ETV Bharat / state

టీడీపీ ఓట్ల తొలగింపునకు వైఎస్సార్సీపీ కుటిల యత్నం - అధికారుల వత్తాసు ! - శ్రీకాళహస్తిలో టీడీపీ ఓట్లు తొలగిపు

YSRCP Leaders Try To Removing TDP Votes: అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చేందుకు వైఎస్సార్సీపీ నేతలు కుటీలయత్నాలు చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దొంగ ఓట్లను పాటు ప్రతిపక్షాలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు వైఎస్సార్సీపీ నేతలకు వత్తాస్తు పలుకుతున్నారు.

YSRCP_Leaders_Try_To_Removing_TDP_Votes
YSRCP_Leaders_Try_To_Removing_TDP_Votes
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 10:07 AM IST

Updated : Feb 21, 2024, 12:36 PM IST

టీడీపీ ఓట్ల తొలగింపునకు వైఎస్సార్సీపీ కుటిల యత్నం - అధికారుల వత్తాసు !

YSRCP Leaders Try To Removing TDP Votes : అడ్డదారుల్లో అయినా అధికారంలోకి వచ్చేందుకు వైఎస్సార్సీపీ నేతలు కుటీలయత్నాలు చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నేతల ప్రోత్బలంతో ఓటరు జాబితాలో దొంగ ఓట్లను పెద్ద ఎత్తున చేర్చడంతో పాటు ప్రతిపక్షాలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో ని 262 పోలింగ్ కేంద్రంలో ఏకంగా 84 మంది తెలుగుదేశం పార్టీ, విపక్ష సానుభూతిపరులకు చెందిన ఓట్ల తొలగించేందుకు ఓటర్ల పేరుతో ఫారం-7 (Form-7) దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించారు.

"మా గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతుందని సమాచారంతో వివరాలు తెలుసుకున్నాం. పారం-7 వివరాలు సేకరించి పార్టీ నేతలకు తెలియజేశాం. మా గ్రామంలో ఉన్న వారిని తొలగించేందుకు కుట్ర పన్నిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి."- శంకర్ నాయుడు

వైఎస్సార్సీపీ ఫారమ్​-7 ఆగడాలు- అడ్డుకోవాలని ఈసీకి లేఖ

ఒక్కో వ్యక్తి పేరుతో ఆరు దరఖాస్తులు : పూడిలోని 262 పోలింగ్ కేంద్రంలో తుది జాబితా ప్రకారం 1089 మంది ఓటర్లు ఉన్నారు. తుది ఓటరు విడుదలకు మూడు నాలుగు రోజుల ముందు అధికార వైఎస్సార్సీపీ నేతలు ఓటర్ల పేరిట ఫారం-7 కింద 84 దరఖాస్తులు సమర్పించారు. ఇవన్నీ జాబితాలోని కొందరు వ్యక్తుల పేర్లతోనే ఉండటం గమనార్హం. ఒక్కో వ్యక్తి పేరుతో ఆరు దరఖాస్తులు పొందపరచడం విశేషం.

ఐపీ అడ్రస్ తోనే గుర్తించలేరా : వాస్తవానికి ఇలా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించినప్పుడు కచ్చితంగా లాప్ టాప్, కంప్యూటర్లను ఉపయోగించాలి. వాటి ఐపీ అడ్రస్ ఆధారంగా ఎక్కడి నుంచి దరఖాస్తులు వచ్చాయన్నది కనిపెట్టవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించేటప్పుడు చరవాణి నెంబర్లు పొందుపరచాలి. ఇలా ఎవరి చరవాణి నంబర్లు పొందుపరచారనేది చూస్తే తెలుస్తుంది. అధికారులు ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం అధికార వైఎస్సార్సీపీ నేతలకు వత్తాస్తు పలుకుతున్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో ఇదే తరహాలో అక్రమాలు చోటు చేసుకున్నాయి.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తుది ఓటరులోనూ అవే తప్పులు - అదే నిర్లక్ష్యం!

"మా గ్రామంలో ఓట్లు తొలగించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారు. నాతో పాటు నా చెల్లి ఓటు తొలగించాలని ఫారం-7 సమర్పించారని తెలిసీ అవాక్కయ్యాను."- అనంత్

"నాకు తెలియకుండానే నా ఓటుతో పాటు మరో ఆరుగురి ఓట్లు తొలగించాలని నేను ఫారం-7 ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. ఓట్లు తొలగించేందుకు వైఎస్సార్సీపీ నేతలు తప్పుడు దరఖాస్తులు నమోదు చేయడం దారుణం. పూర్తి స్థాయిలో విచారించి సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి."- శరత్ బాబు

సజ్జల కుటుంబానికి డబుల్ ఓట్లు - ఓటర్ల జాబితాలో పారదర్శకతకు తూట్లు

Last Updated : Feb 21, 2024, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.