Best Mobile phones under 25000 : ప్రస్తుత కాలంలో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ సాధారణమైపోయింది. ముఖ్యంగా మంచి ఫీచర్లు, కెమెరా క్వాలిటీ ఉన్న ఫోన్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఇష్టపడుతున్నారు. అందుకే రూ.25వేల బడ్జెట్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-5 ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. OnePlus Nord CE 4 : మంచి కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్ కొనాలనుకునేవారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 6.7 అంగుళాల అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 2412 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ ఆప్షన్లతో ఈ స్మార్ట్ ఫోన్ 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్‌ను కూడా కలిగి ఉంది.
- డిస్‌ప్లే : 6.7 అంగుళాలు
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓపీ
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 5500 mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ
- ధర : రూ.24,999
2. Infinix GT 20 Pro : ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో మొబైల్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీఎస్ అమోల్డ్ డిస్ప్లేతో లభిస్తుంది. 1300 నిట్స్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. పిక్సెల్ వర్క్స్ ఎక్స్ 5 టర్బో పేరుతో ప్రత్యేకమైన గేమింగ్ డిస్‌ప్లే చిప్‌తో కూడా వస్తుంది. 45W అడాప్టర్ ద్వారా వేగంగా ఈ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 8200
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 256 జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- రియర్ కెమెరా : 108 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 32 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
- ధర : రూ.24,999
3. Poco X6 Pro : పోకో ఎక్స్6 ప్రో ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌ను కలిగి ఉంది. ఐపీ54 రేటింగ్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. యూఎస్బీ సీ- పోర్ట్ ఛార్జర్‌తో దీనికి ఛార్జ్ చేసుకోవచ్చు. దీని బ్యాటరీ లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది.
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 8300 అల్ట్రా ఎస్ఓసీ
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 256 జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- రియర్ కెమెరా : 64 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
- ధర : రూ.23,490
4. Nothing Phone 2a : ఈ ఫోన్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్, రెండు హెచ్‌డీ మైక్రోఫోన్స్ ఉన్నాయి. 1080x 2412 పిక్సెల్స్ రిజల్యూషన్, 240 Hz టచ్ శాంప్లింగ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ లభిస్తుంది.
- డిస్‌ప్లే : 6.7 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 7200
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 32 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
- ధర : రూ.24,445
5. Motorola Edge 50 Fusion : మోటారోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ మంచి భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పోలెడ్ కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. సురక్షిత అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఈ-కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్‌లతో లభిస్తుంది.
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 32 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
- ధర : రూ. 23,390
రూ.10వేల బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Smartphones Under 10000