ETV Bharat / technology

ఇట్స్ అమేజింగ్ : ఇక ఏ దొంగా మీ ఇంట్లోకి వెళ్లలేడు - మార్కెట్లోకి ఫింగర్ ​ప్రింట్​ తాళాలు వచ్చేశాయ్! - Best Fingerprint Padlocks - BEST FINGERPRINT PADLOCKS

Biometric Padlocks : ఇంటికి తాళం వేసిన తర్వాత కీ ఎక్కడో పోవడం.. తాళం పగలగొట్టడం చాలా మందికి అనుభవమే. ఎవరూ లేని సమయంలో దొంగలు తాళం పగలగొట్టి ఇల్లు ఊడ్చేసిన ఘటనలూ అనేకం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా వేలి ముద్రతో తెరుచుకునే తాళాలు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేశాయి! ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Biometric Padlocks
Fingerprint Door Locks (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 12:33 PM IST

Fingerprint Door Locks : మనం బయటకు వెళ్తున్నప్పుడు ఇంటికి రక్షణగా తాళాలు వేస్తుంటాం. అయితే.. కొన్నిసార్లు లాక్​ ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, లేదంటే పోగొట్టుకోవడం జరుగుతుంటాయి. దీంతో తప్పనిసరి పరిస్థితులలో తాళం పగలగొడుతుంటాం. ఇక.. చోరీకి వచ్చిన దొంగలు కూడా తాళం పగలగొడుతుంటారు. ఇకపై ఈ పరిస్థితి రాకుండా.. మీరు తాళం మరిచిపోయినా ఇబ్బంది లేకుండా.. దొంగలెవరూ ఇంట్లోకి వెళ్లలేకుండా.. ఫింగర్​ప్రింట్స్​​ ప్యాడ్​లాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి బయోమెట్రిక్ సిస్టమ్​తో పనిచేస్తాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బయోమెట్రిక్ డోర్ లాక్ అంటే ఏమిటి?: ప్రస్తుతం మార్కెట్‌లో బయోమెట్రిక్ డోర్ లాక్స్​కి డిమాండ్ బాగా పెరుగుతోంది. బయోమెట్రిక్ అనేది మీ వేలిముద్రను స్కాన్ చేసి దాని డేటాను నిల్వ చేసే సిస్టమ్. రేషన్ షాపు, ఆధార్ సెంటర్లో ఉపయోగించే మెషీన్ లాంటిది. ఈ తాళాలు టచ్ ప్యానెల్ కలిగి ఉంటాయి. ఇందులో థర్మల్ లేదా ఆప్టికల్ స్కానర్ ఉంటుంది. ఇక్కడే వేలు పెడతారు. అప్పుడు.. స్క్రీన్‌లోని సెన్సార్స్ మీ వేలిముద్రను స్కాన్ చేసి, నిల్వ చేసిన డేటాతో సరిపోల్చుతాయి. డేటా సరిపోలిన తర్వాత లాక్ తెరుచుకుంటుంది.

హోమ్స్ ఫింగర్ ప్రింట్ లాక్ ప్యాడ్స్ : ఫింగర్ ప్రింట్ లాక్స్ లో చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో హోమ్స్ ఫింగర్ ప్రింట్ లాక్ ప్యాడ్స్ ఒక రకం. ఇందులో ఇద్దరి వేలిముద్రలను నమోదు చేయొచ్చు. ఇవి ఇళ్లు లేదా ఆఫీసులకు చాలా బాగా సెట్​ అవుతాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు. అలాగే ఇది బ్యాటరీ సాయంతో నడుస్తుంది. కాబట్టి దీన్ని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. USB కేబుల్‌ సాయంతో ఛార్జ్ చేయవచ్చు. ఈ lock pads ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి. ధర కూడా అందుబాటులోనే ఉంది.

హై-స్పీడ్, బెస్ట్​​ పెర్ఫామెన్స్ ఇచ్చే​ బిజినెస్ ల్యాప్​టాప్​ కొనాలా? టాప్​ ఆప్షన్స్​ ఇవే! - Best Performance Laptops

రగ్గడ్ స్మార్ట్ ఫింగర్ ప్రింట్ ప్యాడ్‌లాక్ (Rugged Smart Fingerprint Padlock): ఈ ప్యాడ్​లాక్​ కూడా చక్కగా యూజ్​ అవుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులో మెయిన్​ ఫీచర్​ ఏంటంటే.. 10 మంది వేలిముద్రలను నమోదు చేయవచ్చు. పెద్ద కుటుంబాలకు ఇది సూపర్​గా సెట్​ అవుతుంది. అంటే కుటుంబ సభ్యులలో ఒకరు అందుబాటులో లేకపోయినా.. మరొకరి వేలిముద్ర ద్వారా దానిని ఓపెన్​ చేయవచ్చు. ఈ లాక్​లు సాధారణ తాళాల కంటే కొంచెం ఖరీదైనవి కానీ పూర్తి భద్రతను అందిస్తాయంటున్నారు.

స్మార్ట్ హెవీడ్యూటీ ఫింగర్ ప్రింట్ ప్యాడ్‌లాక్ (Smart Heavy-duty Fingerprint Padlock): ఇది యాప్ సపోర్ట్‌తో వస్తుందని నిపుణులు అంటున్నారు. అంటే మీరు దాని యాప్‌ని Google Play Store లేదా Apple App Store నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చంటున్నారు. అలాగే మొబైల్ నుంచి మీ లాక్ సిస్టమ్‌ను కంట్రోల్​ చేయవచ్చని చెబుతున్నారు.

స్మార్ట్​ ఫింగర్ ​ప్రింట్​ ప్యాడ్​లాక్​: ఈ ఫింగర్​ప్రింట్​ ప్యాడ్​లాక్​ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఫింగర్​ప్రింట్​ లేదా మొబైల్​ యాప్​ ద్వారా దీనిని యాక్సెస్​ చేయవచ్చని నిపుణులు అంటున్నారు. పైగా ఇది వాటర్​ఫ్రూప్​లో లభిస్తుంది. ఇది కేవలం డోర్స్​కు మాత్రమే కాకుండా బ్యాగ్స్​, సూట్​కేస్​, బైక్స్​ వంటి వాటికి కూడా యూజ్​ చేయవచ్చు. ఈ లాక్ సిస్టమ్స్​ అన్నీ ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి.

రూ.10వేల బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Smartphones Under 10000

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.