ETV Bharat / state

ట్రాన్స్​జెండర్​తో ప్రేమాయణం - ఫ్యామిలీని ఒప్పించి వివాహం - పెళ్లి తంతు మామూలుగా లేదుగా!

ట్రాన్స్​జెండర్​ను ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు - రెండేళ్లు ప్రేమించి కుటుంబసభ్యులను ఒప్పించి ఒక్కటైన జంట - జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్​ గ్రామంలో ఘటన

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Transgender Love Marriage in Jagtial
Transgender Love Marriage in Jagtial (ETV Bharat)

Transgender Love Marriage in Jagtial : వారిద్దరూ రెండేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుని, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కారు. ఇందులో ఆశ్చర్యం ఏం ఉందని అనుకుంటున్నారా? ఈ ప్రేమ కహానీ ఓ ట్రాన్స్​జెండర్, యువకుడిది కావడమే ఇక్కడ స్పెషల్. ఆఁ.. ఏముందిలే ఈ మధ్యకాలంలో ఇలాంటి పెళ్లిళ్లు సోషల్​ మీడియాలో చాలానే చూస్తున్నాం అని కొట్టిపడేయకండి! యువకుడు తన కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వారందరి సమక్షంలో ట్రాన్స్​జెండర్​ను వివాహం చేసుకున్నాడు. సాధారణంగా ట్రాన్స్​జెండర్​తో పెళ్లి అంటే ఏ కుటుంబ సభ్యులైనా ఒప్పుకోరు. కానీ ఈ అబ్బాయి కుటుంబసభ్యులు మాత్రం కుమారుడి ఇష్టాన్ని గౌరవించి, అతడి మనసుకు నచ్చిన వ్యక్తి(ట్రాన్స్​జెండర్​)ని ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. ఈ పెళ్లికి జగిత్యాల జిల్లా వేడుకైంది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్​ గ్రామానికి చెందిన శ్రీనివాస మల్యాల, అదే మండలానికి చెందిన మ్యాడంపల్లికి చెందిన ట్రాన్స్​జెండర్​ కరుణాంజలిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి వివాహం వరకు దారి తీసింది. అయితే ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిపోయిన శ్రీనివాస్​, అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులకు ప్రేమ వ్యవహారం చెప్పాడు.

ట్రాన్స్​జెండర్​ను చేసుకోవడం ఏంటని తొలుత కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, వారికి సర్ది చెప్పి కుటుంబ సభ్యులను ఒప్పించాడు. దీంతో వారిద్దరి పెళ్లికి అడ్డంకులన్నీ తొలగినట్లైంది. యువకుడి కుటుంబసభ్యులు, ట్రాన్స్​జెండర్ల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. సాధారణ వివాహం ఎలా జరుగుతుందో, వీరికీ అదే రీతిలో, అంతే ఘనంగా పెళ్లి జరిపించారు. అంతా సంతోషంగా వివాహ వేడుకను జరిపించారు. పెళ్లి సందర్భంగా ఊరేగింపులో ట్రాన్స్​జెండర్లు నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. దీంతో ప్రేమకు లింగభేదం కూడా అడ్డురాదని మరోసారి రుజువు చేశారు. ట్రాన్స్​జెండర్​ను పెళ్లి చేసుకొని ఆమెకు కొత్త జీవితం ఇచ్చిన యువకుడిని స్థానికులు అభినందించారు.

పేద జంటలకు పెళ్లిళ్లు చేయించిన ట్రాన్స్​జెండర్​- భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ముతో సాయం

Man gets Married to Transgender : ట్రాన్స్​జెండర్​ను పెళ్లి చేసుకున్న యువకుడు.. ఎక్కడంటే!

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.