ETV Bharat / state

ఇట్స్ నాట్ ఫన్!! అది నోరా డ్రైనేజా? - యూట్యూబర్​పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు - YouTuber P Hanumanthu Controversy - YOUTUBER P HANUMANTHU CONTROVERSY

YouTuber Praneeth Hanumanthu Controversy: అమెరికాలో ఉంటున్న ప్రణీత్‌ హనుమంతు ఓ వీడియోలో తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చిట్‌చాట్‌ చేశాడు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేసిన టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తాజాగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఒకరైన ప్రణీత్‌ అమెరికాలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇదిలా ఉండగా దారుణ వ్యాఖ్యలు చేసిన ప్రణీత్‌ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పాడు.

Seethakka Fire on Child Abuse
Child Abuse of Social Media (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 2:25 PM IST

Netizens Slams Youtuber Praneeth Hanumanthu : సోషల్‌ మీడియా సామాన్యుల భావ ప్రకటనకు వేదిక. కానీ నేడు అవి అడ్డూఅదుపూ లేని తప్పుడు సమాచారాన్నీ, వందతులనూ వ్యాప్తి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తమ ఆనందం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మానవత్వం మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఒక యూట్యూబర్ స్నేహితులతో కలసి వీడియో ఛాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు. తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి మాట్లాడాడు.

అమెరికాలో ఉన్న ప్రణీత్‌ హనుమంతు ఓ యూట్యూబ్ వీడియోలో తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చిట్‌చాట్‌ చేశాడు. ఆయనతో పాటు మరో ముగ్గురు యువకులు కలసి వేర్వేరు చోట్ల కూర్చుని ఒక రీల్ గురించి లైవ్​లో మాట్లాడారు. ఆ రీల్​లో ఒక తండ్రి, కూతురు ఉంటారు. తండ్రీ కూతుళ్ల మధ్య అసభ్యకర సంబంధం అనే అర్థం వచ్చేలా సంభాషించాడు. ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సినీ నటుడు సాయిదుర్గ తేజ్ దారుణంగా వీడియోలు చేస్తున్నారంటూ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు : ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడులతోపాటు మరికొందరిని సాయిదుర్గ తేజ్ ట్యాగ్‌ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తాజాగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఒకరైన ప్రణీత్‌ అమెరికాలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇదిలా ఉండగా యూట్యూబ్​లో అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన ప్రణీత్‌ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పాడు.

Seethakka Fire on Child Abuse : సోషల్‌ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఘటనపై శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తండ్రీకుమార్తెల మధ్య అనుబంధాన్ని కొందరు అసభ్యంగా వక్రీకరించడం దారుణమని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు.

'అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను' - ఆ వ్యక్తికి మంచు మనోజ్ మాస్ వార్నింగ్ - MANCHU MANOJ ABOUT CHILD ABUSE

కుటుంబ బంధాలను అప‌హాస్యం చేస్తే చట్టపరంగా చర్యలు : మంత్రి సీతక్క - Seethakka on Abuse of Social Media

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.