Boxing Man at Vizianagaram : ఆరో తరగతిలోనే బాక్సింగ్‌పై ఆసక్తితో సాధన చేశాడా యువకుడు. మొన్నటి వరకు తన పంచ్‌లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించి ఉత్తమ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. దీంతో తన జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చాడు. ప్రస్తుతం శిక్షకుడిగా మారి వందల మందిని తీర్చిదిద్దితున్నాడు. అతడే విజయనగరానికి చెందిన ఈశ్వర్‌రావు. అసలు బాక్సింగ్‌లో తన ప్రయాణం ఎలా మొదలైంది. శాప్ బాక్సింగ్ కోచ్‌గా ఎలా మారాడో ఈ కథనంలో తెలుసుకుందామా?
1997 నాటికి ఉత్తమ బాక్సర్ స్థానం : విజయనగరానికి చెందిన సోములు పురపాలకలో చిరుద్యోగి. తన కుమారుడు ఈశ్వర్‌రావుకు బాక్సింగ్ ఆట ఇష్టమని గ్రహించి చిన్నతనం నుంచే ప్రోత్సహించారు. 1992లో బాక్సింగ్‌లో ఓనమాలు మొదలుపెట్టిన ఈశ్వరరావు 1997 నాటికి ఉత్తమ బాక్సర్‌గా నిలిచారు. రాష్ట్రస్థాయిలో 30కిపైగా టోర్నీలు, రెండు జాతీయ, రెండు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలో శాప్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు 200మందిని బాక్సర్లుగా తీర్చిదిద్దారు. శిక్షణ పొందిన వారిలో సుమారు 100మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయటమే ధ్యేయమని ఈశ్వరరావు చెబుతున్నారు.
"2017లో శాప్ బాక్సింగ్ కోచ్‌గా ప్రవేశించాను. అంతకుముందు 2002 నుంచి 2017 వరకు ఉచితంగా ఎంతో మంది బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చాను. 2017లో అప్లికేషన్ పెట్టుకుంటే విజయనగరం బాక్సింగ్ కోచ్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం మా బ్యాచ్‌లో ఒక అబ్బాయి యూత్ నేషనల్లో మెడల్ సంపాదించాడు. మరో అబ్బాయి అండల్-19లో మెడల్ సాధించాడు. అలాగే యూత్ ఏసియన్ గేమ్స్‌కు వెళ్లాడు. అదేవిధంగా అండర్-14, వివిధ గేమ్స్‌లో చాలా మంది పాల్గొన్నారు. ప్రస్తుతం అండర్-14, 17,19 టీమ్‌లను తయారు చేస్తున్నా. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మా విద్యార్థులు పాల్కొంటున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న వారంతా జాతీయ స్థాయిలో మెడల్ సంపాదించే స్థాయిలో ఉన్నారు. ఇక అంతర్జాతీయంగా విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం." - ఈశ్వరరావు, శాప్ కోచ్ (విజయనగరం)
దేశానికి పతకాలు సాధించడమే లక్ష్యం : శాప్ కోచ్‌గానే కాకుండా విజయనగరం వేదికగా సొంతంగా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. పేద పిల్లలను గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారిని ప్రోత్సహిస్తున్నారు. తనలాగే మరికొందరిని బాక్సర్లుగా తీర్చిదిద్ది దేశానికి పతకాలు సాధించడమే లక్ష్యమని తెలిపారు.
చదువుతో పాటే ఉద్యోగాల వేట - ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటేలా శిక్షణ - Campus Recruitment Training