ETV Bharat / state

అసంపూర్తిగా ప్రభుత్వ కార్యాలయాల భవనాలు - కూటమి రాకతో ప్రజల్లో చిగురించిన ఆశలు - Vuyyuru Govt Offices

YSRCP Neglect Vuyyuru Govt Offices in Krishna District : ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి దాత కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలిచ్చినా గత ఐదేళ్లలో అడుగు ముందుకు పడలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లూ కాలయాపన చేసి ప్రజలకు, అధికారులకు అవస్థలు మిగిల్చింది. ఇందుకు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో అసంపూర్తి భవనాలే తార్కాణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ప్రజల్లో ఆశలు చిగురించాయి.

Vuyyuru Govt Offices
Vuyyuru Govt Offices (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 3:44 PM IST

వైఎస్సార్సీపీ సర్కార్​ జాప్యం - అసంపూర్తిగా ప్రభుత్వ కార్యాలయాల భవనాలు (ETV Bharat)

YSRCP Neglect Vuyyuru Govt Offices in Krishna District : విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి పక్కన గండిగుంట గ్రామ పంచాయతీ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్, తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలు ఉండేవి. గతంలో అన్నీ ఒక్కచోట ఉన్న ఆఫీసులను రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించడంతో చెట్టుకు ఒకటి పుట్టకు ఒకటిగా మారాయి. తాత్కాలికంగా ఈ కార్యాలయాలను వేర్వేరు చోట్ల ఏర్పాటు చేశారు. అక్కడ భవనాలు సరిపోక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

గండిగుంట గ్రామానికి చెందిన సామాజికవేత్త సజ్జా వెంకటేశ్వరరావు ప్రభుత్వ కార్యాలయాల అన్నింటికి ఒకేచోట స్థలం ఇచ్చారు. కాకానినగర్ సమీపంలో ఆయనకు ఉన్న ఎకరా 85 సెంట్ల భూమిని ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు. దాత భూమిని ఇవ్వడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం కార్యాలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. 45 లక్షల రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం, రూ. 25 లక్షలతో గ్రామీణ పోలీస్ స్టేషన్ భవనాలను నిర్మించారు. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి.

విశాఖ రైల్వే జోన్​కు భూముల కేటాయింపుపై ప్రభుత్వం ఫోకస్- ముడసర్లోవ స్థలంపై నివేదిక! - visakha RAILWAY ZONE

అసంపూర్తిగా వదిలేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం : వివిధ పనుల నిమిత్తం దాదాపు 10 గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన ఉయ్యూరుకు వస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాల పనులు వేగంగా సాగుతున్న తరుణంలో ప్రభుత్వ ఆఫీసుల్లో పనుల కోసం ఉయ్యూరు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ప్రజలు భావించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడంతో పరిస్థితి తారుమారు అయింది. జగన్ సర్కార్ నిర్మాణాలు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేసింది.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉయ్యూరు ప్రభుత్వ కార్యాలయాలులో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కూటమి ప్రభుత్వమైన వీటిని త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. -స్థానికులు

విద్యుత్​ బిల్లు తగ్గాలా ! 'సోలార్​ రూఫ్​టాప్' అమర్చుకోండి - Solar Rooftop in Kurnool

కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి : కూటమి ప్రభుత్వం రాకతో కార్యాలయాలను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తారనే భావన ప్రజల్లో కలిగింది. ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. దానిని కూడా తహసీల్దార్ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన భవనంలోకి మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల రెవెన్యూ డివిజన్ అధికారులు నిరుపయోగంగా ఉన్న భవనాన్ని పరిశీలించారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో విలువైన భూమిని ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇచ్చానని దాత సజ్జా వెంకటేశ్వరరావు అన్నారు. భవనాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

రహదారి ప్రమాదాల నివారణపై ప్రభుత్వం ఫోకస్​ - భద్రతా చర్యలకు ఆదేశం - Road Accidents Raised In AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.