ETV Bharat / technology

ఐఫోన్ లవర్స్​కు గుడ్​ న్యూస్- యాపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసిందోచ్​ - iphone 16 launch date - IPHONE 16 LAUNCH DATE

Apple Announced Iphone Event Date: ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న యాపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 9న ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించింది. ఈ ఈవెంట్​లో ఐఫోన్ 16 సిరీస్​ను లాంఛ్​ చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీటి ఫీచర్లు, ధరలు, స్పెక్స్​ వంటి వివరాలు తెలుసుకుందాం రండి.

Apple_Announced_Iphone_Event_Date
Apple_Announced_Iphone_Event_Date (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Aug 27, 2024, 12:41 PM IST

Updated : Aug 27, 2024, 2:41 PM IST

Apple Announced Iphone Event Date: ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మొబైల్ కంపెనీలు ఉన్నా యాపిల్​ ఫోన్లకు ఉన్న కేజ్ వేరే లెవల్. ఐ ఫోన్ లవర్స్​ కోసం కంపెనీ ప్రతి ఏడాదీ సరికొత్త ఫీచర్స్​తో ఐ ఫోన్ అప్​డేటెడ్​ మోడల్​ను రిలీజ్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐఫోన్ లవర్స్​కు యాపిల్ సంస్థ గుడ్​ న్యూస్ చెప్పింది. ఎంతగానో ఎదురుచూస్తున్న యాపిల్ ఈవెంట్​ను సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్‌, ఎయిర్​పాడ్స్ ప్రొడక్ట్స్, కొత్తగా హార్డ్​వేర్​ను లాంఛ్​ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్​ విశేషాలు, ట్యాగ్, రిలీజ్ కానున్న న్యూ ప్రొడక్ట్స్​పై ఓ లుక్కేద్దాం.

ఇట్స్​ గ్లోటైమ్:

  • వరల్డ్​ వైడ్​గా ఈ యాపిల్ ఈవెంట్​కు చాలా క్రేజ్ ఉంది.
  • ఏటా సెంప్టెంబర్ రెండో వారంలో యాపిల్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
  • గతేడాది సెంప్టెంబర్ 12న కాలిఫోర్నియాలో, అంతకుముందు ఏడాది సెప్టెంబర్ 7న ఈ ఈవెంట్​ను నిర్వహించారు.
  • ఈసారి సెప్టెంబర్ 10న నిర్వహించనున్నట్లు వార్తలు వెలువడగా.. ఆశ్చర్యంగా ఒకరోజు ముందుగానే 'ఇట్స్ గ్లోటైమ్​' ట్యాగ్​తో ఈవెంట్​ డేట్​ను యాపిల్ ప్రకటించింది.
  • కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
  • ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ ప్రోగ్రాం ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్​లో స్ట్రీమింగ్ కానుంది.

న్యూ ప్రొడక్ట్స్​ అప్​డేట్స్​:

  • ఈ ఈవెంట్‌లో ఐఫోన్‌ 16 సిరీస్‌లతో పాటు భారీగా న్యూ ప్రొడక్ట్స్​కు సంబంధించి ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
  • దీంతోపాటు ఇతర సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను కూడా వెల్లడించే అవకాశం ఉంది.

ఐఫోన్‌ 16 సిరీస్‌ మోడల్స్: ఐఫోన్‌ 16 సిరీస్‌లో ఈసారి కూడా 4 మోడల్స్​లో ఫోన్లు రిలీజ్ కానున్నట్లు సమాచారం.

  • ఐఫోన్‌ 16
  • ఐఫోన్‌ 16 ప్లస్‌
  • ఐఫోన్‌ 16 ప్రో
  • ఐఫోన్‌ 16 ప్రో మాక్స్‌

ఐఫోన్‌ 16 సిరీస్‌ ధరలు: వీటి ధరల విషయానికొస్తే కింది విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

  • ఐఫోన్‌ 16 ధర: 799 డాలర్లు (రూ.67,100)
  • ఐఫోన్ 16 ప్లస్ ధర: 899 డాలర్లు (రూ.75,500)
  • ఐఫోన్ 16 ప్రో ధర: 1,099 డాలర్లు (రూ.92,300)
  • ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర: 1,199 డాలర్లు (రూ.1,00,700)

లేటెస్ట్‌ జెన్‌ హార్డ్‌వేర్‌, ఏఐతో:

  • ఈ ఈవెంట్​లో యాపిల్‌ ఐఫోన్‌ 16 సిరీస్‌, యాపిల్‌ వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌ ప్రొడక్ట్స్‌, కొత్తగా హార్డ్‌వేర్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
  • గతసారి ప్రో మోడల్స్​లో మాత్రమే యాక్షన్ బటన్ ఇవ్వగా ఈసారి అన్ని మోడల్స్​లో యాక్షన్ బటన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
  • ఈ సారి అన్ని మోడళ్లు లేటెస్ట్‌ జెన్‌ హార్డ్‌వేర్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తో రానున్నట్లు తెలుస్తోంది.

'ఆడి క్యూ8' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ ఎస్​యూవీ లాంచ్- ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? - Audi Q8 Facelift Launched

ఉద్యోగం లేదా?- ఈ బిజినెస్​తో డబ్బే డబ్బు!- కేవలం రూ.3.99 లక్షలు ఉంటే చాలు - Best Commercial Vehicles In India

Last Updated : Aug 27, 2024, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.