ETV Bharat / state

హర్ష సాయి బాధితురాలి మరో ఫిర్యాదు - ఈసారి కంప్లైంట్​ ఏంటంటే? - Complaint on Youtuber Harsha Sai - COMPLAINT ON YOUTUBER HARSHA SAI

Another Complaint on Youtuber Harsha Sai : ప్రముఖ యూట్యూబర్​ హర్షసాయి బాధితురాలు మరో ఫిర్యాదు చేసింది. అత్యాచార బాధితురాలైన తనపై నీచంగా ట్రోలింగ్​ చేస్తున్నారంటూ వాపోయింది. కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

Another Complaint on Youtuber Harsha Sai
Another Complaint on Youtuber Harsha Sai (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2024, 10:11 AM IST

Youtuber Harsha Sai Victim Complaint Again : సామాజిక మాధ్యమాల్లో తనపై ట్రోలింగ్​ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ యూట్యూబర్​ హర్షసాయి బాధితురాలు సైబరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచార బాధితురాలైన తనపై హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్​ చేయిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్​ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు.

తనపై జరుగుతున్న ట్రోలింగ్​పై పలు స్క్రీన్​ షాట్లను పోలీసులకు సమర్పించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల అదే బాధితురాలు హర్షసాయి తనపై లైంగిక దాడికి పాల్పడి, బెదిరింపులకు దిగుతున్నాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుండగా, ట్రోలింగ్​ వ్యవహారంపై మరో ఫిర్యాదు రావడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.