Upcoming Bikes and Scooters in India: ప్రస్తుతం మార్కెట్లో బైక్స్, స్టూటర్స్కు మంచి క్రేజ్ ఉంది. రయ్ రయ్ మంటూ టూ-వీలర్స్‌పై దూసుకుపోవటం అంటే యువతకు భలే సరదా. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ వెర్షన్స్‌ను రిలీజ్ చేస్తుంటాయి. కస్టమర్ల ఆసక్తి, అభిరుచికి తగినట్లుగా ఆకర్షణీయమైన లుక్‌లో వాటిని రూపొందిస్తున్నాయి. తాజాగా ఈ సెప్టెంబర్‌లో పలు ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థలు తమ లేటెస్ట్ బ్రాండెడ్ బైక్స్ అండ్ స్కూటర్స్‌ను లాంఛ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిలోని టాప్-5 బైక్స్ అండ్ స్కూటీస్‌పై ఓ లుక్కేద్దాం రండి.
ఈ సెప్టెంబర్‌లో మార్కెట్లో రిలీజ్ కానున్న టాప్ బైక్స్ అండ్ స్కూటర్స్ ఇవే:
- జావా 42
- హీరో డెస్టినీ 125
- బజాజ్ ఇథనాల్ బైక్
- బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్900 జిఎస్
- బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్900 జిఎస్ అడ్వెంచర్
Jawa 42: జావా మోటార్‌సైకిల్స్ తన లేటెస్ట్ వెర్షన్ 'జావా 42న' బైక్‌ను నేడు రిలీజ్ చేసేందుకు సిద్ధమయింది. లేటెస్ట్ ఫీచర్స్, స్టన్నింగ్ లుక్స్‌లో దీన్ని డిజైన్ చేశారు. దీని ధర రూ. 2 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని అంచనా.
Hero Destini 125: హీరో మోటోకార్ప్ తన పాత మోడల్‌కు మార్పులు, చేర్పులు చేస్తూ లేటెస్ట్ వెర్షన్ ' హీరో డెస్టినీ 125' స్కూటర్‌ను సెప్టెంబర్ 7న భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. కొంగొత్త రంగులు, మెరుగైన ఫీచర్లు, ఇంజిన్ మార్పులతో దీన్ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది 124.6సీసీ ఇంజిన్, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుందని సమాచారం.
Bajaj Ethanol Bike: బజాజ్ ఆటో పర్యవరణానికి అనుకూలంగా తన మొదటి ఇథనాల్‌తో నడిచే బైక్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాల చేస్తోంది. దీని పాత వెర్షన్లో ఇంజిన్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. బజాజ్ ఆటో ఈ బైక్‌ను ఈ సెప్టెంబర్‌లో లాంచ్ చేస్తారని అంచనా.
BMW F900 GS: బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ 'F900 GS', 'F900 GS అడ్వెంచర్' బైక్‌లను ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. F850 GS మోడల్లో మార్పులు చేస్తూ అప్‌డేటెడ్ బాడీవర్క్, ఇంజిన్లను కలిగి ఉన్నాయి. వీటికి ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించగా.. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
BMW F900 GS Adventure: టూరింగ్ ఔత్సాహికుల కోసం F900 GS అడ్వెంచర్ బైక్‌ను రూపొందించారు. ఈ వెర్షన్ బైక్స్‌లో ఆఫ్-రోడ్ టైర్స్, 23-లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, మెరుగైన సస్పెన్స్ ఉన్నాయి. 'F900 GS', 'F900 GS అడ్వెంచర్' రెండూ రూ. 13 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభమవుతాయని అంచనా.
మతిచెదిరే ఫీచర్లతో 'టాటా మోటార్స్ కర్వ్ ఐస్' లాంచ్- ధర ఎంతంటే? - Tata Curvv ICE Version Launch