ETV Bharat / state

శ్రీవారి దర్శనానికి 3నెలల నిరీక్షణా! - అదేం పద్ధతి గోవిందా! - TTD DARSHAN TICKETS

జగన్‌ హయాంలో తిరుమలలో అడ్డగోలు నిర్ణయాలు - పలు సేవలను పునరుద్ధరించాలని శ్రీవారి భక్తుల వినతి

YSRCP Irregularities in tirumala
YSRCP Irregularities in tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 12:07 PM IST

YSRCP Government Irregularities in tirumala darshan Tickets : "ఆపద మొక్కులవాడా అనాథ రక్షకా గోవిందా గోవిందా" అంటూ తిరుమల శ్రీవారి దర్శనానికి తాపత్రయపడే భక్తులకు ఇచ్చే పలు రకాల టోకెన్లకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌ కొవిడ్‌ పేరుతో మంగళం పాడింది. స్వామి వారి దర్శనానికి వారిని దూరం చేసింది. భక్తుల మనోభావాలను తుంగలో తొక్కి సొంత ప్రయోజనాలకే పట్టం కట్టి అడ్డగోలు నిర్ణయాలలో ఆటలాడుకుంది. పాత టికెట్ల విధానాలకు స్వస్తి పలికి 3 నెలల ముందు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడిన ధర్మకర్తల మండలి వీటిపై దృష్టిసారించి సేవలను సులభతరం చేయాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో : దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి తిరుమలలోని మ్యూజియం ఎదుట కౌంటర్లలో 2 విడతలుగా 1,500 దర్శన టికెట్లు జారీ చేసేవారు. వైఎస్సార్సీపీ హయాంలో కొవిడ్‌ పేరిట ఈ విధానాన్ని రద్దు చేశారు. ఆన్‌లైన్‌లో రోజుకు 1000 చొప్పున ఉచిత దర్శన టికెట్లను 3 నెలల ముందుగా జారీ చేస్తున్నారు. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని వారంతా వాపోతున్నారు.

దళారులపై నిఘా- టికెట్లు, గదుల విషయంలో వారి జోక్యం కుదరదు

పెద్ద ఎత్తున అక్రమాలు : కోర్కెలు నెరవేరిన భక్తులు శ్రీవారికి తలనీలాలతో పాటు పొర్లుదండాలు (అంగ ప్రదక్షిణలు) పెడుతుంటారు. వీరి కోసం సీఆర్వో కార్యాలయంలో రోజు 750 మందికి టికెట్లు ఇచ్చేవారు. కొవిడ్‌ తర్వాత ఆన్‌లైన్‌లో 3 నెలల ముందు జారీ చేస్తుండటంతో కొందరు టికెట్లు పొందినా దర్శనానికి రావటం లేదు. భూమన కరుణాకర్‌రెడ్డి ఛైర్మన్‌ అయిన తరువాత ప్రతి శనివారం ప్రదక్షిణకు 250 టికెట్లు ఇస్తామంటూ తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అవి ఎటు పోయాయో ఆ దేవుడికే ఎరుకని, పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

దివ్య దర్శనం : అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వచ్చే స్వామివారి భక్తులకు 2008లో దివ్య దర్శనం పేరిట టోకెన్లు ఇచ్చేవారు. అలిపిరి మార్గంలో రోజుకు 14 వేలు, శ్రీవారి మెట్టులో 6 వేల టోకెన్లు జారీ చేయాలని 2017లో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొవిడ్‌ పేరుతో వాటిని నిలిపేసింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టోకెన్లు ఇస్తోంది. త్వరలోనే అలిపిరిలోనూ పునరుద్ధరించనున్నారు.

ఎస్‌ఈడీ టికెట్లు : ఆర్థిక స్థోమత ఉన్నవారి కోసం గతంలో తిరుపతిలోని శ్రీనివాసంలో రోజుకు 1,500 చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్‌ఈడీ టికెట్లు జారీ చేసేవారు. ప్రతి ధర్మకర్తల మండలి సభ్యులకు రోజుకు 20 టికెట్లు ఇచ్చేవారు. వీటిని సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసి ఏకంగా ఛైర్మన్‌ కార్యాలయం నుంచి ఇచ్చే టికెట్ల సంఖ్యను పెంచారు. దీంతో అక్కడ ఒక్కో టికెట్‌కు సుమారు రూ.3 వేలు (టికెట్‌ ధరతో కలిపి)గా విక్రయించేవారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గతంలోని టికెట్ల ప్రక్రియను పునరుద్ధరించాలని భక్తులు వేడుకుంటున్నారు.

సంక్రాంతి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? - టికెట్ బుకింగ్ డేట్స్ ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.