10 Incredibly Useful Websites : ప్రస్తుత కాలంలో సమాచారమే ఒక సంపద (ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్)గా మారిపోయింది. అందుకే మనకు కావాల్సిన సరైన సమాచారం కోసం ఇంటర్నెట్ అంతా వెతికేస్తూ ఉంటాం. కానీ కొన్ని సార్లు ఎంత సెర్చ్ చేసినా మనకు కావాల్సిన సరైన ఇన్ఫర్మేషన్ లభించకపోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్‌లో సరైన సమాచారం ఇచ్చే టాప్-10 వెబ్‌సైట్స్ గురించి తెలుసుకుందాం.
1. Honey
హనీ అనేది పేపాల్‌కు చెందిన ఒక వెబ్సైట్. దీనిలో అన్ని రకాల కూపన్ కోడ్లు, డిస్కౌంట్లు ఉంటాయి. కనుక షాపింగ్ ప్రియులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ హనీ సైట్‌లోని కూపన్ కోడ్లు ఉపయోగించి, మీరు కోరుకున్న దాన్ని మంచి డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
2. Have I Been Pwned?
నేడు గుర్తింపు దొంగతనం (ఐడెంటిటీ థెఫ్ట్), డిజిటల్ డేటా లీక్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవేళ మీ వ్యక్తిగత సమాచారం లేదా డేటా లీక్ అయ్యిందో, లేదో తెలుసుకోవాలంటే ఈ Have I Been Pwned వెబ్సైట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
3. WeTransfer
మన బంధువులకు లేదా స్నేహితులకు ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు ఆన్లైన్లో పంపించాల్సి వస్తుంది. కానీ అవి చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీట్రాన్స్‌ఫర్ బాగా పనికి వస్తుంది. ఈ వైబ్‌సైట్ మీ ఫైల్స్ అన్నింటినీ పంపించడానికి అవసరమైన డౌన్లోడ్ లింక్‌ను క్రియేట్ చేస్తుంది. దానిని సింపుల్‌గా మీ బంధువులు, స్నేహితులకు పంపిస్తే సరిపోతుంది.
4. Adobe Acrobat PDF Filler
పీడీఎఫ్ ఫైల్‌ను ఎడిట్ చేయాలంటే, ప్రోవెర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు ఆన్లైన్లో ఉచితంగా అడోబ్ అక్రోబాట్ పీడీఎఫ్ ఫిల్లర్‌ను వాడుకోవచ్చు. ఇందుకోసం మీరు ఫ్రీ అడోబ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తరువాత అడోబ్ పీడీఎఫ్‌ను మీరు ఫ్రీగా ఎడిట్ చేయవచ్చు. సంతకం పెట్టవచ్చు. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
5. Project Gutenberg
ప్రాజెక్ట్ గుటెన్బర్గ్ను 1971లో కొంత మంది వాలంటీర్లు కలిసి స్థాపించారు. దీనిలో డిజిటల్ ఫార్మాట్లో పుస్తకాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు ఉంటాయి. ఇందులోని ప్రసిద్ధమైన సాహిత్య రచనలను మీరు ఉచితంగా చదవవచ్చు.
6. The Internet Archive
ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో భారీ స్థాయిలో పుస్తకాలు, చలనచిత్రాలు (మూవీస్), సంగీతం, వెబ్‌పేజీలు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లు ఉంటాయి. వీటన్నింటినీ పూర్తి ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.
7. Grammarly
వర్క్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసేటప్పుడు, ఈ-మెయిల్స్ రాసేటప్పుడు వాటిలో చాలా అక్షర దోషాలు, వ్యాకరణ లోపాలు ఉంటుంటాయి. వీటిని సరిచేసేందుకు గ్రామర్లీ అనేది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఈ గ్రామర్లీ ఏఐ ఇంటిగ్రేషన్‌తో పనిచేస్తుంది. దీనిని మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. అదనపు ఫీచర్లు కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.
8. FamilySearch
ఇది ఒక డేటాబేస్. జీసెస్ క్రైస్ట్ నుంచి నేటి సెయింట్స్ వరకు అందరి గురించి ఇది తెలియజేస్తుంది. అంటే అత్యంత సమగ్రమైన వంశవృక్షాన్ని ఇది తెలియజేస్తుంది. కనుక దీనిని ఉపయోగించి ఒక వంశం ఆవిర్భవించిన దగ్గర నుంచి వలస వెళ్లడం వరకు, అన్ని రకాల కుటుంబ రికార్డ్లను పూర్తి ఉచితంగా చూడవచ్చు.
9. Doodle
ఇది ఒక ఫ్రీ వెబ్ యాప్. దీని ద్వారా మీటింగ్స్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్‌తో కలవవచ్చు. ఇతర గ్రూప్ యాక్టివిటీలను షెడ్యూల్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు డూడుల్ పోల్‌ను పెట్టవచ్చు. దీని ద్వారా అందరికీ అనువైన సమయంలో మీటింగ్‌లు పెట్టుకోవచ్చు.
10. Canva
గ్రాఫిక్ డిజైనింగ్ నైపుణ్యం లేనివారు కూడా అద్భుతమైన గ్రాఫిక్స్ రూపొందించడానికి, రెజ్యూమ్‌లు, అన్ని రకాల డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకోవడానికి కాన్వా చాలా బాగా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు అయితే ఇది ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు. దీనిలో ఫొటోలు, వీడియోలు, ఎలిమెంట్స్ సహా బోలెడు ఫీచర్లు ఉంటాయి. విషయం ఏమిటంటే, దీనిలో ఫ్రీ వెర్షన్ కూడా ఉంది. అదనపు ఫీచర్ల కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
కంటి చూపుతోనే స్క్రీన్‌ను ఆపరేట్ చేసేలా - యాపిల్ నయా ఫీచర్స్! - Apple Accessibility Features