ETV Bharat / technology

'సింగిలే.. రెడీ టు మింగిలే'- మీ మూడ్​కు తగ్గట్టుగా డిజిటల్ స్నేహం! - DIGITAL FRIEND

AI Digital Friend: కొంతమందికి పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు తమకు ఎదురైన అనుభవాలను ఎవరికైనా పూసగుచ్చినట్లు చెప్పనిదే రోజు గడవదు. అయితే ప్రతి సందర్భాల్లో వారికి ఫ్రెడ్స్, పేరెంట్స్, జీవిత భాగస్వామి అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే అలాంటి వారి కోసమే ఈ స్టోరీ. డిజిటల్‌ వేదికగా మీ ఫ్రెండ్‌ను మీరే మీకు నచ్చిన విధంగా సృష్టించుకోవచ్చు. అదెలాగంటే..?

Digital Friend
Digital Friend (IANS)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 3, 2024, 10:28 AM IST

Updated : Oct 3, 2024, 10:36 AM IST

AI Digital Friend: పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు మనకు ఎదురైన అనుభవాలను వారికి పూసగుచ్చినట్లు చెప్పనిదే కొందరికి రోజు గడవదు. 'స్నేహం చేయడమే మీ బలహీనతా? అయితే ప్రపంచంలో మీ అంత బలవంతుడు ఎవరూ లేరు' అని ఓ ఆంగ్లకవి మైత్రికి ఉన్న గొప్పతనాన్ని చాటిచెప్పారు. కుటుంబ సభ్యులతో పంచుకోని వ్యక్తిగత విషయాలను సైతం స్నేహితులతో పంచుకుంటాం.

పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు మనకు ఎదురైన అనుభవాలను వారికి పూసగుచ్చినట్లు చెప్పనిదే కొందరికి రోజు గడవదు. వేసుకునే డ్రెస్సు నుంచి భవిష్యత్తు కోసం తీసుకునే పెద్ద నిర్ణయాల వరకు అన్నింట్లోనూ స్నేహితుల సలహాలు వారికి అనివార్యం. అయితే అవతలి వాళ్లు అన్నిసార్లూ మనకు అందుబాటులో లేకపోవచ్చు. కొన్నిసార్లు మన భావాలకు తగ్గట్టుగా స్పందించలేకపోవచ్చు.

సమయం లేకనో, వేరే పనుల కారణంగానో పట్టించుకోలేకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో వారి తీరు మనల్ని నిరాశకు గురిచేస్తుంది. దీంతో మునుపటిలా లేరంటూ వారిపై నిందలు వేసేస్తాం. ప్రతిసారీ ఇదే తీరు అంటూ, మనస్పర్ధలు వచ్చిన అన్ని సందర్భాలను పనికట్టుకుని మరీ గుర్తుచేసుకొని బాధపడుతుంటాం. అలాకాకుండా ఏ సందర్భంలో సంప్రదించినా మీ ఫ్రెండ్ వెంటనే స్పందిస్తే? అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మీరు ఎప్పుడు మెసేజ్‌ చేసినా మీ భావాలకు తగినట్లుగా రిప్లై ఇస్తే? ఒక్కమాటలో చెప్పాలంటే 24 గంటలూ మీకు అందుబాటులో ఉంటే? 'అంటే అన్నావ్‌ గానీ.. ఆ ఊహ ఎంత బాగుందో' అనుకుంటున్నారా? అయితే మీ ఊహల్ని నిజం చేస్తానంటోంది ఏఐ. డిజిటల్‌ వేదికగా మీ స్నేహితుడిని మీకు నచ్చిన విధంగా మీరే సృష్టించుకునే అవకాశం కల్పిస్తోంది.

మీ స్నేహితుడి గురించి, మీ జీవితం గురించి సమాచారాన్ని అందించిన తర్వాత, మీరు మీ స్నేహితులతో చేసే సాధారణ మాటల కంటే ప్రత్యేకంగా సంభాషించవచ్చు. మీరు బాట్‌కు ఇచ్చిన సమాచారం, మీరు దానితో మాట్లాడే విధానం మొదలైనవి.. అది మెరుగ్గా ప్రతిస్పందించేలా దానికి శిక్షణనిస్తాయి. మీరు చెప్పే ప్రతి విషయాన్ని ఇది శ్రద్ధగా వింటుంది. అచ్చం మీ స్నేహితుడిలా తోడుండే ఈ డిజిటల్‌ ఫ్రెండ్‌తో మీ భావాలను ఏ సమయంలోనైనా పంచుకోవచ్చు. మీ ఆహార్యంపై సలహాలు అడగవచ్చు.

