ETV Bharat / state

జగన్​ ప్రగల్భాలు - షాదీ తోఫాలో ముస్లింలకు ధోకా - వైఎస్సార్ షాదీ తోఫా పథకం

YSR Shaadi Tohfa Dhoka With Muslims: పేద ముస్లిం యువతులకు ఆర్థిక సాయం కింద అందించే వైఎస్సార్ షాదీ తోఫాకు సీఎం జగన్ ధోకా చేశారు. ఎన్నికల ముందు జగన్‌ ఊరూరా తిరుగుతూ పెళ్లి కానుకల విషయంలో ప్రగల్భాలు పలికారు. ముస్లిం సంఘాలు చివరికి కోర్టు మెట్లు ఎక్కతే గానీ షాదీ తోఫా అమలు చేసేందుకు ముందుకు రాలేదు ఈ వైసీపీ ప్రభుత్వం. అబద్దపు మాటలతో సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు.

YSR Shaadi Tohfa Dhoka With Muslims
YSR Shaadi Tohfa Dhoka With Muslims
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 7:53 AM IST

షాదీ తోఫా పథకంతో ముస్లింలకు ధోకా- పెళ్లి కానుకల విషయంలో ప్రగల్భాలు పలికిన జగన్

YSR Shaadi Tohfa Dhoka With Muslims: ముఖ్యమంత్రి జగన్ పెళ్లి కానుకల విషయంలో ప్రగల్భాలు పలికిన పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయం అందించే షాదీ తోఫా పథకంలో ధోకా చేశారు. ముస్లిం సంఘాలు కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత గానీ షాదీ తోఫా అమలు చేసేందుకు ముందుకురాని జగన్‌ ఇక్కడ కూడా తన కుటీల బుద్ధిని ప్రదర్శించారు. షాదీ తోఫా కింద మంగళవారం విడుదల చేసిన సాయంలో అర్హుల సంఖ్య పెరగకుండా చూశారు. టీడీపీ హయాంతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వంలో సాయం అందిన ముస్లింల సంఖ్య 15.7 శాతంగా ఉంది. ఇదీ పేద ముస్లింలపై కపట ప్రేమ చూపిస్తున్న సీఎం జగన్‌.

ఆర్థిక సాయం పెంచుతున్నట్లు బిల్డప్​ - లబ్దిదారుల కుదింపు - ఇవే జగన్​ మార్క్​ ఐడియాలు

Jagan Boasted About Wedding Gifts: షాదీ తోఫాపై ఎన్నికల ముందు జగన్‌ చెప్పిన మాటలు విని అధికారులు ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నాటి నుంచే వివాహాలు చేసుకున్న ముస్లిం జంటల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నెలలు గడుస్తున్నా పథకం అమల్లోకి రాలేదు. ముస్లిం సంఘాల నుంచి ఒత్తిడి పెరగటంతో ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకానికే ‘వైఎస్సార్‌ పెళ్లి కానుక’గా పేరు మార్చి జీవో ఇచ్చారు. 2020 ఏప్రిల్‌ 2 నుంచి పథకం అమలు చేస్తామని ప్రకటించారు. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తిని సాకుగా చూపి ఆ ఏడాదిలో వివాహం చేసుకున్న ముస్లిం యువతులెవరికీ సాయం అందించలేదు. తర్వాత మరో రెండేళ్లు గడిచినా పథకానికి అతీగతీ లేకపోవటంతో ముస్లిం సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. న్యాయస్థానం నుంచి చివాట్లు తప్పించుకునేందుకు 2022 ఏడాది చివరి నుంచి అమల్లోకి తెచ్చారు. వైఎస్సార్‌ షాదీ తోఫా అంటూ మరోసారి పేరు మార్చి కొత్తగా అమల్లోకి తెచ్చినట్టు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. మొత్తంగా జగన్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి 2022 వరకు పథకాన్ని అమల్లోకి తీసుకురాకుండా కాలయాపన చేసి వేలాది మంది ముస్లిం వధువులకు ఆర్థిక సాయం అందకుండా చేశారు.

'కల్యాణమస్తు, షాదీ తోఫా' నిధులు విడుదల చేసిన సీఎం జగన్​

CM Jagan Release Shaadi Tohfa Money: టీడీపీ ప్రభుత్వంలో ముస్లిం యువత కోసం మొత్తంగా నాలుగేళ్లలో 40,302 మంది ముస్లిం యువతులకు రూ.200 కోట్లకు పైగా సాయాన్ని అందించింది. వైసీపీ ప్రభుత్వం 2022 ఏడాది చివర్లో ప్రారంభించి ఇప్పటివరకు 5 విడతల్లో 6,346 మందికి రూ.63.55 కోట్లు ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకు అందిన సాయంతో పోలిస్తే ఇది 31.61 శాతమే. మూడున్నరేళ్ల తర్వాత అమలు చేసే ఆర్థిక సాయాన్ని 50వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నట్టు ప్రచారం చేసుకుని నిబంధనల కొర్రీలు వేసి లబ్ధిదారుల సంఖ్య పెరగకుండా జాగ్రత్త పడ్డారు. వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ప్రధాన ప్రతిబంధకంగా మారిందని ముస్లిం సంఘాలు గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. ఆదాయ పరిమితి, వ్యవసాయ భూమి, పట్టణాల్లో ఇంటి విస్తీర్ణం, విద్యుత్తు వినియోగం తదితర నిబంధనల్నీ తెచ్చి అర్హుల సంఖ్యకు అడ్డగోలుగా కత్తెర వేసింది.

పిల్లల చదవులు, పెళ్లిళ్ల కోసం పేదలు అప్పుల పాలు కావద్దు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.