YSRCP Government Careless on Offshore Project : శ్రీకాకుళం జిల్లాలోని పలాస, వజ్రపు కొత్తూరు, మోలియాపుట్టి, నందిగాం మండల్లాల్లో 24 వేల 600 ఎకరాలకు సాగు నీరు, పలాస - కాశీబుగ్గ పట్టణాలతో పాటు చుట్టు పక్కల మరో 30 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు ఆఫ్‌షోర్ జలాశయం నిర్మాణాన్ని తలపెట్టారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పలాస మండలం రేగులపాడు వద్ద శంకుస్థాపన చేశారు. 127 కోట్ల రూపాయలతో అంచనాలతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు మధ్యలో నిలిచిపోయింది.
కేవలం 3 శాతం పనులు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం : 2014 వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 47 శాతం పనులు పూర్తి చేసింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ సర్కార్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 855 కోట్లు కేటాయించింది. అయితే 300 కోట్ల మాత్రమే ఇవ్వడంతో నిర్వాసితులకు, భూములు ఇచ్చిన వారికి పరిహారం అందించారు. ఐదు సంవత్సరాల్లో కుడి కాలువల తూములు, కరకట్టలు నిర్మాణం చేపట్టి కేవలం 3 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. ఆ తర్వాత నిధులు ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
పట్టించుకోని సీదిరి అప్పలరాజు : ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తికా పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి వర్షాధారంపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తైతే ఏడాదికి రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీదిరి అప్పలరాజుకి ప్రాజెక్టు గురించి అనేక సార్లు చెప్పినా, పట్టించుకోలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.
నిర్వాసితుల ఇబ్బందులు : పునరావాస కాలనీలపైనా వైఎస్సార్సీపీ దృష్టి పెట్టలేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
గత ప్రభుత్వ నిర్వాకంతో హంద్రీనీవాకు నీటి కొరత - 350 క్యూసెక్కుల మాత్రమే విడుదల - Handri Neeva Canal
"గత ఐదు సంవత్సరాలు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆఫ్‌షోర్ జలాశయం నిర్మాణాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన జలాశయ నిర్మాణం పూర్తి చేయలేదు. మేము భూములు, ఇళ్లు అన్ని ఇచ్చాం. ప్రస్తుతం మాకు కర్ర, గొడుగు మాత్రమే మిగిలింది. పంటలకు నీరు అందలేదు. ప్రభుత్వం నుంచి రైతులకు ఎటువంటి సహకారం అందలేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మా కష్టాలు చూసి, మమల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే త్వరగా జలాశయ నిర్మాణం పూర్తి చేసి పంట పొలాలకు సాగు నీరు అందించాలని వేడుకుంటున్నాం." - రాజు, రేగులపాడు రైతు
కూలిపోయే స్థితిలో వంశధార కుడికాలువ వయాడక్ట్ - Vamsadhara right canal damage