Yousufguda realtor Brutal Murder Case : హైదరాబాద్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 11 గంటల తర్వాత యూసుఫ్‌గూడాలోని లక్ష్మీనరసింహనగర్‌లో 10 మంది దుండగులు స్థిరాస్తి వ్యాపారి మర్మంగాలు కోసి, కత్తులతో పొడిచి పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. మృతుడిని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వాసి పుట్ట రాము అలియాస్ సింగోటం రామన్న(35)గా గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
సినిమాను తలపించేలా హత్య - వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపించిన భార్య
పోలీసుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సింగోటం రాము హత్యకు ముందు రాముకు ఓ యువతి ఫోన్ నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మణికంఠ అనే వ్యక్తి యువతితో ఫోన్ చేయించి, యూసుఫ్గూడాకు రప్పించినట్లు తేలింది. మణి, రాముల మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, కొన్ని నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని పోలీసులు తెలిపారు. బషీరాబాద్‌లో పరస్పరం కేసులు పెట్టుకున్నారని దర్యాప్తులో తేలిందని చెప్పారు.
ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన భార్య - ఆపై కిడ్నాప్ డ్రామా
రామును హత్య చేసిన తర్వాత మణికంఠ రాము స్నేహితుడిని కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 'రాముని చంపాను, వచ్చి డెడ్ బాడీ తీసుకెళ్లు' అని చెప్పాడని, రామును హత్య చేసిన తర్యాత మణికంఠ బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నాడని చెప్పారు. ప్రస్తుతం మణికంఠ పరారీలో ఉండగా, రాముకి ఫోన్ చేసిన యువతిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు.
మరొకరితో సన్నిహతంగా ఉంటోందనే హత్య - వికారాబాద్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