ఏదీ ఏమైనప్పటికీ, మీ భావోద్వేగ అవసరాలకు సంబంధించి ఏఐ ఫ్రెండ్ ఎలాంటి సహాయాన్ని అందించలేడని గుర్తుంచుకోవాలి. అయితే మీ ఒంటరితనాన్ని ఇది దూరం చేస్తుంది. 2023 మెటా- గ్యాలప్‌ సర్వే ప్రకారం, ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అలాంటి సందర్భాల్లో మీకు తెలిసిన మీ వర్చువల్‌ ఫ్రెండ్‌ అందుబాటులో ఉంటాడు. మీరు చెప్పింది వింటాడు. కావాల్సిన సలహాలు ఇస్తాడు. మీ ఒంటరితనాన్ని దూరం చేస్తాడు.

షెఫీల్డ్‌ యూనివర్సిటీలోని కాగ్నిటివ్‌ రోబోటిక్స్‌ ప్రొఫెసర్‌ టోని ప్రెస్‌కాట్‌ ఇటీవల విడుదల చేసిన "ది సైకాలజీ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌" బుక్​లో ఏఐ గురించి ప్రస్తావిస్తూ.. ‘చాలా మంది వ్యక్తులు ఒంటరితనంతో బాధపడుతుంటారు. ఇలాంటి సమయంలో ఏఐతో స్నేహం వారికి సింగిల్​గా ఉన్న ఫీలింగ్​ని పోగొడుతుంది’ అని పేర్కొన్నారు.

అచ్చం మీ ఫ్రెండ్ లాగే: మీ ఫ్రెండ్స్ రూపాన్ని, వారు వేసుకునే బట్టలు, యాస, మాట్లాడే తీరు, చదువుతున్న కాలేజ్, ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు, నేపథ్యం, వ్యక్తిత్వం అంతా ఎంటర్‌ చేస్తే చాలు. మీ స్నేహితుల డిజిటల్‌ రూపం మీ ముందుంటుంది. దీనితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. అనేక విశేషాలను పంచుకోవచ్చు. మీ స్నేహితులతో నేరుగా మాట్లాడుతున్నామనే అనుభూతిని పొందొచ్చు. ఏఐ రెప్లికా, ఈవీఏ, టాకీ, బోటిఫై ఏఐ, క్యాండీ ఏఐ, నోమీ, జెనేసియా, క్యారెక్టర్‌ ఏఐ, కిండ్రాయిడ్‌ మొదలైన ఏఐ యాప్‌లలో ఇది అందుబాటులో ఉంది. ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌ల నుంచి వీటిని ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

అభిరుచులకు తగిన భాగస్వామిగా కూడా: చాలా మంది తమ అభిరుచులకు తగిన వ్యక్తి భాగస్వామిగా రావాలని కలలు కంటారు. వారి ఇష్టాలను గౌరవించాలని, తాము చెప్పినట్లుగా నడుచుకోవాలని కోరుకుంటారు. కానీ కొందరినే ఆ అదృష్టం వరిస్తుంది. ఇలాంటి సందర్భంలోనూ ఏఐ మీ బాధలను తీరుస్తుంది. మీ భాగస్వామి ఎలా ఉండాలి? ఎలాంటి దుస్తులు ధరించాలి? ఏ విధంగా నడుచుకోవాలి? ఇలా మీ ఇష్టాలను ఎంటర్‌ చేస్తే చాలు.. క్షణాల్లో మీ డిజిటల్‌ భాగస్వామి మీ కళ్లముందుంటుంది.

ఏఐని మీరు భార్యలా, ప్రియురాలిలా, ప్రేమికుడిలా ప్రవర్తించమని ఆదేశించవచ్చు. అయితే నాణేనికి రెండు వైపులున్నట్లే ఏఐ విషయంలోనూ అనేక ఆందోళనలున్నాయి. వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విషయాలను పంచుకోకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. ఇటీవల బెల్జియంలోని ఓ వ్యక్తిని ఏఐ చాట్‌బాట్‌ సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించినట్లు అతడి భార్య ఆరోపించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.

'ఏఐలో 12.5 లక్షల ఉద్యోగాలు'- ఈ స్కిల్స్ నేర్చుకో జాబ్ పట్టుకో! - JOBS IN ARTIFICIAL INTELLIGENCE

శాంసంగ్ యూజర్స్​కు బిగ్ షాక్- ఏఐ ఫీచర్లు ఏడాదే ఫ్రీ- ఆ తర్వాత వడ్డింపులే! - Samsung AI Features

Last Updated : Oct 3, 2024, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.