Vijayasai Reddy Attends ED Inquiry : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న వ్యవహారంపై ఈడీ విచారణను ముమ్మరం చేసింది. కేఎస్‌పీఎల్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు నిర్ధారించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే విచారణకు రావాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ సమావేశాల కారణంగా ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు.
ఆ డబ్బులు ఎక్కడివి? ఎవరివి?- దూకుడు పెంచిన ఈడీ
జగన్ మరో దాష్టీకం వెలుగులోకి - రాక్షస రాజకీయంతో కాకినాడ పోర్టు అరబిందో పరం!