Best Mobile Phones Under 15000: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం సర్వసాధారణం అయిపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అత్యధికంగా మొబైల్స్ అమ్ముడవుతున్న నేపథ్యంలో అన్ని కంపెనీలు మార్కెట్‌కు అనుగుణంగా సరికొత్త స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేయడానికి ఉత్సాహం కనబరుస్తున్నాయి.
కేవలం రూ.15వేల లోపు ఫ్రెడ్లీ బడ్జెట్లో ప్రతి నెలా కనీసం 2 నుంచి 4 మోడల్స్‌లో స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో కొత్త ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉన్న కస్టమర్లు ఏ ఫోన్ ఎంచుకోవాలో తెలియక చాలా తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy M34 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung కంపెనీ తన కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో Samsung Galaxy M34 5G అనే 'M' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసింది.
ఫీచర్లు
- డిస్ప్లే : 6.5 అంగుళాలు
- ప్రాసెసర్ : ఎక్సినాస్ 1280 చిప్సెట్
- ర్యామ్ : 6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 6,000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 13 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- ధర : రూ.13,888
Redmi Note 13 5G: మార్కెట్లో Redmi నోట్ సిరీస్ ఫోన్లు అత్యుత్తమ ఫీచర్లతో తక్కువ ధరకు లభిస్తున్నాయి. దీంతో ఈ స్మార్ట్ ఫోన్లను కొనేందుకు యూజర్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే Redmi Note 13 5G ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది.
ఫీచర్లు
- డిస్ప్లే : 6.67
- ప్రాసెసర్ : టీఎస్ఎంఎస్ 4ఎన్ఎం
- ర్యామ్ : 12 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 256 జీబీ
- బ్యాటరీ : 5,000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 108 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 16ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- ధర : రూ.14,905
Motorola G64 5G: Motorola మొబిలిటీ అనేది చైనీస్ కంపెనీ Lenovo అనుబంధ సంస్థ. మోటో ఇండియాలో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను లాంచ్ చేయడం మామూలే. ఈ క్రమంలోనే Moto G64 5G స్మార్ట్‌ఫోన్‌ను Motorola 'G' సిరీస్ లైన్‌లో ప్రవేశపెట్టారు.
ఫీచర్లు
- డిస్ప్లే : 6.5
- ప్రాసెసర్ : మీడియాటెక్ 7025 చిప్సెట్
- ర్యామ్ : 12 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 256 జీబీ
- బ్యాటరీ : 6,000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 15
- ధర : రూ.14,999
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్స్ లాంఛ్ - ధర, ఫీచర్ల వివరాలివే! - Google Pixel 9
మీకు మొబైల్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమా? ఈ టాప్-7 ఫోన్లపై ఓ లుక్కేయండి! - The Best Camera Phone 2024