ETV Bharat / technology

గూగుల్ క్రోమ్​లో 5​ నయా ఫీచర్స్​ - ఇకపై సెర్చింగ్​ వెరీ సింపుల్​! - Latest Google Chrome Features

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 4:27 PM IST

New Chrome Features : గూగుల్ క్రోమ్ తమ యూజర్ల కోసం 5 నయా ఫీచర్స్ తీసుకువచ్చింది. వీటిలో ట్రెండింగ్‌ సెర్చెస్‌, డిస్కవర్ ఫీడ్, బస్​, ట్రైన్ షెడ్యూల్స్​ లాంటి ఫీచర్లు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

google chrome features
Chrome features 2024 (ETV Bharat)

New Chrome Features : గూగుల్‌ క్రోమ్‌ తమ యూజర్లకు మరింత మెరుగైన సెర్చ్‌ అనుభవాన్ని అందించడం కోసం 5 సరికొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. గూగుల్​ క్రోమ్​లో ఇకపై రెస్టారెంట్లను చాలా సులువుగా, తక్కువ సమయంలో వెతకవచ్చు. అది ఎలా అంటే? ఉదాహరణకు, మీరు ఏదైనా రెస్టారెంట్‌ కోసం వెతుకుతుంటే, సెర్చ్‌ బార్‌ దగ్గర కొత్తగా 3 షార్ట్‌కట్‌ బటన్స్​ కనిపిస్తాయి. వాటి సాయంతో ఆ రెస్టారెంట్‌ ఫోన్‌ నంబర్‌, రూట్‌ మ్యాప్‌, రివ్యూలను సింగిల్‌ క్లిక్‌తో తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్​ ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఐఫోన్‌ యూజర్లకు కూడా ఇది అందుబాటులోకి తీసుకురానున్నారు.
  2. గూగుల్ కంపెనీ క్రోమ్ బ్రౌజర్​లోని అడ్రస్​ బార్​ను రీడిజైన్ చేసింది. ఇది ప్రధానంగా ట్యాబ్లెట్​లో ఉండే క్రోమ్ బ్రౌజర్​లో పని చేస్తుంది. వాస్తవానికి గూగుల్‌ మెటీరియల్‌ యూ డిజైన్‌ లాంగ్వేజ్‌కు అనుగుణంగా దీనిని రీడిజైన్ చేసింది. దీని వల్ల మీరు ఏదైనా సెర్చ్‌ చేస్తున్నప్పుడు, సెర్చ్‌ బార్‌ కిందనే డ్రాప్​డౌన్‌ కనిపిస్తుంది. అందులో మీరు ఇటీవల చూసిన వెబ్‌సైట్లు, మీరు వెతుకుతున్న విషయానికి సంబంధించిన పలు అంశాలు కనిపిస్తాయి.
  3. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న 'ట్రెండింగ్‌ సెర్చెస్‌' ఫీచర్‌, ఇప్పుడు ఐఫోన్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే ఇకపై యాపిల్‌ యూజర్లు కూడా సెర్చ్‌ బార్‌పై క్లిక్‌ చేస్తే, ప్రస్తుతం ఆ ప్రాంతంలో ట్రెండింగ్‌లో ఉన్న అంశాలు అన్నీ కనిపిస్తాయి.
  4. గూగుల్ క్రోమ్​లోని డిస్కవర్ ఫీడ్‌లో కొత్తగా లైవ్ స్పోర్ట్స్ కార్డ్‌లు కూడా కనిపించనున్నాయి. మీరు గతంలో వెతికిన వార్తలు, స్పోర్ట్స్‌ కార్డులు కూడా ఇందులో కనిపిస్తాయి. ఓవర్​ ఫ్లో మెనూ (మూడు చుక్కల మెనూ)ను ఉపయోగించి డిస్కవర్‌ ఫీచర్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు.
  5. ఇకపై బస్సు, ట్రైన్​ వేళలను క్రోమ్‌ సెర్చ్‌లోనే తెలుసుకోవచ్చు. సెర్చ్‌ బార్‌లో 'షెడ్యూల్‌' అని టైప్‌ చేయగానే మీరున్న ప్రాంతానికి చెందిన రవాణా సర్వీసుల షెడ్యూల్‌ వివరాలు వెబ్‌సైట్‌ సజెషన్స్‌లో కనిపిస్తాయి.

గమనిక : ప్రస్తుతానికి ఈ గూగుల్ క్రోమ్ ఫీచర్లు కొన్ని ప్రాంతాల వారికి, కొందరు యూజర్లకు మాత్రమే ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే అందరు యూజర్లకు గూగుల్‌ పూర్తిస్థాయిలో ఈ సదుపాయాలను అందించే అవకాశం ఉంది.

పాస్​వర్డ్స్​ గుర్తుంచుకోవడం కష్టంగా ఉందా? ఓ 'మేనేజర్​'ను పెట్టుకోండిలా! - Password Manager Security Benefits

ఇట్స్ అమేజింగ్ : ఇక ఏ దొంగా మీ ఇంట్లోకి వెళ్లలేడు - మార్కెట్లోకి ఫింగర్ ​ప్రింట్​ తాళాలు వచ్చేశాయ్! - Best Fingerprint Padlocks

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.