Best Performance Laptops : ప్రస్తుత కాలంలో ఉద్యోగులు, స్టూడెంట్స్ వ్యాపారులు ఇలా చాలా మందికి ల్యాప్‌టాప్ అవసరం అవుతోంది. విద్యార్థులకు అయితే సాధారణ బేసిక్ ఫీచర్లతో ఉండే ల్యాప్‌టాప్‌లు సరిపోతాయి. కానీ బిజినెస్ కోసం వినియోగించాలంటే వాటిల్లో అదనపు ఫీచర్లు ఉండాలి. అధిక స్పెసిఫికేషన్లు కూడా అవసరమవుతాయి. అంతేకాకుండా వాటి పనితీరు కూడా వేగంగా ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మంచి పెర్ఫార్మెన్స్, స్పీడ్, పోర్టబిలిటీ ఉన్న ల్యాప్‌టాప్‌ను కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు యూజర్స్. ప్రస్తుతం మార్కెట్లో మంచి స్పెక్స్, ఫీచర్లతో అందుబాటులో ఉన్న టాప్ ల్యాప్‌టాప్స్‌పై ఓ లుక్కేద్దాం పదండి.
1. Lenovo ThinkPad X1 Yoga Gen 8 Specifications : ఈ మోడల్ ల్యాప్ టాప్ అందమైన డిస్ ప్లేను కలిగి ఉంటుంది. అలాగే మంచి సౌండ్ వచ్చే స్పీకర్లతో లభిస్తుంది. కీబోర్డు, మంచి క్వాలిటీ కెమెరాతో వస్తోంది. తరచూ వీడియోకాల్స్‌లో ఉండేవారికి ఈ ల్యాప్‌టాప్ మంచి ఆప్షన్ అవుతుంది.
- సీపీయూ: 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7
- జీపీయూ: ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్
- ర్యామ్: 32జీబీ వరకు LPDDR5
- స్టోరేజీ: 1టీజీ-4టీబీ PCIe NVMe M.2 ఎస్ఎస్డీ
- డైమెన్షన్స్: 0.61 x 12.38 x 8.75 in (15.53mm x 314.4 x 222.3 mm)
- బరువు: 1.38 కేజీలు
Lenovo ThinkPad X1 Yoga Gen 8 Price : మార్కెట్లో ఈ లెనోవో ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.1,91,741 ఉంటుంది.
2. Acer Travelmate P4 Specifications : ఈ మోడల్ ల్యాప్ టాప్ శక్తివంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీన్ని ఈజీగా అప్‌గ్రేడ్ చేయవచ్చు. మంచి బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. బిజినెస్, డిజైనింగ్, గేమింగ్‌కు మంచి ఆప్షన్ అవుతుంది.
- సీపీయూ: 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5
- జీపీయూ: ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్
- ర్యామ్: 8జీబీ DDR4 SDRAM
- స్టోరేజీ: 512జీపీ వరకు SSD M.2 PCIe
- డైమెన్షన్స్: 13.56 x 9.06 x 0.73 ins (344.4 x 230.1 x 18.5 mm)
- బరువు: 1.40 కేజీలు
Acer Travelmate P4 Price : మార్కెట్లో ఈ ఏసర్ ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.47,990 ఉంటుంది.
3. Apple MacBook Air 15-inch Specifications : ఈ మోడల్ ల్యాప్ టాప్ పెద్ద స్కీన్‌ను కలిగి ఉంటుంది. స్లిమ్ లైన్ డిజైన్‌తో లభిస్తుంది. బడ్జెట్లో ల్యాప్‌టాప్ కొనాలనుకునేవారికి మంచి ఎంపిక.
- సీపీయూ: Apple M2 8-core CPU
- జీపీయూ: 10-core ఇంటిగ్రేటెడ్ GPU
- ర్యామ్: 24జీబీ వరకు DDR5
- స్టోరేజీ: 2జీబీ వరకు SSD
- డైమెన్షన్స్: 13.4 x 9.35 x 0.45 in (340.36 x 237.6 x 11.5 mm)
- బరువు: 1.51 కేజీలు
Apple MacBook Air 15-inch Price : మార్కెట్లో ఈ యాపిల్ మ్యాక్‌బుక్ ధర సుమారుగా రూ.1,27,990 ఉంటుంది.
4. ASUS Zenbook Pro 14 Duo OLED Specifications : ఈ మోడల్ ల్యాప్ టాప్‌లో డ్యూయల్ స్క్రీన్లు ఉంటాయి. అందమైన ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తోంది.
