Apple MackBook Air M3 : యాపిల్ సంస్థ M3 చిప్ సెట్‌తో రెండు కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్‌ను లాంఛ్ చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్13 & 15 ఆకట్టుకునే పని తీరుతో ఉన్నాయి. పాత మ్యాక్‌బుక్ ఎయిర్ M1తో పొలిస్తే మ్యాక్‌బుక్ ఎయిర్ M3 60 శాతం స్పీడ్‌గా పనిచేస్తుంది. ఈ రెండు మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్‌ల బ్యాటరీ లైఫ్ 18 గంటలు. రెండు ల్యాప్‌టాప్‌లు కూడా ఎక్స్టర్నల్ డిస్ప్లే కలిగి ఉన్నాయి. ఈ రెండు ల్యాప్‌టాప్స్‌ను మార్చి 4 నుంచే ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ ఈ ల్యాప్‌టాప్‌లు మార్చి 8 నుంచి అందుబాటులో ఉంటాయి.
ఇది ఇంటెల్ పవర్డ్ మ్యాక్‌బుక్ కంటే ఇది 13 రెట్ల వేగవంతమైనది. ఈ మోడల్స్ వైఫై6 సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్‌లు ఫొటో, వీడియో ఎడిటింగ్‌లకు అద్భుతంగా ఉంటాయి. మ్యాక్‌బుక్ ఎయిర్ M3 మోడల్స్ హార్డ్‌వేర్- యాక్సిలరేటెడ్ మెష్ షేడింగ్, రే ట్రేసింగ్‌కు కలిగి ఉంటాయి. హైక్వాలిటీ వీడియోలను ఈ ల్యాప్‌టాప్‌ల్లో చూడవచ్చు. టచ్ ఐడీ సిస్టమ్‌తో వీటిని అన్‌లాక్ చేయవచ్చు. ఈ రెండు మోడల్స్ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
MacBook Air 13 : ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ 13 మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. MacBook Air 13 1st Variant : ఈ మోడల్ 8కోర్CPU , 8కోర్GPU కలిగి ఉంది.
స్టోరేజ్ : 8 జీబీ యూనిఫైడ్ మెమోరీ, 256 జీబీ SSD స్టోరేజ్
డిస్ప్లే : 34.46 సెం.మీ ( 13.6 అంగుళాలు) లిక్విడ్ రెటీనా డిస్ప్లే
కెమెరా : 1080p ఫేస్ టైమ్ హెచ్డీ కెమెరా
ఛార్జింగ్ : మెగాసేఫ్ 3 ఛార్టింగ్ పోర్ట్ , 30వాట్స్ USB-C పవర్ అడాప్టర్
మార్కెట్ ధర : రూ.1,14,900, EMI సౌకర్యం కూడా ఉంది.
2. MacBook Air 13 2nd Variant : ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ 13 మోడల్ 8కోర్ CPU , 10కోర్ GPU కలిగి ఉంది.
స్టోరేజ్ : 8 జీబీ యూనిఫైడ్ మెమోరీ, 512 జీబీ SSD స్టోరేజ్
డిస్ప్లే : 34.46సెం.మీ ( 13.6 అంగుళాలు) లిక్విడ్ రెటీనా డిస్ప్లే
కెమెరా : 1080p ఫేస్ టైమ్ హెచ్డీ కెమెరా
ఛార్జింగ్ : మెగాసేఫ్ 3 ఛార్టింగ్ పోర్ట్, 35W dual USB-C పవర్ అడాప్టర్
మార్కెట్ ధర : రూ.1,34,900 , EMI ఫెసిలిటీ కూడా ఉంది.
3. MacBook Air 13 3rd Variant : ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ 13 మోడల్ 8కోర్ CPU , 10కోర్ GPU కలిగి ఉంది.
స్టోరేజ్ : 16 జీబీ యూనిఫైడ్ మెమోరీ, 512 జీబీ SSD స్టోరేజ్
డిస్ప్లే : 34.46సెం.మీ ( 13.6 అంగుళాలు) లిక్విడ్ రెటీనా డిస్ప్లే
కెమెరా : 1080p ఫేస్ టైమ్ హెచ్డీ కెమెరా
ఛార్జింగ్ : మెగాసేఫ్ 3 ఛార్టింగ్ పోర్ట్, 35వాట్స్ dual USB-C పవర్ అడాప్టర్
మార్కెట్ ధర : రూ.1,54,900. దీనికి EMI సౌకర్యం కూడా ఉంది.
MacBook Air 15 Features : ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ 15 మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది.
1. MacBook Air 15 1st Variant : ఈ మోడల్ 8కోర్CPU , 10కోర్ GPU సామర్థ్యం కలిగి ఉంది.
స్టోరేజ్ : 8 జీబీ యూనిఫైడ్ మెమోరీ, 256 జీబీ SSD స్టోరేజ్
డిస్ప్లే : 38.91సెం.మీ ( 15.3 అంగుళాలు) లిక్విడ్ రెటీనా డిస్ప్లే
కెమెరా : 1080p ఫేస్ టైమ్ హెచ్డీ కెమెరా
ఛార్జింగ్ : మెగాసేఫ్ 3 ఛార్టింగ్ పోర్ట్, 35వాట్స్ డ్యూయల్ USB-C పవర్ అడాప్టర్
మార్కెట్ ధర : రూ.1,34,900, EMI కూడా అందుబాటులో ఉంది.
2. MacBook Air 15 2nd Variant : ఈ మ్యాక్‌బుక్ ఎయిర్15 మోడల్ 8కోర్CPU , 10కోర్ GPU కలిగి ఉంది.
స్టోరేజ్ : 8 జీబీ యూనిఫైడ్ మెమోరీ, 512 జీబీ SSD స్టోరేజ్
డిస్ప్లే : 38.91సెం.మీ ( 15.3 అంగుళాలు) లిక్విడ్ రెటీనా డిస్ప్లే
కెమెరా : 1080p ఫేస్ టైమ్ హెచ్డీ కెమెరా
ఛార్జింగ్ : మెగాసేఫ్ 3 ఛార్టింగ్ పోర్ట్, 35వాట్స్ డ్యూయల్ USB-C పవర్ అడాప్టర్
మార్కెట్ ధర : రూ.1,54,900, EMI ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది.
3. MacBook Air 15 2nd Variant : ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ 15 మోడల్ 8కోర్ CPU , 10కోర్ GPU సామర్థ్యం కలిగి ఉంది.
స్టోరేజ్ : 16 జీబీ యూనిఫైడ్ మెమోరీ, 512 జీబీ SSD స్టోరేజ్
డిస్ప్లే : 38.91సెం.మీ ( 15.3 అంగుళాలు) లిక్విడ్ రెటినా డిస్ప్లే
కెమెరా : 1080p ఫేస్ టైమ్ హెచ్డీ కెమెరా
ఛార్జింగ్ : మెగాసేఫ్ 3 ఛార్టింగ్ పోర్ట్, 35వాట్స్ డ్యూయల్ USB-C పవర్ అడాప్టర్
మార్కెట్ ధర : రూ.1,74,900, EMI కూడా అందుబాటులో ఉంది.
మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం సూపర్ యాప్ - స్కాన్ చేస్తే చాలు - సమాధానం వచ్చేస్తుంది!
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 స్మార్ట్‌ఫోన్ లాంఛ్ - ఫీచర్స్ అదుర్స్ - ధర ఎంతంటే?