ETV Bharat / state

అగమ్యగోచరంగా పిన్నెల్లి రాజకీయ జీవితం - ఏడేళ్లకు తగ్గకుండా శిక్షపడేనా? - Pinnelli Political Career - PINNELLI POLITICAL CAREER

YCP MLA Pinnelli Political Career: పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను బద్దలుకొట్టి విధ్వంసం సృష్టించిన పిన్నెల్లిపై పది కేసులు నమోదు కావడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. పిన్నెల్లిపై నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఆరేళ్లపాటు అనర్హులు కావడానికి ఏదైనా కేసులో రెండేళ్లకు తగ్గకుండా శిక్షపడితే చాలని చట్ట నిబంధనలు చెబుతున్నాయి.

YCP MLA Pinnelli Political Career
YCP MLA Pinnelli Political Career (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 8:58 AM IST

Updated : May 23, 2024, 9:29 AM IST

YCP MLA Pinnelli Political Career: పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను బద్దలుకొట్టి విధ్వంసం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. ఈవీఎంను ధ్వంసం చేస్తున్న సాక్ష్యాధారాలు లభించడంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. పక్కా ఆధారాలు లభించడంతో పోలీసులు మొదటి నిందితుడిగా వివిధ సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపారు. మూడు చట్టాల కింద పది తీవ్ర సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు రెంటచింతల పోలీసులు మెమో రూపంలో స్థానిక కోర్టుకు సమర్పించారు.

పిన్నెల్లిపై నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. రెండేళ్ల జైలుశిక్ష పడేలా పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేశారు. ఎన్నికల్లో ఆరేళ్లపాటు అనర్హులు కావడానికి ఏదైనా కేసులో రెండేళ్లకు తగ్గకుండా శిక్షపడితే చాలని చట్ట నిబంధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్టారెడ్డి రాజకీయ భవిష్యత్తు సమాధికావడం ఖాయం అని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పరారీలో పిన్నెల్లి - ఏపీ, తెలంగాణ పోలీసుల గాలింపు చర్యలు - Pinnelli EVM Destroy Issue

పిన్నెల్లిపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు వాటికి పడే శిక్షలివే:

1) సెక్షన్‌ 143 - చట్టవిరుద్ధంగా గుమిగూడటం (అన్‌లాఫుల్‌ అసెంబ్లీ). ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా జైలు, జరిమానా

2) సెక్షన్‌ 147- అల్లర్లకు పాల్పడినందుకు. రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా జైలు, జరిమానా

3) సెక్షన్‌ 448 - ఇల్లు/కార్యాలయంలోకి అక్రమ చొరబాటు. ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా జైలు, జరిమానా

4) సెక్షన్‌ 427 - విలువైన వస్తువును ధ్వంసం చేయడం. రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా జైలు, జరిమానా

5) సెక్షన్‌ 353 - ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకోవడం, భయపెట్టడం, దాడి, దౌర్జన్యానికి పాల్పడటం. రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా జైలు, జరిమానా

6) సెక్షన్‌ 452 - విధులకు అవరోధం కలిగించాలని, గాయపరచాలనే ఉద్దేశంతో దౌర్జన్యంగా ఇల్లు/ కార్యాలయంలోకి అక్రమ చొరబాటు. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా

7) సెక్షన్‌ 120బి - నేరపూర్వక కుట్రకు పాల్పడటం. ప్రధాన నిందితుడికి పడిన శిక్షతో సమానంగా నేర ఘటనలో భాగస్వాములైన వారికి అదే శిక్ష పడుతుంది.

ప్రజాప్రాతినిధ్య చట్టం

1) సెక్షన్‌ 131 - పోలింగ్‌ బూత్‌ల వద్ద, లోపల చట్టవిరుద్ధంగా వ్యవహరించడం. మూడు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా

2) సెక్షన్‌ 135 - బ్యాలట్‌ పేపర్లు/ఈవీఎంలను పోలింగ్‌ బూత్‌ల నుంచి తొలగించడం, ధ్వంసం చేయడం. ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా

పీడీపీపీ చట్టం-1984 (ప్రజాఆస్తులను ధ్వంసం నుంచి కాపాడే చట్టం)

1) సెక్షన్‌ 3 - ప్రజాఆస్తులను ధ్వంసం చేయడం. అయిదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా.

పారిపోవాలనుకున్న పిన్నెల్లి - పట్టుకున్న పోలీసులు ! - Pinnelli in Police Custody

Last Updated : May 23, 2024, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.