- సీపీయూ: 13వ జనరేషన్ వరకు ఇంటెల్ కోర్ i9
- జీపీయూ: ఎన్విడియా జీఫోర్స్ RTX 4060 వరకు
- ర్యామ్: 32జీబీ వరకు
- స్టోరేజీ: 2టీజీ వరకు SSD
- డైమెన్షన్స్: 12.74 x 8.85 x 0.77 in (323.5 x 224.7 x 19.6 mm)
- బరువు: 1.75 కేజీలు
ASUS Zenbook Pro 14 Duo OLED Price : మార్కెట్లో ఈ ఏసర్ ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.2,19,990 ఉంటుంది.
5. Lenovo Yoga Book 9i Specifications : ఈ మోడల్ ల్యాప్ టాప్‌లో డ్యూయల్ స్క్రీన్లు ఉంటాయి. మల్టీపుల్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. ఐఆర్ కెమెరాను కలిగి ఉంటుంది.
- సీపీయూ: 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7
- జీపీయూ: ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్
- ర్యామ్: 16జీబీ LPDDR5X
- స్టోరేజీ: 1 టీబీ వరకు PCIe SSD
- డైమెన్షన్స్: 0.63 x 11.78 x 8.03 in (344.4 x 230.1 x 18.54 mm)
- బరువు: 1.34 కేజీలు
Lenovo Yoga Book 9i Price : మార్కెట్లో ఈ లెనోవో ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.1,67,042 ఉంటుంది.
6. Getac B360 Pro (2023) Specifications : ఈ మోడల్ ల్యాప్ టాప్ లో మల్టీపుల్ బ్యాటరీలు ఉంటాయి. మల్టీటాస్కింగ్‌కు ఉపయోగపడే ఈ ల్యాప్‌టాప్ లుక్ బాగుంటుంది. హై పెర్ఫామెన్స్ ఇచ్చే ల్యాప్‌టాప్ ధర కూడా అలానే ఉంటుంది.
- సీపీయూ: Up to 12th-Gen Intel Core i7 vPro
- జీపీయూ: ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్, ఎన్విడియా GTX 1650
- ర్యామ్: 64 జీబీ వరకు LPDDR5
- స్టోరేజీ: 2 టీబీ వరకు PCIe NVMe M.2 SSD
- డైమెన్షన్స్: 13.46 x 11.06 x 2.11 in (15.95 x 299.1 x 203.9 mm)
- బరువు: 3.08 కేజీలు
Getac B360 Pro Price : మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.3,17,539 ఉంటుంది.
7. Dell Latitude 9440 Specifications : ఈ మోడల్ ల్యాప్ టాప్ పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ బ్యాటరీ, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ ల్యాప్‌టాప్ మల్టీపుల్ కనెక్షన్ నెట్వర్క్ టెక్నాలజీతో బడ్జెట్ ధరలో వస్తోంది
- సీపీయూ: 13వ జనరేషన్ వరకు ఇంటెల్ కోర్ i7
- జీపీయూ: ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్
- ర్యామ్: 32 జీబీ LPDDR5
- స్టోరేజీ: 1 టీబీ వరకు PCIe NVMe M.2 SSD
- డైమెన్షన్స్: 12.02 x 8.46 x 0.64 in (310.5 x 215 x 16.28 mm)
- బరువు: 1.54 కేజీలు
Dell Latitude 9440 Price : మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.46,990 ఉంటుంది.
8. Framework Laptop 13 7040 Specifications : ఈ మోడల్ ల్యాప్ టాప్ మంచి బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. USB 4.0తో బడ్జెట్ ధరలో లభిస్తుంది.
- సీపీయూ: ఏఎమ్‌డీ రైజెన్ 7 7840U వరకు
- జీపీయూ: రేడియాన్ 780M గ్రాఫిక్స్
- ర్యామ్: 32డీబీ వరకు
- స్టోరేజీ: 1టీబీ వరకు NVMe M.2 2280
- డైమెన్షన్స్: 297 x 229 x 45mm
- బరువు: 1.3 కేజీలు
Framework Laptop 13 7040 : మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.74,490 ఉంటుంది.
9. HP Dragonfly G4 Specifications : ఈ మోడల్ ల్యాప్ టాప్ మంచి పనితీరును కనబరుస్తుంది. ఇది సన్నని, తేలికైన పోర్టబుల్ ల్యాప్ టాప్. అలాగే ఈ మోడల్ ల్యాప్‌టాప్ డిస్ప్లే, బ్యాటరీ సామర్థ్యం బాగుంటుంది.
- సీపీయూ: ఇంటెల్ కోర్ i5-1335U, ఇంటెల్ i7-1365U
- జీపీయూ: ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్
- ర్యామ్: 16జీబీ
- స్టోరేజీ: 256జీబీ - 512జీబీ PCIe NVMe SSD
- డైమెన్షన్స్: 11.7 x 8.67 x 0.64 in (297.18 x 220 x 16.25 mm)
- బరువు: 0.99kg కేజీలు
HP Dragonfly G4 Price : మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్ ధర సుమారుగా రూ.1,04,390 ఉంటుంది.