ETV Bharat / state

కల్తీ నెయ్యి ఘటనపై ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ - YS Jagan Letter to PM Modi - YS JAGAN LETTER TO PM MODI

YS Jagan Letter to PM Modi: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ప్రధాని మోదీకి మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వివాదం తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాజకీయాలకోసం టీటీడీ ప్రతిష్ఠను చంద్రబాబు దిగజార్చుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

YS Jagan Letter to PM Modi
YS Jagan Letter to PM Modi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2024, 4:48 PM IST

Updated : Sep 22, 2024, 7:49 PM IST

YS Jagan Letter to PM Modi: వందరోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సున్నితమైన తిరుమల లడ్డూ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీయాలని ప్రధాని మోదీని కోరారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ చేశారన్న సీఎం చంద్రబాబు ఆరోపనలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జగన్ సుదీర్ఘ లేఖ రాశారు.

ప్రజల దృష్టిని మరల్చడానికి పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారని, దీంట్లో భాగంగానే తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు చేశారని తెలిపారు. రాజకీయ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ ప్రచారం చేశారన్నారు. నెయ్యిని ఆలయానికి పంపే ముందు దాని స్వచ్ఛత, నాణ్యతలపై నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌, కాలిబ్రేషన్‌ ల్యాబరేటరీస్‌ ద్వారా గుర్తింపు పొందిన ఏజెన్సీల నుంచి తప్పనిసరిగా ధృవీకరణ ఉండాలనే నిబంధన అమలు చేస్తారన్నారు. అలాగే ఆలయంలోని వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్‌ నుంచి మూడు నమూనాలను తీసుకుని పరీక్షిస్తారని, ఈ మూడు శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారని లేఖలో తెలిపారు.

ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్‌ను తిరస్కరిస్తారని, ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరన్నారు. 2024, జులై 12న తిరుమలకు నెయ్యి ట్యాంకర్లు రాగా, కల్తీ జరిగిందని తిరస్కరించారని తెలిపారు. తిరస్కరించిన ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని జగన్ ప్రధానికి తెలిపారు. ట్యాంకర్లు వెనక్కి పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు బాధ్యతా రాహిత్యంగా, వ్యాఖ్యలు చేశారన్నారు.

కోట్ల మంది తిరుమల భక్తుల్లో ఆవేదనకు దారి తీసిందన్నారు. పోషకాహార లోపం ఉన్న ఆవు నుంచి వచ్చే పాల నుంచి నెయ్యి పొందినట్లయితే లేదా పామాయిల్‌ అధికంగా తినిపించిన ఆవు పాల నుంచి నెయ్యి పొందినట్లయితే, జంతువు కొవ్వు ఉనికిని సూచించే పరీక్షల్లో కచ్చితత్వంతో సరైన ఫలితాలు కొనుగొనేందుకు అవకాశాలు ఉండవని పరీక్షలు జరిపి నిర్దారించిన సంస్థ తెలిపిందని వివరించారు. చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

తన రాజకీయాలకోసం చంద్రబాబు టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని ఆరోపించారు. సున్నితమైన అంశాన్ని రాజకీయాలకోసం వాడుతున్నారన్నారు. పరీక్షల్లో కచ్చితత్వంపై నిర్ధారణ లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం హోదా వ్యక్తి ఇలాంటి దిగ్భ్రాంతి కలిగించే ఆరోపణలు చేయకూడదన్నారు. చంద్రబాబు నాయుడును తీవ్రంగా మందలించాల్సిన అవసరం ఉందన్న జగన్, దీంతోపాటు నిజానిజాలను వెలుగులోకి తీసుకురావడం అత్యవసరమన్నారు. చంద్రబాబునాయుడు సృష్టించిన అనుమానాలను నివృత్తి చేయాలని ప్రధానిని జగన్ కోరారు.

ఇదే అంశంపై రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్, కేంద్రంలోని బీజేపీ పెద్దలపై విమర్శలు చేశారు. బీజేపీకి వారికి సగం తెలుసు, సగం తెలియదని అన్నారు. టీటీడీ బోర్డులో బీజేపీలోని సీనియర్లు సభ్యులుగా చేశారని, ఈ ప్రొసీజర్లు వారికి తెలియవా అని ప్రశ్నించారు. తెలియకపోతే తెలుసుకోమనండని అన్నారు. బీజేపీ వారు నిజంగానే హిందువులకు నిజాయతీగా ప్రాతినిధ్యం వహించేవారైతే ఇంత దుర్మార్గంగా ప్రచారం చేయడం ధర్మమేనా అని చంద్రబాబుకు గట్టిగా అక్షింతలు వేయాలంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కల్తీ నెయ్యి ఘటనలో వివరణ ఇవ్వకుండా, చంద్రబాబుపై రాజకీయ ఆరపణలు చేస్తూ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాయడం ఆసక్తిగా మారింది.

వైఎస్సార్సీపీ విశ్వసనీయత కోల్పోయింది - 'కల్తీ నెయ్యి'పై సీబీఐ విచారణ జరిపించాలి : వైఎస్ షర్మిల - Sharmila Comments On YS Jagan

Last Updated : Sep 22, 2024, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.