Apple iOS 18 Update : యాపిల్ కంపెనీ తమ యూజర్ల కోసం సరికొత్త ఐఓఎస్ 18ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. బహుశా దీనిని 2024 సెప్టెంబర్‌లో రిలీజ్ చేయవచ్చని సమాచారం. యాపిల్ త్వరలో తన సరికొత్త ఐఫోన్ 16ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇంచుమించు అదే సమయంలో యాపిల్ ఐఓఎస్ 18ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏఐ ఫీచర్స్‌తో ఐఫోన్ 16
గూగుల్ పిక్సెల్ 8, సాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌లు ఇప్పటికే ఏఐ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చేశాయి. అందుకే యాపిల్ కూడా తన సరికొత్త ఐఫోన్ 16ను జనరేటివ్ ఏఐ ఫీచర్లతో తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దానికంటే కాస్త ముందుగానే లేటెస్ట్ ఏఐ ఫీచర్లతో ఐఓఎస్ 18 తీసుకురానుంది. బహుశా యాపిల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద అప్‌డేట్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. WWDC 2024లో ఈ యాపిల్ iOS 18ని పరిచయం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ ఆర్టికల్‌లో యాపిల్ iOS 18 ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.
AI Powered Sir
యాపిల్ కంపెనీ ఐఓఎస్‌ను అప్‌డేట్ చేసిన ప్రతిసారీ వాయిస్ అసిస్టెంట్ సిరిని కూడా అప్‌డేట్ చేస్తూ వస్తోంది. యాపిల్ తన వాయిస్ అసిస్టెంట్ సిరి(Siri)కి చాట్‌జీపిటి( ChatGPT) లాంటి జనరేటివ్ AI సపోర్టింగ్ టెక్నాలజీలను జోడించనుంది. యాపిల్ తన సొంత జనరేటివ్ AI మోడల్‌ను డెవలప్ చేస్తోందని ఇప్పటికే మీడియా కథనాలు వెలువడ్డాయి. యాపిల్ కంపెనీ సిరితో పాటు, నోట్స్ యాప్, మ్యూజిక్ యాప్‌లకు కూడా జనరేటివ్ AI ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. అలాగే ఏఐతో పనిచేసే ఫోటో, వీడియో ఎడిటింగ్ యాప్‌లను తన యూజర్లకు అందించనున్నట్లు సమాచారం.
యాప్ సైడ్‌లోడింగ్
యాపిల్ కంపెనీ యూరోప్‌లో iOS 17.4 అప్‌డేట్‌లో యాప్ సైడ్‌లోడింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. దీనిని iOS 18 అప్డేట్లోనూ యాడ్ చేసే తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని ఉపయోగించి ఐఫోన్ యూజర్లు తమకు నచ్చిన థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇందుకోసం ఐఫోన్ యూజర్లు ముందుగా యాపిల్ యాప్ స్టోర్ నుంచి థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత మాత్రమే తమకు నచ్చిన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది.
RCS ప్రోటోకాల్ సపోర్టు
iOS 18 అప్‌డేట్ వచ్చిన తరువాత imessage అనేది RCS ప్రోటోకాల్‌కు సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఇదే జరిగితే Android ఫోన్ యూజర్లు, ఐఫోన్ యూజర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మల్టీమీడియా ఫైల్స్, ఆడియో మెసేజ్‌లను షేర్ చేసుకోగలుగుతారు. అయితే ఆండ్రాయిడ్ డివైజ్‌ల నుంచి పంపించిన టెక్ట్స్ మెసేజ్‌లు మాత్రం ఐఫోన్లో గ్రీన్ కలర్లో కనిపిస్తాయి.
థర్ద్ పార్టీ పేమెంట్ గేట్‌వే
యాపిల్ ఐవోఎస్ 18 అప్‌డేట్ వచ్చిన తరువాత సబ్‌స్క్రిప్షన్‌ల కోసం థర్డ్-పార్టీ పేమెంట్ గేట్‌వేలను ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు షాపింగ్, సబ్‌స్క్రిప్షన్ ఫీజులను 30 శాతం వరకు తగ్గించుకోవచ్చు. Spotify, Epic లాంటి మ్యూజిక్, పాడ్‌కాస్ట్ యాప్‌లు ఇప్పటికే ఐఫోన్స్ కోసం సొంత పేమెంట్ గేట్‌వేలను రూపొందిస్తున్నాయి. ఈ ఫీచర్ ప్రారంభంలో యూరప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. iOS 18 అప్‌డేట్ రిలీజ్ అయిన తరువాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు యూజర్లకు ఇది అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - ఇకపై వెబ్ వెర్షన్లోనూ 'చాట్ లాక్' ఫీచర్!
రూ.20వేల బడ్జెట్లో మంచి ట్యాబ్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే!