ETV Bharat / state

"ఆచార్యా మీకిది తగునా?" అవకాశమిచ్చిన చోటే అక్రమాలు - ద్రవిడ యూనివర్సిటీ ఉనికి ప్రశ్నార్థకం

రాజకీయ పునరావాసాలుగా విశ్వవిద్యాలయాలు - మార్చి విద్యా వ్యవస్థను కుప్పకూల్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం

ysrcp_irregularities_in_kuppam_dravidian_university
ysrcp_irregularities_in_kuppam_dravidian_university (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

YSRCP Irregularities in kuppam Dravidian University : ద్రవిడ భాషలు, సంస్కృతి, సాహిత్యంపై పరిశోధనలను ప్రోత్సహించే ఉన్నతమైన లక్ష్యంతో ఏర్పాటు చేసిన ద్రావిడ విశ్వవిద్యాలయం గత వైఎస్సార్సీపీ పాలనలో అక్రమాలకు అడ్డాగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాసాలుగా మార్చి విద్యా వ్యవస్థను కుప్పకూల్చిన తరహాలోనే గత పాలకులు ద్రావిడ విశ్వవిద్యాలయ ప్రమాణాలను దిగజార్చారు. రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించిన వేణుగోపాల్‌రెడ్డి అవకతవకలకు పాల్పడి వర్సిటీ ప్రతిష్టను మసకబార్చారని విమర్శలున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ద్రావిడ సంస్కృతిలోని విలక్షతను విశ్వానికి చాటి చెప్పాలన్న మహోన్నతమైన లక్ష్యంతో ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ద్రావిడ భాషలు, సాహిత్యం, సంస్కృతిపై విస్తృతమైన పరిశోధనలు, ప్రచురణల సంకల్పంతో 1997లో ద్రావిడ విశ్వ విద్యాలయం నెలకొల్పారు. ద్రవిడ భాషలపై పరిశోధనలకు అనువైన తులనాత్మక ద్రావిడ సాహిత్యం, ద్రావిడ తత్వం, ద్రావిడ జానపద గిరిజన విజ్ఞాన శాఖ తెలుగు అనువాద అధ్యయన శాఖ, ద్రావిడ సమాజ అధ్యయనం కోర్సులను వర్సిటీలో అందుబాటులోకి తెచ్చారు.

వీటితో పాటుగా స్వీయ ఆర్థిక స్వావలంబన కలిగించేందుకు వీలుగా గణితం, ఆర్థికశాస్త్రం, వృక్షశాస్త్రం వంటి కోర్సులను ప్రవేశపెట్టారు. విశ్వవిద్యాలయం ఏర్పాటైన నాటి నుంచి కుప్పం ప్రాంత అభివృద్ధిలో ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని భాగస్వామిగా చేస్తూ వర్సిటీ సర్వతోముఖాభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారు. గడచిన ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో మితిమీరిన రాజకీయ ప్రమేయం వ్యవస్థల్ని లెక్కచేయనితనంతో వర్సిటీ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది.

Dravida University: వేతనాల కోసం ద్రవిడ వర్శిటీ ఉద్యోగుల ఆందోళన.. పరీక్షలు వాయిదా

సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో 39 కోర్సులతో ఏర్పాటైన ద్రావిడ విశ్వవిద్యాలయం దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రెండున్నర దశాబ్దాల పైబడి విజయవంతంగా సాగింది. గడచిన మూడేళ్లుగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించిన వేణుగోపాల్‍ రెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని ఒక రాజకీయ కేంద్రంగా మార్చారనే విమర్శలు వెల్లువెత్తాయి.

గత ప్రభుత్వంలోని కొందరు నాయకుల పలుకుబడిని, రాష్ట్రస్థాయి అధికారుల సాహచర్యాన్ని వినియోగించుకుని పలు అక్రమాలకు పాల్పడ్డారని వర్సిటీ ఉద్యోగులు ఆరోపించారు. విశ్వవిద్యాలయ ఏర్పాటుకు మూలమైన కోర్సులను వైఎస్సార్సీపీ పాలనలో రద్దు చేయడంతో పాటు వర్సిటీ మనుగడ ప్రశ్నార్థకం చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహించాలని విశ్వవిద్యాలయ సిబ్బంది కోరుతున్నారు.

ద్రవిడ యూనివర్సిటీలో అక్రమమైనింగ్​ను అడ్డుకోండి.. గవర్నర్​కు చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.