ETV Bharat / state

దీపం ఉండాగనే ఇళ్లు చక్కపెట్టుకున్న వైఎస్సార్సీపీ నేతలు - రోజా ఆస్తులు ఎంతో తెలుసా? - RK Roja Properties - RK ROJA PROPERTIES

YSRCP Leader RK Roja Properties: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2 కోట్ల 74 ఉండగా ఇప్పుడు 4 కోట్ల 58 లక్షలకు చేరాయి. 2019 స్థిరాస్తులు 4 కోట్ల 64 లక్షలుండగా, ప్రస్తుతం రూ.6 కోట్ల 5 లక్షలకు చేరాయి. ఐదేళ్లలో 81 లక్షలు పెరిగాయి.

YSRCP Leader RK Roja Properties
YSRCP Leader RK Roja Properties
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 10:17 AM IST

YSRCP Leader RK Roja Properties : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి రోజా స్థిర, చర ఆస్థుల విలువ భారీగా పెరిగిపోయింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో మంత్రి రోజా తనతో పాటు, భర్త సెల్వమణి, కుమారుడు, కూతురు పేరు మీద ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు భారీగా కొనుగోలు చేశారు. నగరి నియోజకవర్గం నుంచి మూడోసారి బరిలో దిగుతున్న మంత్రి రోజా శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో తనతో పాటు కుటుంబ సభ్యుల ఆస్థుల వివరాలను వెల్లడించారు.

YSRCP Leaders Election Affidavit 2024 : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు 2 కోట్ల 74 ఉండగా ఇప్పుడు 4 కోట్ల 58 లక్షలకు చేరాయి. 2019 స్థిరాస్తులు 4 కోట్ల 64 లక్షలుండగా, ప్రస్తుతం 6 కోట్ల 5 లక్షలకు చేరాయి. ఐదేళ్లలో 81 లక్షలు పెరిగాయి. 2019లో కోటీ 8 లక్షల విలువైన ఆరు కార్లు, ఒక బైక్‌ ఉండగా నేడు కోటీ 59 లక్షల విలువైన 9 కార్లున్నాయి. 2019 నాటి కంటే కార్ల విలువను ఇప్పుడు బాగా తగ్గించారు.

చిత్తూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిపై ఎర్రచందనం కేసులు - పెద్దారెడ్డిపై క్రిమినల్​ కేసులు - Cases on YSRCP MLA Candidates

ఐదేళ్లలో నగరి నియోజకవర్గంలో భర్త పేరిట 6.39 ఎకరాల భూమి కొన్నారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా పాలవేరి, తిరుముకదల్‌ ప్రాంతాల్లో 2.89 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో 450 చదరపు అడుగులు, పుత్తూరు సమీపంలో 3750 చదరపు అడుగులు ఇళ్ల స్థలాలు 2020 సంవత్సరంలో కొనుగోలు చేశారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు తిరుపతి, నగరి పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్లు వివరించారు. చెన్నై, హైదరాబాద్‌, నగరి పరిసర ప్రాంతాల్లో భర్త సెల్వమణితో పాటు తన పేరు మీద ఆస్థులు కొనుగోలు చేశారు. కూతురు పేరు మీద 24.53 లక్షల చరాస్తులు, 27.54 లక్షల స్థిరాస్తులు, కుమారుడు కౌశిక్‌ పేరు మీద 14.85 లక్షల చరాస్తులు 49.87 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి.

'బుట్టా రేణుక నిరుపేద - ఆస్తులు మాత్రం రూ.161.21 కోట్లు' - Ysrcp Candidate Butta Renuka

రోజాపై గత ఎన్నికలప్పుడు 4 కేసులుండగా ఇప్పుడు ఒక్కటీ లేదు. ఆమె ఇంటర్‌ వరకు చదివారు. మంత్రి రోజాకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 39లక్షల 21 వేల విలువైన చీటీ ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరో ప్రైవేటు చిట్‌లోనూ ఆమెకు రూ.32లక్షళ 90వేల 450 రూపాయల విలువైన మొత్తం ఉన్నట్లు పేర్కొన్నారు.

మొదటి దశ ఎన్నికల్లో 252మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు- సగానికి పైగా మందిపై తీవ్ర నేరారోపణలు : ADR - ADR Report on candidates cases

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.