ETV Bharat / state

అద్దంలో కూడా చంద్రబాబే కనిపిస్తున్నారా? - జగన్‌ మానసిక పరిస్థితి ఆందోళనకరం : వైఎస్‌ షర్మిల - YS SHARMILA FIRES ON JAGAN - YS SHARMILA FIRES ON JAGAN

YS Sharmila Gave A Reply to CM Jagan Allegations in AP : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపిందంటూ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలపై, షర్మిల స్పందించారు. జగన్ మానసిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు కారణమంటున్నారని మండిపడ్డారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని ఎద్దేవా చేశారు.

YS Sharmila Gave A Reply to CM Jagan Allegations in AP
YS Sharmila Gave A Reply to CM Jagan Allegations in AP (etv bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 4, 2024, 8:43 PM IST

అద్దంలో కూడా చంద్రబాబే కనిపిస్తున్నారా? - జగన్‌ మానసిక పరిస్థితి ఆందోళనకరం : వైఎస్‌ షర్మిల (etv bharat)

YS Sharmila Fires on CM Jagan in AP : జగన్‌ ఏ స్థాయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు. వైఎస్‌ఆర్‌ బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందని ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు నిరూపించాలని షర్మిల డిమాండ్ చేశారు. కడపలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె సీఎం జగన్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందని జగన్‌ చెప్పారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ చేయాలని గతంలో జగన్‌ కోరారు, కానీ జగన్ సీఎం అయ్యాక సీబీఐ విచారణ అక్కర్లేదని జగన్‌ చెప్పారని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. చంద్రబాబు హస్తం ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడారని ఆమె ప్రశ్నించారు. సీఎం జగన్ అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ప్రత్యేక హోదా కోసం ఏపీలో అడుగుపెట్టానని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టిన పార్టీలు వైసీపీ, టీడీపీ కేంద్ర ప్రభుత్వంతో పోరాడటానికి మాత్రమే ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టినట్లు తెలిపారు.

జగన్‌ మానసిక పరిస్థితి బాగోలేదు : తాను చంద్రబాబుతో టచ్​లో ఉన్నట్లు సీఎం జగన్ ఆరోపిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తే ఆందోళన కలిగిస్తుందన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబుకు అమ్ముడుపోయినట్లు నిరూపించగలరానని ప్రశ్నించారు. కేవలం తన కొడుకు పెళ్లికి పిలవడానికి మాత్రమే చంద్రబాబును కలిశానని, అంతకు మించి మరోసారి చంద్రబాబును కలిసింది లేదని స్పష్టం చేశారు. సునీత న్యాయం కోసం పోరాడుతుంటే, సునీతా చంద్రబాబుతో చేతులు కలిపిందని దారుణ విమర్శలు చేస్తున్నారని ఆవేదన చెందారు.

వృద్ధులను పొట్టన పెట్టుకుంటారా? - పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ తీరు దుర్మార్గం: వైఎస్‌ షర్మిల - YS Sharmila On Pension Distribution

తెలంగాణ సీఎం కూడా చంద్రబాబు మాట వింటారా? : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం చంద్రబాబు మాట వింటారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని షర్మిల అన్నారు. ఏం జరిగినా చంద్రబాబే కారణమని చెబుతున్నారు. జగన్‌కు అద్దంలో చూసుకుంటే చంద్రబాబు ముఖమే కనబడుతుందా? అని ఎద్దేవా చేశారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని దుయ్యబట్టారు. జగన్‌కు ఓ అద్దం పంపుతున్నా ఈ అద్దంలో జగన్‌ చూసుకోవాలి, అద్దంలో తానే కనిపిస్తున్నారో చంద్రబాబు కనిపిస్తున్నారో చెప్పాలని షర్మిల విమర్శించారు.

జగన్ అక్రమాస్థుల కేసులో, మెుదట సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ఆర్‌ పేరు లేదని షర్మిల గుర్తుచేశారు. కానీ, సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వైఎస్‌ఆర్‌ పేరు పెట్టాలని సుధాకర్‌ రెడ్డి చూశారని పేర్కొన్నారు. జగన్‌ బయటపడాలంటే ఛార్జ్‌షీట్‌లో వైఎస్‌ఆర్‌ పేరు పెట్టాలనుకున్నారని వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ పేరు ఛార్జ్‌షీట్‌లో పెట్టాలని సుధాకర్‌ రెడ్డి కోర్టుకు వెళ్లారని గుర్తుచేశారు. ఇదే అంశంపై హైకోర్టులో తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లారని పేర్కొన్నారు. ఈ కేసులు వాదించిన సుధాకర్‌రెడ్డికి, జగన్‌ సీఎం అయ్యాక అదనపు అడ్వకేట‌ు పదవి వచ్చిందని గుర్తు చేశారు. జగన్‌ ఆదేశాలు లేకపోతే సుధాకర్‌రెడ్డికి ఏఏజీ పదవి వచ్చేదా? అని షర్మిల ప్రశ్నించారు.

మద్య నిషేధం చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమా? - జగన్​కు షర్మిల మూడో లేఖ - YS Sharmila on Liquor Prohibition

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.