ETV Bharat / state

ఎంపీడీవో తీరుతో విసుగెత్తిన యువతి - కార్యాలయం ఎదుట ఆందోళన

Women Protest At MPDOs Office In Prakasam District For Job Joining: కనిగిరి ఎంపీడీవో కార్యాలయం ఎదుట యువతి నిరసనకు దిగింది. సమస్య పరిష్కరించమనో, సాయం చెయ్యమనో కాదట తన ఆందోళన. కానీ కుటుంబంతో సహా ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించింది. ఇంతకు సమస్య ఏంటంటే

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 7:51 PM IST

women_protest_-at_mpdos_office_in_prakasam_district_for_job

Woman Protest Against Kanigiri MPDO Behaviour : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం యడవల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి జిల్లా కలెక్టర్ జారీ చేసిన జాయినింగ్ ఉత్తర్వులను చూపుతూ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీడీవో (MPDO) కార్యాలయం ఎదుట బైఠాయించింది. కలెక్టర్ (Collector) ఉత్తర్వులు ప్రకారం తనను విధుల్లోకి తీసుకోవాలి అంటూ అధికారులను ఆశ్రయించింది. ఎంపీడీవో మహేష్ బాబు తనను విధుల్లోకి తీసుకోకుండా గత వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పుకొంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని యువతి ఆరోపించారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పేట్రేగిపోతున్న అవినీతి రాజా- ప్రజాప్రతినిధి మామ కనుసన్నల్లోనే దందాలు

Women Protest At MPDOs : విధుల్లోకి తీసుకునే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ మొరాయించి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎదురుగా యువతి సంధ్య బైఠాయించి నిరసన (Protest) తెలిపింది. మహిళ అనే కనికరం కూడా లేకుండా ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కార్యాలయం వద్దనే వుంచి రేపు రమ్మంటూ వెనక్కి పంపిస్తున్నారని యువతి ఆవేదన వ్యక్తం చేశారు.

తన తరువాతే ఎవరైనా- బార్బర్ షాప్​లోవాలంటీర్ దౌర్జన్యం! సగం గడ్డంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

'ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలలో ఉత్తీర్ణత సాధించిన యువతి సంధ్య జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో విధుల్లో చేరేందుకు వెళ్లింది. అక్కడ ఉన్న ఎంపీడీవో మహేష్ బాబు స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు యువతి సంధ్యను విధుల్లోకి తీసుకోకుండా గత వారం రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మహిళ అనే కనికరం కూడా చూపకుండా వైఎస్సార్సీపీ నాయకులు ఎలా చెబితే అలా తలాడిస్తున్నాడు. కలెక్టర్ జారీ చేసిన ఉత్తరాన్ని కూడా తుంగలో తొక్కి వైఎస్సార్సీపీ కార్యకర్తగా వ్యవహరించడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు.' -శ్రీను గ్రామస్థుడు, యడవల్లి

వైసీపీ నేతల విధ్వంసం - దళితులపై దాడి చేసి, గుడిసెలకు నిప్పుపెట్టిన ఎమ్మెల్యే అనుచరులు

Women Job Joining Issue in Prakasam District : యడవల్లి గ్రామానికి చెందిన పలువురు యువతీకి మద్దతు తెలిపి ఎంపీడీవోను ప్రశ్నించగా ఏ సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తల నేలకు వాల్చాడు. ఈ తతంగాన్ని గ్రహించిన వైఎస్సార్సీపీ (YSRCP) నాయకులు కార్యాలయం వద్దకు చేరుకోగా వారితో కలిసి ఎంపీడీవో కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.