AI Tools For Youtube Video Creation : యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో రాణించాలంటే గొప్ప కంటెంట్‌ను క్రియేట్ చేయించాల్సిందే. స్క్రిప్ట్ రాయడం, వీడియో ఎడిటింగ్ చేయడం, థంబ్‌నెయిల్స్ రూపొందించడం, హెడ్డింగ్స్- ఇలా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి ఏఐ వచ్చేసింది. ఏం కావాలన్నా చకచకా చేసి పెట్టేస్తోంది. ఈ టూల్స్ వాడటం వల్ల క్వాలిటీ పెరగడమే కాకుండా వేగంగా కంటెంట్ ప్రొడ్యూస్ చేయవచ్చు. అయితే, ఇవేవో డబ్బులు చెల్లించి ఉపయోగించుకునే టూల్స్ కావు. అన్నీ ఉచితంగా అందుబాటులో ఉన్నవే! మరి యూట్యూబ్ కంటెంట్ తయారు చేసే వారి కోసం ఉపయోగపడే 6 బెస్ట్ ఏఐ టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా?
GravityWrite :
AI Tools For Content Writing : హైక్వాలిటీ, యూనీక్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది. ఉచితంగా థంబ్‌నెయిల్ ఐడియాలు కూడా ఇస్తుంది. ఎలాంటి స్క్రిప్ట్ అడిగినా రాసి ఇచ్చేస్తుంది. కంటెంట్‌కు మంచి టైటిల్స్ కూడా పెడుతుంది. gravitywrite(డాట్ కామ్) వెబ్సైట్లోకి వెళ్లి ఉచితంగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు ఎంచక్కా కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కంటెంట్‌కు సంబంధించి చిన్న కమాండ్ ఇస్తే సరిపోతుంది. కంటెంట్ మొత్తం క్షణాల్లో మీ ముందు ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్, హ్యాష్‌ట్యాగ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Lumen5 :
టెక్స్ట్‌ను వీడియో రూపంలోకి మార్చుకోవడానికి ఈ టూల్ వాడుకోవచ్చు. బ్లాగ్ కోసం రాసుకున్న కంటెంట్‌ను యూట్యూబ్ వీడియోగా అప్లోడ్ చేసుకోవాలని అనుకుంటే ఇది బెస్ట్ టూల్. Lumen5(డాట్ కామ్) వెబ్సైట్లోకి వెళ్లి ఫ్రీ సైనప్ పూర్తి చేస్తే మీకు కొన్ని టెంప్లేట్స్ కనిపిస్తాయి. అందులో నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకొని 'ట్రాన్స్‌ఫార్మ్ టెక్స్ట్ ఇంటు వీడియో' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే బాక్స్‌లో టెక్స్ట్ ఇచ్చి 'convert to video'పై క్లిక్ చేయాలి. మనం ఇచ్చిన స్క్రిప్ట్‌కు అనుగుణంగా వీడియోను క్రియేట్ చేస్తుంది లూమెన్. అవసరమైతే ఫ్రేమ్‌లను కస్టమైజ్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. ఈ వీడియోలను ఏ సోషల్ మీడియాలోనైనా పోస్ట్ చేసుకోవచ్చు. అన్ని కమర్షియల్ హక్కులు క్రియేటర్లకు ఉంటాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
vidyo.ai :
లాంగ్ వీడియోలను చిన్న చిన్న షార్ట్స్/రీల్స్‌గా కట్ చేసుకోవాలని అనుకుంటే 'వీడియో డాట్ ఏఐ'ని ట్రై చేయొచ్చు. సెకన్లలోనే పెద్ద వీడియోలు రీల్స్‌లా మారిపోతాయి. ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన లాంగ్ వీడియోను అప్లోడ్ చేయాలి. దాన్ని మనం కావాల్సిన ఫార్మాట్లో కట్ చేసుకోవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- వివిధ స్టైల్స్‌లో వీడియోకు క్యాప్షన్స్ యాడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.
- లాంగ్ వీడియోకు సంబంధించిన చిన్న కట్స్ అన్నీ డ్యాష్‌బోర్డ్‌లో కనిపిస్తాయి.
- వీడియో వాయిస్ సైతం మార్చుకోవచ్చు. సెలబ్రిటీల వాయిస్‌లు సైతం ఇందులో అందుబాటులో ఉన్నాయి.
