YCP MLA Grabbed Dalit Lands in Anamarlapudi: గుంటూరు జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి దళితుల భూములను బినామీలతో కాజేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. పెదకాకాని మండలం అనమర్లపూడి గ్రామంలో సర్వే నంబరు 56లో 22.38 ఎకరాల భూమి ఉంది. బ్రిటీష్ హయాంలోనే 55 మంది దళితులకు ఈ భూమిని కేటాయించారు. అనంతరం 1977లో అనుమర్లపూడికే చెందిన 9 మంది పేరుతో ప్రభుత్వం డీకేటీ పట్టాలు మంజూరుచేసింది. వీరిలో ఏడుగురు ఎస్సీ, ఒకరు బీసీ, ఒక ఓసీ రైతు ఉన్నారు. బ్రిటిష్ హయాంలో పట్టాలు పొందిన 55 మంది వారసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో డీకేటీ పట్టాలు పొందిన 9మంది రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా 55 మంది కోర్టులో అప్పీల్ చేసి కేసులు కొనసాగిస్తూ వచ్చారు.
'చచ్చినా వదిలే ప్రసక్తే లేదు' - స్థలం కోసం మహిళకు వైసీపీ సర్పంచ్ బెదిరింపులు
2022 జులైలో స్థానిక వైసీపీ నేత ఒకరు ఆ 55 మందితో మాట్లాడారు. రాజీకీ వస్తే అందరికీ డబ్బులు వస్తాయని నమ్మబలకటంతో వారు కేసు ఉపసంహరించుకున్నారు. అనంతరం 9 మంది డికేటీ పట్టాదారులతో ప్రజాప్రతినిధి తన బినామీ పేర్లతో ప్రైవేటు ఒప్పందాలు చేసుకున్నారు. అయితే అప్పటికే ఆభూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. నిషేదిత జాబితా నుంచి తొలగించాలని అధికారులపై ప్రజాప్రతినిధి ఒత్తిడి తెచ్చారు. ఈవిషయం వెలుగులోకి రావడంతో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర, దళిత రైతులతో కలిసి ఆందోళనలు చేశారు. అధికారులు అప్పటికి తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉండి ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా నిషేధిత జాబితా నుంచి తొలగించారు. వెంటనే ప్రజాప్రతినిధి తన బినామీల పేరుతో 17.55 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
దోచుకోవడంలో వాళ్లని మించినోళ్లు లేరు! - అన్నదమ్ముల దెబ్బకు కొండలైనా కదలాల్సిందే
పట్టాదారులు 9 మందిలో ఇద్దరు భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి అంగీకరించకపోవడంతో వారి భూమి 4.83 ఎకరాలు మినహాయించారు. పెదకాకాని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తే విషయం బయటికి వస్తుందని దుగ్గిరాలలో రిజిస్ట్రేషన్ చేయించారు. నిషేధిత జాబితా నుంచి తొలగించడం నుంచి రిజిస్ట్రేషన్ వరకు ప్రజాప్రతినిధి చక్రం తిప్పారు. ఇప్పుడు 8మంది పేర్లతో 15కోట్ల రూపాయల విలువైన భూమి రిజిస్ట్రేషన్ పూర్తయింది. వీరిలో పెదకాకాని శివాలయం ఛైర్మన్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో పాటు పొన్నూరు మండలం మునిపల్లెకు చెందిన ఇద్దరు ఉన్నారు. డీకేటీ పట్టాదారులకు లక్షల్లో చెల్లించి 15కోట్ల విలువైన భూములు చేజిక్కించుకున్నారు. విషయం తెలియటంతో దళిత రైతులు దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
57 నెలల పాలనలో 14 లక్షల ఎకరాల భూములను జగన్ కబ్జా చేసారు: సోమిరెడ్డి
అనుమర్లపూడిలో భూములను ప్రజాప్రతినిధికి కట్టబెట్టేందుకు అదే గ్రామానికి చెందిన నాయకులు, మండల ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరించారు. ప్రజాప్రతినిధి చెప్పినట్లు వింటే న్యాయం జరుగుతుందని లేకుంటే నష్టపోతారని బెదిరించి పట్టాదారుల నుంచి భూములు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పెదకాకాని తహసీల్దార్‌ను వివరణ కోరగా ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు 20 ఏళ్లుగా 22ఎలో ఉంటే వాటిని తొలగించాలని ఇటీవల ప్రభుత్వం జీవో 596 ఇచ్చిందన్నారు. దీని ఆధారంగా జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపామని జిల్లా స్థాయి అసైన్‌మెంట్ కమిటీ ఈ భూములను 22ఎ నుంచి తొలగించినట్లు చెప్పారు.