Young Boy died while Swimming in Pond : వేసవి సెలవుల వేళ సరదాగా ఈత కోసం వెళ్లిన ఇద్దరు యువకుల్లో, ఒకరు మృతి చెందిన సంఘటన ఫిలింనగర్(Filmnagar) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెల్తే నిన్న సాయంత్రం పవన్‌రాజ్ అనే యువకుడు, తన స్నేహితుడితో కలిసి ఫిల్మ్‌నగర్ పరిధిలోని హకీందర్గా వద్ద ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లారు. ఇద్దరు యువకులు ఈత కొట్టడానికి చెరువులో దూకారు. ఈ క్రమంలో పవన్‌రాజ్ కనిపించకుండా పోయాడు.
మరొక యువకుడు చెరువు నుంచి బయటపడి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందానికి సమాచారమిచ్చారు. సమాచారం తెలుసుకున్న వెంటనే చెరువు వద్దకు చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పవన్‌కోసం గాలించాయి. నిన్న సాయంత్రం నుంచి పవన్ రాజ్ కోసం వెతుకుతుండగా, ఇవాళ శవమై దొరికాడు. యువకుడి మృతితో కుటుంబం విషాదంలో మునిగి పోయింది. తమ కుమారుడిని ఎవరూ కాపాడలేకపోయారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పండుగపూట విషాదం - విహారానికి వెళ్లి ఎస్సారెస్పీలో ముగ్గురు యువకులు గల్లంతు