How to Update Aadhar Card in Mobile Phone: ప్రస్తుతం ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అంత ఉపయోగకరమైన ఆధార్ కార్డులో ఒక్క చిన్న మిస్టేక్ ఉన్నా ముఖ్యమైన పనులు నిలిచిపోవచ్చు. దీంతోపాటు ఆధార్ చేయించుకున్న ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అడ్రస్, ప్రూప్స్ డాక్యుమెంట్స్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో ఉన్న తప్పులను సరిదిద్దుకునేందుకు కేంద్రం అవకాశాన్ని కల్పించింది. సెప్టెంబర్ 14 లోపు ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు గడువు ఇచ్చింది. అంటే ఆధార్ ఫ్రీ అప్డేట్కు ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోగా ఆధార్ అప్‌డేట్ చేసుకోకపోతే ఆధార్ సెంటర్‌కు వెళ్లి రూ. 50 చెల్లించి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ అవసరం లేకుండా ఇంట్లో కూర్చునే మొబైల్ ఫోన్లో ఈ కింది ఈజీ స్టెప్స్‌తో ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ ఫ్రీ అప్‌డేట్ సింపుల్ ప్రాసెస్:
- Step 1: ఆధార్ కార్డును అప్‌డేట్ చేసేందుకు మొదట ఉడాయ్ పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/portal లోకి వెళ్లండి.
- Step 2: తర్వాత ఎంటర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, 'సెండ్ OTP' ఆప్షన్‌పై ప్రెస్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వచ్చిన తర్వాత, దాన్ని నమోదు చేసి ఎంటర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- Step 3: డాక్యుమెంట్ అప్‌డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- Step 4: సూచనలను చదివిన తర్వాత తదుపరి ఎంపికపై క్లిక్ చేయండి.
- Step 5: మీ వివరాలను ధృవీకరించిన తర్వాత, 'I Verify Above Details are Correct' అనే బాక్స్‌పై క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్‌కు వెళ్లండి.
- Step 6: ఇప్పుడు ID, అడ్రస్ ప్రూఫ్ కోసం కొన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఇలా సింపుల్‌గా ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకుకోవచ్చు. అప్‌డేట్ చేసిన ఏడు వర్కింగ్ డేస్ తర్వాత అప్‌డేట్ అయిన కొత్త ఆధార్ కార్డును మనం పొందొచ్చు.