ మొబైల్ చాలా బాగుంటుంది. మార్కెట్లో ఈ ఫ్లాగ్​షిప్ ఫోన్ ధర సుమారుగా రూ.35,500 ఉంటుంది.

నోట్​ : మొబైల్ ఫోన్ల ధరలు చాలా వేగంగా మారిపోతుంటాయి. కనుక ఫోన్స్ కొనేముందు కచ్చితంగా వివిధ వెబ్​సైట్లలోని ధరలను సరిపోల్చుకోవడం చాలా మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.