ETV Bharat / technology

మతిచెదిరే లుక్​లో BMW కొత్త కారు- ధర ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..! - 2024 BMW M2

ఇండియన్ మార్కెట్లోకి 'BMW M2' కూపే- ధర, ఫీచర్లు ఇవే..!

2024 BMW M2
2024 BMW M2 (BMW India)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 29, 2024, 1:06 PM IST

2024 BMW M2 Launched: మార్కెట్లోకి BMW నుంచి అదిరే లగ్జరీ కారు వచ్చింది. కంపెనీ తన అప్డేటెడ్ 'BMW M2' కూపే కారును ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది. అదిరే కలర్ ఆప్షన్లతో స్టన్నింగ్ లుక్​లో ఈ కారు ఎంట్రీ ఇచ్చింది. మరెందుకు ఆలస్యం దీని ధర, అప్డేటెడ్ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

పవర్‌ట్రెయిన్: ఈ కారులో BMW టర్బోచార్జ్డ్ 3.0-లీటర్ స్ట్రెయిట్ సిక్స్ పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. ఇది 480hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది దీని ప్రీవీయస్ మోడల్​ కంటే 20hp పవర్ ఎక్కువ. ఈ ఇంజిన్ 2,650-6,130rpm వద్ద 600Nm టార్క్ ఇస్తుంది. ఇది దీని పాత మోడల్​ కంటే 50Nm టార్క్ ఎక్కువ.

2024 BMW M2 Front Profile
2024 BMW M2 Front Profile (BMW India)

అప్డేటెడ్ ఇంజిన్​తో ఈ కారు 0.1 సెకన్లలో 0-100kph వేగాన్ని అందుకోగలదని BMW చెబుతోంది. ఈ ఇంజిన్​కి 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్​ను జోడించారు. దీని ఆప్షనల్ 6-స్పీడ్ మాన్యువల్ మోడల్ 4.2 సెకన్లలో 0-100kph వేగాన్ని అందుకోగలదు. ఈ కారు టాప్ స్పీడ్ 250కిలోమీటర్లకు పరిమితం చేశారు. అయితే దీని స్పీడ్​ను M డ్రైవర్ ప్యాకేజీ ఆప్షనల్​తో 285kph వరకు పెంచుకోవచ్చు.

2024 BMW M2 Interior
2024 BMW M2 Interior (BMW India)

డిజైన్: 2024 BMW M2 డిజైన్​లో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. కానీ ఈ కారు ఇప్పుడు అనేక కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

2024 BMW M2 Side Profile
2024 BMW M2 Side Profile (BMW India)

కలర్ ఆప్షన్స్:

  • సావో పాలో ఎల్లో
  • ఫైర్ రెడ్
  • పోర్టిమావో బ్లూ
  • స్కైస్క్రాపర్ గ్రే

ఇవి కాకుండా దీని స్టాండర్డ్ M వీల్స్ బ్లాక్ ఫినిషింగ్‌తో డబుల్-స్పోక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇవి ముందువైపు 19-అంగుళాలు, వెనుకవైపు 20-అంగుళాలతో ఉన్నాయి. దీని చక్రాలు సిల్వర్ ఫినిషింగ్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఆప్షనల్​గా అల్కాంటారా ఫినిషింగ్‌తో కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఇందులో ఇన్​స్టాల్ చేశారు.

2024 BMW M2 Rear Profile
2024 BMW M2 Rear Profile (BMW India)

ఈ అప్డేటెడ్ మోడల్ కారు లేటెస్ట్ జనరేషన్ iDrive సిస్టమ్​తోపాటు కొత్త డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్​ను కూడా కలిగి ఉంది. ఈ BMW M2 కారుకి ఇండియన్ మార్కెట్లో ప్రత్యక్ష ప్రత్యర్థి లేకపోయినా, M2 కంటే పవర్ తక్కువగా ఉన్నప్పటికీ.. దాని సైజ్, డైనమిక్స్​ పరంగా ఇది మెర్సిడెస్-AMG A 45 S హ్యాచ్‌బ్యాక్‌తో పోటీపడుతుంది.

ధర: కంపెనీ ఈ కారును రూ. 1.03 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది.

వావ్.. ఆడి నయా కారు అదుర్స్..!- ఈ లగ్జరీ వెహికల్ ధర ఎంతో తెలుసా?

'గ్లోసీ బ్యాక్ డిజైన్'తో లావా మొబైల్.. చూడటానికి అచ్చు ఐఫోన్ లాగే.. కేవలం రూ.6,999లకే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.