- ఎడిట్ చేసుకున్న వీడియోలను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డబ్వర్స్.ఏఐ
ఒకే వీడియోను వేర్వేరు భాషల్లో ప్రొడ్యూస్ చేయడానికి వీలు కల్పించే ఏఐ టూల్ ఇది. డబ్వర్స్ ద్వారా వీడియోకు సబ్‌టైటిల్స్ యాడ్ చేసుకోవడమే కాకుండా, ఇతర భాషల్లో రియలిస్టిక్ వాయిస్ ఓవర్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- డబ్వర్స్.ఏఐ వెబ్సైట్లోకి వెళ్లి ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
- 'డబ్ ఎ వీడియో' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఏ వీడియోకు అయితే 'సబ్‌టైటిల్/వాయిస్ఓవర్' కావాలో దాన్ని అప్లోడ్ చేయాలి.
- తర్వాత భాషను, వాయిస్ ఓవర్ నమూనాను ఎంచుకోవాలి. సెకన్లలోనే డబ్బింగ్ వీడియో క్రియేట్ అయిపోతుంది. దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అడోబీ పాడ్‌కాస్ట్
వీడియోలకు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉంటే అది మంచి యూట్యూబ్ వీడియో అనిపించుకోదు. ఆ నాయిస్‌ను తేలికగా తీసేయవచ్చు. అడోబీ పాడ్‌కాస్ట్ ద్వారా వీడియోకు ప్రొఫెషనల్ సౌండ్ తీసుకురావొచ్చు. స్టూడియోలో రికార్డ్ చేసే ఆడియో ఎంత క్వాలిటీతో ఉంటుందో అదే స్థాయిలో ఎడిట్ చేయగలగడం దీని ప్రత్యేకత.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- పాడ్‌కాస్ట్.అడోబీ.కామ్ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- ఆడియో ఫైల్‌ను అప్లోడ్ చేయాలి. వెంటనే నాయిస్ క్యాన్సిల్ అయిన ఆడియో స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- గంట వ్యవధి ఉన్న ఆడియోను సైతం అప్లోడ్ చేసుకొని నాయిస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు.
wisecut :
AI Tools For Video Editing : వీడియో ఎడిటింగ్ అంటే ఎంత కష్టమైన పనో చెప్పనక్కర్లేదు. వీడియోలో గ్యాప్ లేకుండా చూసుకోవాలి. పాజ్లు ఎక్కువగా రాకుండా చూడాలి. ఇందుకోసం ఎంతో సమయం వెచ్చించాల్సి వస్తుంది. కానీ, wisecutతో ఈ ప్రక్రియ అంతా సింపుల్‌గా అయిపోతుంది. సాధారణ ఎడిటింగ్ టైమ్‌తో పోలిస్తే వేగంగా వీడియోలను క్రియేట్ చేసుకోవడం దీని ద్వారా సాధ్యమవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- wisecut.video వెబ్సైట్లోకి వెళ్లి ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
- కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని, మీడియా ఫైల్స్ యాడ్ చేసుకోవాలి.
- వెంటనే ఇది ప్రాజెక్ట్ ఎడిట్ చేయడం ప్రారంభిస్తుంది.
- పాజ్లను తొలగించి, సబ్‌టైటిల్స్, మ్యూజిక్ యాడ్ చేసి వీడియోను సిద్ధం చేస్తుంది.
- ప్రివ్యూ చూసుకున్న తర్వాత వీడియోలో మార్పులు ఉంటే చేసుకోవచ్చు. ఎడిటింగ్ పూర్తైతే ఫ్రీగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Content Creators Gadgets : ఈ 10 వస్తువులు ఉంటే సూపర్ కంటెంట్ మీదే!
మీకు ఈ AI టూల్స్ తెలుసా..? పనులన్నీ క్షణాల్లో పూర్తవుతాయి..!
గూగుల్ బార్డ్‌లో అదిరిపోయే ఫీచర్స్.. ఎలా వాడాలో తెలుసా?
యూట్యూబ్ స్టూడియో పెట్టాలా?.. బడ్జెట్లో బెస్ట్ (ఎక్విప్మెంట్) ఆప్షన్స్ ఇవే!
యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. నయా ఫ్యాన్ ఫండింగ్ రూల్స్‌తో.. రెవెన్యూ జంప్ షురూ!