Young Man Instagram Murder in Hyderabad : రోజురోజుకు సోషల్ మీడియా వాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఎలాంటివి పోస్టు చేసిన అది యువతకు ఎక్కువగా చేరుతుంది. అందుకే దాని ఎఫెక్టు వారిపై బలంగా పడుతుంది. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్(Instagram) వంటి యాప్‌లు యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. మర్డర్ చేస్తే దొరకకుండా ఎలా ఉంటామో అందులో సెర్చ్ చేసి మరి హత్యలు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఒక యథార్ధ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నగరంలోని బాలపూర్ షహీన్‌నగర్ బిస్మిల్లా కాలనీలో నివాసముండే మహమ్మద్ ఫాహీం ఈనెల 5వ తేదీన రాజేంద్రనగర్ జోన్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య(Murder)కు గురయ్యాడు. గతంలో ఫాహీం అతని మిత్రుడు మహమ్మద్ యాసిన్‌తో గొడవ పడ్డాడు. అది కాస్త చిలికిచిలికి గాలివానలా తయారై ఒకరిని ఒకరు చంపుకుంటామనే సవాళ్లు విసురుకునే స్థాయికి చేరింది. అదే క్రమంలో యాసిన్ ఫాహీంను ఎలాగైనా చంపాలని మహహ్మద్ యాసిన్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందుకు తగ్గట్లుగా ప్రణాళిక రచించాడు.
Man Brutal Murder in Hyderabad : తనతో పాటు మరో నలుగురు సాయం మహమ్మద్ యాసిన్ తీసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో నేహా ఖాన్ అనే ఒక ఫేక్ ఐడీ(Fake Id) క్రియేట్ చేసి ఫాహీంతో చాటింగ్ మొదలుపెట్టాడు. ఇందుకు ఏ2 నిందితులు ఓబైదీ ఖురేషీ, మహమ్మద్ ఫాహీంల సహాయం తీసుకున్నాడు. చాటింగ్ చేసే క్రమంలో మార్చి 5వ తేదీ సాయంత్రం నేహాఖాన్ పేరిట ఉన్న ఫేక్ అకౌంట్ నుంచి చింతల్‌మెట్ ఇమాం పహాడ్ వద్దకు రావాలని మెసేజ్ చేశారు. దాంతో ఫాహీం అమ్మాయే సందేశం పంపిందనుకొని అక్కడికి వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటేసి ఉన్న యాసిన్, ఖురేషి, అబ్దుల్‌మినాజ్, మహమ్మద్ ఖయ్యూం, మహమ్మద్ ఫాహీంలు అతనిని చుట్టుముట్టి తమ వెంట తెచ్చుకున్న కత్తిలో అతికిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
గర్భిణీ దారుణ హత్య- 20ముక్కలు చేసి రోడ్డు పక్కన వేసిన దుండగులు!
మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుల నుంచి కత్తితో పాటు ఐదు సెల్‌ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గంటల వ్యవధిలోనే కేసును చేధించిన పోలీసులను సీపీ సహా ఉన్నతాధికారులు అభినందించారు.
యువత అప్రమత్తంగా ఉండాలి : వ్యక్తిని చంపేందుకు సామాజిక మాధ్యమాల్లో ఉన్న అవకాశాలు వెతుకుతూ నిందితులు చేసే ప్రయత్నాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఫేక్ అకౌంట్ల పట్ల అప్రమత్తత అవసరమని తెలిపారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వ్యక్తిని హనీట్రాప్ చేయడం కొత్తేమీ కానప్పటికీ, హత్య చేసేందుకు మిత్రులే ఇలా చేయడం ఆందోళనకరమైన విషయం అని అన్నారు.
ప్రేమ పేరుతో యువతి కుటుంబంపై దాడి - ప్రతిఘటనలో ప్రేమోన్మాది మృతి
ఫొటో షూట్ అని పిలిచి, కెమెరా కోసం చంపేశారు - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన