Best Web Browsers : ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బ్రౌజింగ్ కోసం క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లను ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అయితే ప్రస్తుత సాంకేతిక యుగంలో గూగుల్ క్రోమ్, ఎడ్జ్‌లను మించిన బ్రౌజర్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్-5 బ్రౌజర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆర్క్ బ్రౌజర్ (ARC)
ఈ వెబ్ బ్రౌజర్ సెర్చ్ చేసినప్పుడు వేగంగా మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. మీ ప్రైవసీని కాపాడుతుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, క్రోమ్‌కు ప్రత్యామ్నాయంగా వెబ్ బ్రౌజర్ వాడాలనుకునేవారికి ఆర్క్ బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
2. మొజిల్లా ఫైర్ఫాక్స్(Mozilla Firefox)
మొజిల్లా ఫైర్ఫాక్స్ ఓపెన్ సోర్స్ బ్రౌజర్. ఈ బ్రౌజర్లో అడ్వాన్స్డ్ యాంటీ ఫింగర్ ప్రింటింగ్, ఎన్హాన్స్డ్ ట్రాకింగ్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ ఉంది. దీనివల్ల ఇతరులు మీ ఆన్లైన్ యాక్టివిటీని ట్రాక్ చేయలేరు. మెుజిల్లా ఫైర్ఫాక్స్ యూజర్ ప్రైవసీని కాపాడుతుంది. నకిలీ వెబ్సైట్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. బ్రౌజింగ్‌కు అనువుగా ఉంటుంది. మీ కంప్యూటర్ లేదా ఫోన్లో బ్రౌజింగ్ చేసేందుకు గూగుల్ క్రోమ్, ఎడ్జ్‌లకు బెస్ట్ ఆల్టర్నేటివ్గా ఉంటుంది.
3. ఓపెరా జీఎక్స్(Opera GX)
ఈ వెబ్ బ్రౌజర్ గేమర్లల కోసం రూపొందించారు. దీంట్లో సులువుగా బ్రౌజింగ్ చేయవచ్చు. దీన్ని ఎక్కువగా గేమర్లు వాడుతారు. ముఖ్యంగా దీని ద్వారా మీ సీపీయూ, మెమొరీ, నెట్వర్క్ వినియోగంపై పరిమితిని సెట్ చేయవచ్చు. అంతేకాదు దీనికి ఏఐ సపోర్ట్ కూడా ఉంటుంది. కనుక వేగంగా బ్రౌజింగ్ చేయవచ్చు.
4. డక్‌డక్‌గో (DuckDuckGo)
డక్‌డక్ గో బ్రౌజర్లో మీ సెర్చ్ హిస్టరీ రికార్డ్ కాదు. కనుక ఎవరూ మిమ్మల్ని ట్రాక్ చేయలేరు. ఆటోమెటిక్ యాడ్ బ్లాక్, థర్డ్ పార్టీ ట్రాకర్లను నిలిపివేయటం, హెచ్టీటీఎస్ ఎన్క్రిప్షన్ లాంటివి ఈ బ్రౌజర్లో ఉన్నాయి. ప్రైవసీ మీ తొలి ప్రాధాన్యనమైతే డక్‌డక్‌గో వెబ్ బ్రౌజర్ బెటర్ ఆప్షన్ అవుతుంది.
5. మిన్ (MIN)
ఇది కూడా బ్రౌజింగ్‌కు చాలా అనువుగా ఉంటుంది. మనం సెర్చ్ చేయగానే వేగంగా రిజల్ట్స్‌ను ఇస్తుంది. డీఫాల్ట్‌గా యాడ్స్, ట్రాకర్లను బ్లాక్ చేస్తుంది. గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లకు మరో బెస్ట్ ఆల్టర్నేటివ్గా పనిచేస్తుంది.
మీ రిమోట్ పోయిందా? స్మార్ట్‌ఫోన్‌తోనే టీవీని ఆపరేట్ చేయండిలా! - Use Smart Phone As A TV Remote