ETV Bharat / technology

ఈ వర్షాకాలాన్ని మరింత ఎంజాయ్ చేయాలా?- వీటితో ఫుల్ మస్తీ! - Best Gadgets For Monsoon - BEST GADGETS FOR MONSOON

Best Gadgets For Monsoon: వర్షాకాలం మొదలైంది. ఈ కాలంలో ఎక్కడ చూసినా తడి తడిగా ఉంటుంది. అలాంటి సందర్భంలో చికాకుగా ఉంటుంది. ఏ పనీ చేయబుద్ధి కాదు. అయితే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే వర్షాకాలాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Best_Gadgets_For_Monsoon
Best_Gadgets_For_Monsoon (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Aug 30, 2024, 7:28 PM IST

Best Gadgets For Monsoon: వర్షాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షపు చినుకులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే వర్షాకాలం ఆనందాలతో పాటు రోగాలనూ వెంట తీసుకొస్తుంది. ఈ కాలంలో ఎక్కడ చూసినా తేమ ఎక్కువగా ఉండటంతో చాలా చికాకుగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మన ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మాన్​సూన్​ ఎంజాయ్​మెంట్ మామూలుగా ఉండదు! అవేంటంటే?

1. Vacuum Cleaner: వర్షాకాలంలో ఎక్కడ చూసినా తడి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇంట్లో పొడి వాతావరణం ఉండాలని అంతా కోరుకుంటారు. ఈ కాలంలో ఇంటిని క్లీన్ చేయటానికి కచ్చితంగా వాక్యూమ్ క్లీనర్ అవసరం. వాక్యూమ్ క్లీనర్ కొనాలనుకునే వారికి 'Philips PowerPro' ఒక చక్కటి ఎంపిక. ఇది అమెజాన్​లో రూ. 8,999కు లభిస్తుంది.

Philips_PowerPro_Vacuum_Cleaner
Philips_PowerPro_Vacuum_Cleaner (Philips)

2. Robotic Vacuum Cleaner: వర్షాకాలంలో ఏ పని చేయాలన్నా కాస్త బద్ధకంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్లకు ఇంటిని శుభ్రం చేసుకునేందుకు రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ కొనాలనుకునే వారికి 'ECOVACS Deebot U2 Pro' మంచి ఎంపిక. ఇది అమెజాన్​లో రూ.14,900కు అందుబాటులో ఉంది. టైల్స్, కార్పెట్స్, ఉడెన్ ఫ్లోరింగ్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇది అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్​లను సపోర్ట్ చేస్తుంది.

ECOVACS_Deebot_U2_Pro_Robotic_Vacuum_Cleaner
ECOVACS_Deebot_U2_Pro_Robotic_Vacuum_Cleaner (ECOVACS)

3. SHARP Electric Home Dehumidifier: వర్షాకాలంలో ముఖ్యంగా అందరూ ఎదుర్కొనే పెద్ద సమస్య దుస్తుల దుర్వాసన. బయట వర్షం పడటంతో దుస్తులు సరిగా ఆరవు. అలాంటి సమయంలో డీహ్యూమిడిఫైయర్‌ బాగా ఉపయోగపడుతుంది. బడ్జెట్ ధరలో క్వాలిటీతో మార్కెట్లో 'షార్ప్ ఎలక్ట్రిక్ హోమ్ డీహ్యూమిడిఫైయర్' లభిస్తుంది. దీని ధర కేవలం రూ.24,988 మాత్రమే. ఇది ఆటో-డ్రై, లాండ్రీ, ప్రీ-ఫిల్టర్ మోడ్‌లను కలిగి ఉంది.

SHARP_Electric_Home_Dehumidifier
SHARP_Electric_Home_Dehumidifier (SHARP)

4. Philips Drip Coffee Maker: వర్షం పడుతున్న సమయంలో వేడి వేడి కాఫీ ఆస్వాదిస్తుంటే ఆ ఫీల్ వేరే లెవల్​. అలాంటి సందర్భాల్లో బయట దొరికే కాఫీ కంటే ఇంట్లో వేడి వేడిగా కాఫీ తయారు చేసుకుని తాగితే బాగుంటుంది. మీరు కాఫీ ప్రియులైతే వెంటనే 'ఫిలిప్స్ డ్రిప్ కాఫీ మేకర్'​ను కొనుగోలు చేయండి. అమెజాన్​లో ఇది రూ.3,116కు లభిస్తుంది. ఇది 750W మోటార్‌ను కలిగి ఉంది.

Philips_Drip_Coffee_Maker
Philips_Drip_Coffee_Maker (Philips)

5. Havells Electric Kettle Aqua Plus: వర్షాకాలంలో చల్లటి నీటిని తాగటం కంటే గోరువెచ్చని నీటిని తాగటం ఉత్తమం. అలాంటి సందర్భాల్లో నీటిని మరగబెట్టేందుకు ఎలక్ట్రిక్ కెటిల్ బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో సరసమైన ధరలో ఉత్తమ క్వాలిటీతో 'హావెల్స్ ఎలక్ట్రిక్ కెటిల్ ఆక్వా ప్లస్' కెటిల్ అందుబాటులో ఉంది. వంటగదిలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా ప్రయాణాలు చేసే సమయంలో ఇది మరింత ఉపయోగపడుతుంది. దీని కెపాసిటీ 1.2 లీటర్లు.

Havells_Electric_Kettle_Aqua_Plus
Havells_Electric_Kettle_Aqua_Plus (Havells)

6. JBL Go 3 Water Resistant Speaker: వర్షాకాలంలో వేడివేడిగా బజ్జీలు కానీ, పకోడీ కానీ తింటూ మంచి సాంగ్స్ వింటే ఆ అనుభూతి మామూలుగా ఉండదు. అందుకోసం మంచి వైర్​లెస్, వాటర్​ఫ్రూప్ బ్లూటూత్​ స్పీకర్ ఉంటే ఆ ఫీల్​ను మరింత ఎంజాయ్ చేయగలుగుతాం. అందుకోసం తక్కువ ధరలో 'JBL Go 3' వాటర్ రెసిస్టెంట్ స్పీకర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 5గంటల వరకూ పనిచేస్తుంది.

JBL_Go_3_Water_Resistant_Speaker
JBL_Go_3_Water_Resistant_Speaker (JBL)

మార్కెట్లో ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్- ఫస్ట్​లుక్​ మామూలుగా లేదుగా! - Tecno Phantom Ultimate 2 FIRST LOOK

శాంసంగ్ ఫోన్లపై అదిరే ఆఫర్స్- రూ.6వేల వరకు భారీ తగ్గింపు! - huge discounts on samsung phones

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.