ETV Bharat / state

20 సినిమాల్లో 50 పాటలు - ఈ యువ రచయిత సక్సెస్​ స్టోరీ తెర వెనక కష్టాలు తెలుసుకోవాల్సిందే - Virinchi Putla Writes Songs

Young Lyricist Virinchi Putla Success Story : పేదరికం పొత్తిళ్లలో పురుడు పోసుకున్నాడు ఆ యువకుడు. చిన్నతనంలోనే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. కానీ అధైర్యపడలేదు. కన్నీటి సంద్రం నుంచి ఉప్పొంగే కెరటంలా ముందుకు సాగాడు. అన్నీ తానై పెంచిన అమ్మకు ఆసరాగా నిలవాలనుకున్నాడు. ఇష్టమైన సినీ రంగంలోనే స్థిరపడాలని ముందుకు సాగాడు. కష్టాల కడలి ఈదుకుంటూ కవిత్వంలోని కిటుకులు నేర్చుకుని, సినిమా పాటలు రాస్తున్నాడు. మరి ఆ యువ రచయిత ఎవరో మనమూ చూద్దామా.

Virinchi Putla  Success Story
Young Lyricist Virinchi Putla Success Story
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 1:54 PM IST

Updated : Jan 29, 2024, 4:50 PM IST

20 సినిమాల్లో 50 పాటలు - ఈ యువ రచయిత సక్సెస్​ స్టోరీ తెర వెనక కష్టాలు తెలుసుకోవాల్సిందే

Young Lyricist Virinchi Putla Success Story : సినీ పరిశ్రమలో అవకాశాలు రావడం అంత తేలిక కాదు. టాలెంట్‌ ఉన్నా, అవకాశం రావడానికి ఎన్నో తలుపులు తట్టాల్సి ఉంటుంది. వచ్చినా ఆ రంగంలోని ఒత్తిళ్లను ఎదుర్కొని ముందుకు సాగడం గగనమే. కారణం ఈ రంగంలో నెలకొన్న పోటీనే. అయినా తనకు ఇష్టమైన సినీ రంగంలోనే స్థిరపడాలనుకున్నాడు ఈ యువ రచయిత. సంగీతం వినిపిస్తున్న యువకుడి పేరు పుట్ట విరించి. కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌కు చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించాడు. సినీ నేపథ్యం, సినిమా వాళ్లతో పరిచయాలంటూ ఏమీ లేవు. కానీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలనే తపనతో వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నాడు.

Virinchi Putla Writes Songs : బాల్యం నుంచే ఈ యువకుడికి పాటలంటే మహా ఆసక్తి. వివిధ కార్యక్రమాల్లో బహుమతులు కూడా అందుకున్నాడు. 2013లో డిగ్రీ తర్వాత పట్నానికి ప్రయాణమయ్యాడు. ఒక్క ఛాన్స్ అంటూ సంగీత దర్శకుల చుట్టూ తిరిగాడు. కానీ ఎవరి దగ్గర సంగీతం నేర్చుకున్నావు? ఏ షోలో పాల్గొన్నావు? అనే ప్రశ్నలే ఎదురయ్యాయి తప్ప అవకాశాలు మాత్రం రాలేదు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విరించిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి.

సంప్రదాయ పద్ధతిలో బేకరీ పదార్థాల తయారీ - ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరట!

Virinchi Putla Success Story : దాంతో పేపర్‌ బాయ్‌గా పని చేశాడు. ఉదయం స్టూడియోల చూట్టూ తిరుగుతూనే, రాత్రిళ్లు సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. క్యాటరింగ్‌, డెలివరీ బాయ్‌గానూ చేశాడు. చివరికి 2019లో ఒక ఛానెల్​లో వ్యాఖ్యాతగా చేరాడు. కానీ ఎక్కడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రయత్నాలు కొనసాగించాడు. క్షణమొక యుగం అనే షార్ట్ ఫిల్మ్‌లో ఒక పాట రాశాడు. బాగా పేరొచ్చినా, అవకాశాలు రాలేదు. తర్వాత సుమనోహరం అనే ఆల్బమ్‌లో రాసిన ఓ పాటతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. గాలోడు, హిడింబ వంటి సినిమాలకు అవకాశం వచ్చింది. పాటలు రాస్తూనే, మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు సాహిత్యం చదువుతున్నాడు ఈ యువ రచయిత.

Young Lyricist Virinchi Putla Success Story : ఎస్పీ బాలు గారి నుంచి స్ఫూర్తి పొందిన ఈ యువకుడు మొదట్లో సింగర్‌ కావాలనుకున్నాడు. ప్రపంచ తెలుగు మహాసభలతో పాటు విదేశాలలో ప్రదర్శనలు చేశాడు. కానీ, గాయకుడిగా అవకాశాలు రాకపోవడంతో పంథా మార్చుకుని రచయితగా అవతారమెత్తాడు. దాదాపు 20 సినిమాల్లో 50 వరకు పాటలు రాశాడు. దాంతో పాటు 20 వాణిజ్య ప్రకటనలు రాసి, పలువురి దర్శకులతో ప్రశంసలందుకున్నాడు.

విరించికి వస్తున్న సినిమా అవకాశాలపై అతని తల్లి హర్షం వ్యక్తం చేస్తోంది. చిన్నప్పటి నుంచి తన కుమారుడు ఎంతో కష్టపడ్డాడని చెబుతోంది. మొదట్లో తన కుమారుడి పట్ల బంధువులు అసహనంగా ఉండేవారని, ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారని అంటోంది. గుండె నిండా ధైర్యం, సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే సాధ్యం కానిందంటూ లేదంటున్నాడు ఈ యువకుడు. మొదట్లో సింగర్‌ని కావాలనుకున్న ఈ యువతేజం, ప్రస్తుతం సినిమా పాటలు రాస్తున్నాడు. ఎప్పటికైనా సంగీత దర్శకుడు కావాలన్నదే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

విమానం నడపడం సాహసమే అయినా సాధన చేస్తే సాధ్యమే అంటున్న యువత

నిరుద్యోగ భృతికి ఆసక్తి చూపని యువత- వారం రోజుల్లో 20వేల దరఖాస్తులే- కారణమేంటి?

Last Updated : Jan 29, 2024, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.