ETV Bharat / state

రతి మన్మథుడి అనుగ్రహం కోసం ఆ ఊరి యువకులు ఏం చేస్తారో తెలుసా? - Young Men Turn Into girls on Holi - YOUNG MEN TURN INTO GIRLS ON HOLI

Young Men Turn Into girls on Holi Festival : హోలీ అంటే కాముని దహనం, రంగులు చల్లుకోవడం ఇదే కదా! కానీ అక్కడ మాత్రం ప్రత్యేకం. ఓ వింతైన ఆచారం కొనసాగుతోంది. హోలీ వచ్చిందంటే చాలు జంబలకిడిపంబ సినిమాలోలాగా మగాళ్లు ఆడవాళ్లైపోతారు. తమ కోరికలు నెరవేరేందుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంతకీ అది ఎక్కడంటే?

Unique Tradition in Kurnool Dist
Young Men Turn Into girls on Holi Festival
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 10:01 AM IST

రతి మన్మథుడి అనుగ్రహం కోసం ఆ ఊరి యువకులు ఏం చేస్తారో తెలుసా?

Young Men Turn Into girls on Holi Festival : హోళీ అనగానే అందరికి గుర్తొచ్చేవి రంగులు, కాముని దహనం. ఇంకొంచం ముందుకెళ్తే తాము అభిమానించే వారితో హోలీ ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తారు. కానీ ఏపీలోని ఓ ప్రాంతంలో మాత్రం హోలీ పండుగ అనగానే కొత్త చీరలు, నగలు, అలంకరణ గుర్తొస్తాయి. అదేంటీ హోలీ రోజు కొత్త బట్టలేంటీ అని షాక్ అవుతున్నారా? ఆగండి అసలు ట్విస్టు ఇంకోటి ఉంది. ఆ చీరలు, నగలు, మేకప్ వేసుకునేది పడుచు అమ్మాయిలు కాదండి అబ్బాయిలు. అది కూడా మీసాలు పెంచి, కండలు తిరిగి, గడ్డాలు పెంచిన నిఖార్సైన యువకులు. ఇదేమి చోద్యం అని కంగారు పడకండి. హోలీ రోజును ఈ అలంకరణకు ఓ ప్రత్యేకత ఉంది. ఇంతకి ఈ విడ్డూరం ఎక్కడ అని అనుకుంటున్నారా! అయితే, కథలోకి ఎంటరైపోండి.

Scorpions Festival at Kurnool District: కర్నూలు జిల్లాలో వింత ఆచారం.. కొండరాయుడికి తేళ్లతో పూజలు

జంబలకిడిపంబ సినిమా తరహాలో వింత ఆచారం : కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే జంబలకిడిపంబ సినిమా తరహాలో వింత ఆచారం కొనసాగుతోంది. తరతరాల నుంచి ఓ సంప్రదాయం నడుస్తోంది. మగాళ్లు హోలీ రోజున చీరలు కట్టుకుని మహిళల్లా సింగారించుకుంటారు. భక్తి శ్రద్ధలతో రతి మన్మథుడికి పూజలు చేస్తారు. హోలీ రోజున సంతెకుడ్లుర్ గ్రామంలో మగాళ్లంతా చీరలు కట్టుకుని, నగలు, పూలు సింగారించుకొని అలంకరణ చేసుకుంటారు. హోలీ సందర్భంగా తమ గ్రామంలో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఇలా చేస్తారు. ఇక్కడికి కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా చాలా మంది వస్తారు. పురుషులు ఆడవాళ్ల మాదిరిగా వేషధారణ చేసుకుని పూజిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని వారి నమ్మకం.

'ప్రతి ఏటా మేము ఈ ఉత్సవం జరుపుకుంటాము. మా తాత ముత్తాతల నుంచి ఈ పండుగను జరుపుకోవడం ఆచారంగా వస్తుంది . ఇలా వేడుక నిర్వహించుకోవడం వల్ల మేము అనుకున్న పనులు జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్య, విద్యా పరమైన ఆటంకాలు ఇతర ఎలాంటి సమస్యలు వచ్చినా మేము మెుక్కుకుంటాం. ఇలా భక్తి శ్రద్దలతో పూజలు చేయడం వల్ల మా కోరికలు నెరవేరుతాయి. ఇది జంబలకడి పంబ తరహా లాంటి ఉత్సవం. ఈ పండుగ రెండు రోజులపాటు జరుగుతుంది.' -భక్తులు

Unique Tradition in Kurnool Dist : ఇలా పూజించడం వల్ల పంటలు బాగా పండుతాయని, గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అర్థిక సమస్యలు ఇలా ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయని అక్కడివారి నమ్మకం. ప్రతి సంవత్సరం హోలీ పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వింత ఆచారాన్ని చూడడానికి భారీ ఎత్తున తరలివస్తారు. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఈ వింతైన ఆచారం చూడడానికి కర్ణాటక నుంచి భక్తులు భారీ ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

'తలారి చెరువు'లో అగ్గిపాడు ఆచారం- ఆ రోజు ఊరంతా ఖాళీ 'అర్ధరాత్రి దాటాక !'

వంశదేవతలుగా గుండ్రటి రాళ్లకు పూజలు!- చివరకు డైనోసార్​ గుడ్లుగా గుర్తింపు- ఎక్కడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.