Best Mobile Phones Under 20000 : నేడు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది. బెస్ట్ ఫీచర్స్, స్పెక్స్ ఉన్న ఫోన్లు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. కానీ వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటిని ప్రతిఒక్కరూ కొనలేరు. దీనిని దృష్టిలో ఉంచుకునే, ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు అన్నీ తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లు ఉన్న మొబైల్స్‌ను రూపొందించి, మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో రూ.20,000 బడ్జెట్లోని టాప్-5 స్మార్ట్ఫోన్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. OnePlus Nord CE 3 Lite 5G Features : రూ.20 వేలు బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో మంచి ఫీచర్స్, స్పెక్స్ ఉన్నాయి. దీనిలోని కెమెరాలు హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీయడానికి చాలా అనువుగా ఉంటాయి.
- డిస్ప్లే : 6.2 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 256 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 108 MP + 2MP + 2 MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP
OnePlus Nord CE 3 Lite 5G Price : మార్కెట్లో ఈ వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.19,392 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. IQOO Z7 5G Features : సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవారికి ఈ ఐకూ జెడ్7 స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది. దీనితో బెస్ట్ ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి వీలవుతుంది. తక్కువ బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
- డిస్ప్లే : 6.38 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్
- ర్యామ్ : 6 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 4500 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 64 MP +2 MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP
IQOO Z7 5G Price : మార్కెట్లో ఈ ఐకూ జెడ్7 5జీ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.18,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Samsung Galaxy A14 5G Features : తక్కువ బడ్జెట్లో మంచి బ్రాండెడ్ ఫోన్ కొనాలని అనుకునేవారికి శాంసంగ్ గెలాక్సీ ఏ14 మంచి ఆప్షన్ అవుతుంది.
- డిస్ప్లే : 6.6 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : ఆక్టా-కోర్ 2.4GHz ప్రాసెసర్
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 50 MP +2 MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP
Samsung Galaxy A14 5G Price : మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ14 స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.18,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. Vivo T2 5G Features : రూ.20 వేలు బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కొనాలని అనుకునేవారికి వివో టీ2 స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది.
- డిస్ప్లే : 6.38 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
- ర్యామ్ : 6 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 4500 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 64 MP +2 MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP
Vivo T2 5G Price : మార్కెట్లో ఈ వివో టీ2 స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.16,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Redmi Note 13 5G Features : మంచి పెర్ఫార్మెన్స్, బెస్ట్ డిస్ప్లే, కెమెరా ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనాలని అనుకునేవారికి రెడ్మీ నోట్ 13 మంచి ఆప్షన్ అవుతుంది.
- డిస్ప్లే : 6.67 అంగుళాల 120Hz అమోలెడ్ డిస్ప్లే
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
- ర్యామ్ : 6 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 64 MP +2 MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP
- ఫాస్ట్ ఛార్జింగ్ : 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Redmi Note 13 5G Price : మార్కెట్లో ఈ రెడ్మీ నోట్ 13 స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.17,999 వరకు ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గూగుల్ పే చెల్లింపుల్లో సమస్యాలా? ఈ మూడు టిప్స్ మీకోసమే
స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించాలా? ఈ టాప్-7 మూవీస్ తప్పక చూడండి!