ETV Bharat / state

ఓటమి బాటలో వైఎస్సార్సీపీ - కౌంటింగ్​ ​కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న అభ్యర్థులు - YSRCP Leaving Counting Center - YSRCP LEAVING COUNTING CENTER

YSRCP Leaders Leaving the Counting Centers: మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో ఎన్నికల కౌంటింగ్​ నుంచి పలువురు వైఎస్సార్సీపీ నేతలు కౌంటింగ్​ కేంద్రాల నుంచి బయటికి వెళ్లిపోతున్నారు. వైఎస్సార్సీపీ గుడివాడ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ, పామర్రు అభ్యర్థి కైలే అనిల్ కుమార్ బయటికి వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న కౌంటింగ్​లో మెజారిటీ తగ్గడంతో బాలినేని శ్రీనివాస్​ రెడ్డి కారులో ఇంటికి వెళ్లిపోయారు.

YSRCP defeat
YSRCP defeat (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 10:51 AM IST

Updated : Jun 4, 2024, 11:33 AM IST

ఓటమి బాటలో వైఎస్సార్సీపీ - కౌంటింగ్​ ​కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న అభ్యర్థులు (ETV Bharat)

YSRCP Leaders Leaving the Counting Centers: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్​ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సునామీ కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. కూటమి ప్రభంజనంలో ఫ్యాన్​ కొట్టుకుపోయింది. ఆధిక్యాల్లో కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది.

మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రం నుంచి గుడివాడ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ బయటికి వెళ్లిపోయారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రం నుంచి పామర్రు వైఎస్సార్సీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ కూడా ​బయటికి వెళ్లిపోయారు. కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు టీవీలో చూసి తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి నాని వెళ్లిపోవడం అతనికి అప్పుడే ఓటమి ఖాయమని భావించినట్లు తెలుస్తోంది.

ఏపీలో కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఫ్యాన్‌ - టీడీపీ శ్రేణులు సంబరాలు - TDP Celebrations in Andhra Pradesh

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న కౌంటింగ్​లో మెజారిటీ తగ్గడంతో వైఎస్సార్సీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్​ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి హుటా హుటిన కారులో ఇంటికి వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు సైతం కౌంటింగ్ జరుగుతుండగా మధ్యలోనే ఇంటికి జారుకున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూటమి క్లీన్​ స్వీప్‌ - AP Election Result2024

Last Updated : Jun 4, 2024, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.