Best Camera Phones Under 20000 : ప్రస్తుతం ఇండియాలో లభించని టాప్ బ్రాండ్ ఫోన్లు లేవంటే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఐఫోన్, శాంసంగ్ నుంచి షావోమీ, వన్‌ప్లస్ వరకు అన్ని రకాల బ్రాండెడ్ ఫోన్లు ఇండియాలో లభిస్తున్నాయి. వీటిలో రూ.20,000 బడ్జెట్లో మంచి కెమెరా ఫీచర్స్ ఉన్న టాప్-6 మొబైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Vivo T2 5G : ఇరవై వేల బడ్జెట్లో లభించే బెస్ట్ ఫోన్లలో వివో టీ2 5జీ ఒకటి. దీని బిల్డ్ క్వాలిటీ సూపర్‌గా ఉంటుంది. ఈ ఫోన్లో సూపర్ చిప్ ఉంది. అందువల్ల దీని పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దీనిలో మంచి కెమెరా సెటప్ ఉంది. ఇది సెల్ఫీ లవర్స్‌కు చాలా నచ్చుతుంది.
- డిస్ప్లే : 6.38 అంగుళాల మల్టీ-టచ్ స్క్రీన్
- ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 695
- ర్యామ్ : 6 జీబీ/ 8జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- రియర్ కెమెరా : 64ఎంపీ + 2ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 16ఎంపీ
- ఓఎస్ : ఫన్‌టచ్ ఓఎస్ 13 (బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 13)
- బ్యాటరీ : 4500mAh
Vivo T2 5G Price : మార్కెట్లో ఈ వివో టీ2 5జీ ఫోన్ ధర సుమారుగా రూ.15,799 ఉంటుంది.
2. OnePlus Nord CE2 Lite 5G : ఈ వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ ఫంక్షనాలిటీ, యూజబిలిటీ చాలా బాగుంటుంది. ఇది బహమాస్ బ్లూ, బ్లూ టైడ్, బ్లూ వాయిడ్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. ఫొటోగ్రఫీ లవర్స్‌కు ఇది చాలా బాగుంటుంది.
- డిస్ప్లే : 6.59 అంగుళాల స్క్రీన్
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695
- ర్యామ్ : 6 జీబీ/ 8జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- రియర్ కెమెరా : 64ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 16ఎంపీ
- ఓఎస్ : ఆక్సిజన్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 12
- బ్యాటరీ : 5000mAh
OnePlus Nord CE2 Lite 5G Price : మార్కెట్లో ఈ వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ ధర సుమారుగా రూ.17,999 ఉంటుంది.
3. Oppo A78 5G : ఈ ఒప్పో ఫోన్ 33వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే దీని బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఏఐ పోట్రైట్ రీటచింగ్, పోట్రైట్ మోడ్, మోనోక్రోమ్ వీడియో లాంటి బెస్ట్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. కనుక ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడేవారికి ఇది చాలా బాగుంటుంది.
- డిస్ప్లే : 6.67 అంగుళాల సూపర్ అమోలెడ్ స్క్రీన్
- ప్రాసెసర్ : మీడియాటెక్ 6833
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- రియర్ కెమెరా : 50ఎంపీ + 2ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13.0
- బ్యాటరీ : 5000mAh
Oppo A78 5G Price : మార్కెట్లో ఈ ఒప్పో ఏ78 5జీ ఫోన్ ధర సుమారుగా రూ.17,999 ఉంటుంది.
4. IQOO Z7s 5G : ఈ ఐకూ ఫోన్లో పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. అందువల్ల పవర్ఫుల్ గేమ్స్ ఆడుకోవడానికి వీలవుతుంది. అలాగే దీనిని సింగిల్ ఛార్జింగ్‌తో రోజంతా వాడుకోవచ్చు. దీని కెమెరా ఫీచర్స్ అద్భుతంగా ఉంటాయి. స్టేబుల్ కెమెరా షాట్స్ తీయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
- డిస్ప్లే : 6.38 అంగుళాలు
- ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్
- ర్యామ్ : 6జీబీ/ 8జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- రియర్ కెమెరా : 64ఎంపీ + 2ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 16ఎంపీ
- ఓఎస్ : ఫన్‌టచ్ ఓఎస్ 13 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 13
- బ్యాటరీ : 4500mAh
IQOO Z7s 5G Price : మార్కెట్లో ఈ ఐకూ జెడ్7ఎస్ 5జీ ఫోన్ ధర సుమారుగా రూ.16,999 ఉంటుంది.
5. Realme Narzo 60X 5G : ఇది స్లీక్ డిజైన్‌తో, మల్టీ టాస్కింగ్ కేపబిలిటీస్తో వస్తుంది. దీనిలో వివిడ్ కెమెరా సెటప్ ఉంది. సూపర్ క్లారిటీ వీడియోస్, ఫొటోస్ తీయడానికి ఇది అద్భుతంగా ఉంటుంది.
- డిస్ప్లే : 6.72 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5జీ చిప్సెట్
- ర్యామ్ : 4జీబీ/ 6జీబీ/ 8జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- రియర్ కెమెరా : 50ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8ఎంపీ
- ఓఎస్ : రియల్మీ యూఐ 4.0 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 13
- బ్యాటరీ : 5000mAh
Realme Narzo 60X 5G Price : మార్కెట్లో ఈ రియల్మీ నార్జో ఫోన్ ధర సుమారుగా రూ.12,499 ఉంటుంది.
6. Samsung Galaxy M14 5G : ఇరవై వేల రూపాయల బడ్జెట్లోని బెస్ట్ శాంసంగ్ ఫోన్ ఇది. దీని బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లో హై-ఎండ్ గేమ్స్ ఆడుకోవచ్చు. హై-క్వాలిటీ ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు.
- డిస్ప్లే : 6.6 అంగుళాలు
- ప్రాసెసర్ : 5ఎన్ఎం ఎక్సినోస్ 1330 ప్రాసెసర్
- ర్యామ్ : 4జీబీ/ 6జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- రియర్ కెమెరా : 50ఎంపీ+ 2ఎంపీ + 2ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 13ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13, వన్ యూఐ కోర్ 5.1
- బ్యాటరీ : 6000mAh
Samsung Galaxy M14 5G Price : మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ధర సుమారుగా రూ.13,990 ఉంటుంది.
మొదటిసారిగా AC కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - AC Buying Guide