ETV Bharat / state

'ఆ ప్యాలెస్'​లో ఎన్నెన్ని విలాసాలో- ఒక్క డోర్​ ఖర్చుతో డబుల్​ బెడ్​ రూమ్​ కట్టేయొచ్చు - RUSHIKONDA PALACE SPENTS

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్​​ రెడ్డి నిర్మించిన రుషికొండ ప్యాలెస్​లో ఎన్నెన్నో విలాసాలు - ప్రధాన ద్వారానికే రూ.31 లక్షల ఖర్చు - బాత్​రూం టబ్, షవర్​​కు ఎంతో తెలుసా?

Rushikonda Palace
Rushikonda Palace (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2024, 12:19 PM IST

Updated : Nov 12, 2024, 12:36 PM IST

Rushikonda Palace : ఆ భవనాలను చూస్తే మనం ఇంకా రాజుల పాలనలో ఉన్నామా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భవనాల నిర్మాణానికే సుమారు రూ.410 కోట్లు అయిందంటే మాటలా! పైగా ఒక కొండను ఏకంగా చెక్కేసి నియంతలా భవనాలను నిర్మించారు. ఆ భవనాల ప్రధాన ద్వారానికి పెట్టిన తలుపు ఖర్చు (గ్రిల్​తో సహా) ఎంతో తెలుసా? అక్షరాలా రూ.31,84,247 అంటే మనకు ఒక డబుల్​ బెడ్​రూం ఇళ్లు కట్టేయొచ్చు. దీనికే వామ్మో అంటే ఎలా? ఇంకా కమోడ్​, బాత్​రూమ్​లో ఒక్కో షవర్, ఫ్యాన్​ వంటి వాటికి ఎంత అయ్యాయో తెలుసా? ఆ రాజభవనం ఎక్కడుందో తెలుసా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో. కట్టించింది ఆ రాష్ట్ర మాజీ సీఎం జగన్​ మోహన్​ రెడ్డి.

Rushikonda Palace
రుషికొండ ప్యాలెస్ (ETV Bharat)

ఏపీలో గత ఐదేళ్లు అరాచక పాలన జరిగిందనడానికి ఇదో నిదర్శనం. మాజీ సీఎం జగన్​ అధికారంలో ఉన్నప్పుడు నియంతలా ప్రజల సొమ్మును నీరులా ఖర్చు చేసి విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్ ఇది. ఈ ప్యాలెస్​లో ప్రధాన ద్వారానికే రూ.31 లక్షలు ఖర్చయిందని సమాచారం. బాత్​రూమ్​లో అమర్చిన వాల్ ​మౌంటెడ్​ కమోడ్​ ధర రూ.11,46,840. బాత్​రూమ్​లో ఒక్కో షవర్​కి పెట్టిన ఖర్చు రూ.44,640 పైమాటే. ఈ లెక్కలు చూస్తేనే సామాన్యుల కళ్లు గిర్రున తిరిగేలా ఉన్నాయి. ఈ భవనాల నిర్మాణంపై చేసిన ఖర్చు సమాచారాన్ని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్​రాజు సేకరించారు. ఆయన సేకరించిన సమాచారాన్ని పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

Rushikonda Palace
రుషికొండ ప్యాలెస్ (ETV Bharat)

ప్యాలెస్​ ఖర్చుల వివరాలు :

  • రుషికొండ ప్యాలెస్​లో వాడిన ఒక బాత్​ టబ్​, కమోడ్, ప్రధాన తలుపు ఖరీదుతో విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో కుటుంబానికి అవసరమైన డబుల్​ బెడ్​ రూమ్ ఫ్లాట్ వచ్చేస్తుంది.
  • ప్యాలెస్​ ప్రధాన డోర్​లకు రూ.31.84 లక్షలు చొప్పున ఖర్చు చేశారు.
  • ఇతర తలుపులు ఒక్కో దానికి రూ.17,93,658 చొప్పున వెచ్చించారు.
  • బాత్​రూమ్​లలోని ఒక్కో బాత్​టబ్​కు పెట్టిన ఖర్చు రూ.12,38,771.
  • ఒక్కో వాష్​ బేసిన్​కి పెట్టిన ఖర్చు రూ.2,61,500.
  • ప్రధాన ప్రవేశ ద్వారం ముందు అలంకరణం కోసం నాలుగున్నర మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన ఆర్​సీసీ సర్క్యులర్​ కాలమ్స్​కి ఒక్కో దానికి రూ.9,11,719. ఇలా మొత్తం ఎనిమిది కాలమ్స్​కి రూ.72,93,752 ఖర్చు చేశారు.
  • కాన్ఫరెన్స్​ టేబుల్​ ఖరీదు రూ.24.37 లక్షలు.(12.92 మీటర్ల పొడవు).
  • 15 మీటర్ల పొడవులున్న ఆంగ్ల అక్షరం యు ఆకారపు టేబుల్ ఖరీదు రూ.53,73,700.
Rushikonda Palace
రుషికొండ ప్యాలెస్ (ETV Bharat)

ఇలా ఎప్పుడూ చూడలేదు : పెద్దపెద్ద భవనాలు, స్టేడియాలు, మాల్స్​ నిర్మించే కాంట్రాక్టు ఫీల్డ్​లో 1983 నుంచి తాను ఉన్నానని ఎమ్మెల్యే విష్ణుకుమార్​రాజు తెలిపారు. తన 45 ఏళ్ల అనుభవంలో ఎప్పుడూ రుషికొండ ప్యాలెస్​లో వాడినంత ఖరీదైన ఫర్నీచర్​ను చూడలేదన్నారు. సివిల్, ఇంటీరియల్, ఫర్నీచర్​ కలిపి చదరపు అడుగుకు రూ.14,023 ఖర్చు అయిందని అధికారులు తెలిపారన్నారు. కానీ ఎక్స్​కవేషన్​, హిల్​ కటింగ్​ వంటి ఖర్చులు కలిపితే చదరపు అడుగుకి ఇంకా ఎక్కువే ఖర్చు అయిందని ఆయన పేర్కొన్నారు.

Rushikonda Palace
రుషికొండ ప్యాలెస్ (ETV Bharat)

రుషికొండ భవనాల్లో సౌకర్యాలను చూసి చంద్రబాబు ఆశ్చర్యం

'పేదింటి జగన్​ రెడ్డి' రుషికొండ రాజమహల్​లో కళ్లు చెదిరే నిర్మాణాలు - Vizag Rushikonda Palace

Last Updated : Nov 12, 2024, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.