ETV Bharat / state

యాదాద్రిలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం - తిరుపతి తరహాలోనే భక్తుల డ్రెస్ కోడ్ - Yadadri Jayanthi Utsavalu 2024

Yadadri Jayanthi Utsavalu : ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. యాదాద్రి అనుబంధ ఆలయాల్లో కూడా జయంత్యుత్సవాలు జరగనున్నట్లు ఆలయ ఆవో భాస్కర్‌రావు వెల్లడించారు. మరోవైపు యాదాద్రిలో ప్లాస్టిక్ వినియోగం నిషేధిస్తూ ఈవో ఉత్తర్వులు జారీచేశారు.

Yadadri Sri Lakshmi Narasimha Swamy Jayanthi Utsavalu
Yadadri Jayanthi Utsavalu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 18, 2024, 4:57 PM IST

Updated : May 18, 2024, 7:27 PM IST

Yadadri Sri Lakshmi Narasimha Swamy Jayanthi Utsavalu : యాదగిరీశుడి దివ్యక్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు. యాదగిరిగుట్టతో పాటు అనుబంధ ఆలయాలు పాతగుట్ట, దబ్బకుంటపల్లిలో జయంతి వేడుకలు జరుగుతాయని వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న ఉదయం తొలుత స్వస్తివాచనం, పుణ్యాహవచనం, లక్షకుంకుమార్చన పూజలతోపాటు తిరువెంకటపతి అలంకార సేవోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.

సాయంత్రం మృత్స్యుంగ్రహణం, అంకురార్పణ, హవనం, గరుడ వాహనం, పరవాసుదేవ అలంకార సేవలు నిర్వహించనున్నారు. 21న ఉదయం నిత్యమూలమంత్ర హవనం, లక్షపుష్పార్చన, కాళీయమర్ధన అలంకార సేవోత్సవం ఉంటుందన్నారు. సాయంత్రం నరసింహ మూల మంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి, గర్భాలయంలోని మూలవరులకు సహస్ర కలశాభిషేకం, రాత్రి నరసింహ జయంతి, ఆవిర్భావం, మహానివేదన అనంతరం ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని తెలిపారు.

పాతగుట్ట ఆలయంలో యథావిధిగా కొనసాగుతాయని ఆలయ ఈవో తెలిపారు. దబ్బకుంటపల్లిలోని నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 22న ఉదయం స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, అభిషేకం, ఉదయం 11 గంటలకు స్వామివారి కల్యాణం, మహానివేదన, తీర్థప్రసాద గోష్టి ఆశీర్వచనం ఉంటుందన్నారు.

Yadadri Temple Bans Plastic : మరోవైపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తు కార్యనిర్వాహణాధికారి ఎ. భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానంలోని పలు విభాగాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్తువులు మాత్రమే వాడాలని సూచించారు. ఈ నిషేధాన్ని సిబ్బంది విధిగా పాటించాలని ఆదేశించారు. దాని అనుగుణంగా ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ వంటి స్థానంలో ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్తువులను మాత్రమే వాడాలని ఆదేశాలు జారీ చేశారు.

Devotees Dress Code in yadadri Temple : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నిత్య కల్యాణం, హోమం, జోడు సేవలు వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఆలయంలో జూన్ 1 నుంచి నియమాలు కచ్చితంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానము తరహాలోనే యాదాద్రిలో భక్తులు వీఐపీ బ్రేక్ దర్శనానికి కూడా డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాల్సి వస్తుందని ఆలయ ఈవో చెప్పారు. స్వామి వారి బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులకు తప్పనిసరిగా ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా సాధారణ ధర్మ దర్శనం క్యూలైన్​లో వచ్చే భక్తులకు ఈ నియమం వర్తించదని పేర్కొన్నారు. సదరు విషయంపై భక్తులందరూ సహకరించాల్సిందిగా ఆయన కోరారు.

'ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ఆలయ సిబ్బంది చర్యలు తీసుకుంటోంది. వర్షం వచ్చినా ఎండలు ఉన్నా భక్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేస్తాం. లక్షలాది మంది భక్తలు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతున్నా. సంప్రదాయ దుస్తులతో మాత్రమే సేవ కార్యక్రమంలో పాల్గొనాలి'-భాస్కర్ రావు, ఆలయ ఈవో

ఈ నెల 20 నుంచి 22 వరకు యాదగిరీశుడి జయంత్యుత్సవాలు (ETV Bharat)

భక్త జనసంద్రమైన యాదాద్రి దేవాలయం - ఉచిత దర్శనానికి 3 గంటల సమయం - Devotees Rush in Yadadri Temple

Last Updated : May 18, 2024, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.