ETV Bharat / state

అప్పు తీర్చమన్నందుకు మహిళ తలపై కొట్టి హతమార్చాడు - నిజామాబాద్​లో దారుణం - Woman Murdered In nizamabad Dist - WOMAN MURDERED IN NIZAMABAD DIST

Woman Murdered In Nizamabad Dist : తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లించాలని కోరినందుకు సదరు మహిళను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లాలో జరిగింది. నవీపేట్ మండలంలో అలీసాగర్ కాల్వలో మృతదేహం లభ్యమైన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు.

Woman Murdered In Nizamabad Dist
Woman Murdered In Nizamabad Dist
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 3:09 PM IST

Woman Murdered In Nizamabad Dist : నేటి సమాజంలో సాంకేతికతో పాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసేవారు. కానీ ఈ రోజుల్లో ఆస్తిపాస్తులు, డబ్బుకు విలువ ఇస్తున్నారు. ఇందుకోసం ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు. ఎంతలా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, బంధువులనైనా కడతేర్చడానికైనా వెనకాడటం లేదు. తాజాగా ఓ మహిళ తెలిసిన వ్యక్తికి కొంత నగదు అప్పుగా ఇచ్చింది. కానీ అదే ఆమెకు ముప్పును తెస్తుందని పసిగట్టలేదు. ఇచ్చిన అప్పు(Debt) డబ్బులు తీర్చమన్నందుకు ఆ మహిళను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Police Investigation On Murder Case : నవీపేట్ మండలంలోని అలీసాగర్ కాల్వలో మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు(Police) చేధించారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితం రెంజల్ మండలం బొర్గంకు చెందిన చంద్రకళ (46) అనే మహిళ మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ(Enquiry)) చేపట్టగా కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బొర్గంకు చెందిన గంగాధర్​ అనే వ్యక్తికి చంద్రకళ ఏడాది క్రితం రూ.50,000లు అప్పుగా ఇచ్చింది. అప్పు చెల్లించాలని గంగాధర్​ను చంద్రకళ పలుమార్లు కోరగా స్పందించలేదు.

అప్పు చెల్లిస్తానని చెప్పి ఇంటికి పిలిపించి : ఈ క్రమంలో అప్పు చెల్లిస్తానని తమ ఇంటికి రావాలని చెప్పగా చంద్రకళ బుధవారం మధ్యాహ్నం వారింటికి వెళ్లినట్లు సమాచారం. ఇంటికి వచ్చిన ఆమెపై ముందుగా అనుకున్న పథకం(plan) ప్రకారం అప్పు తీసుకున్న వ్యక్తి పదునైన ఓ మారణాయుధంతో ఆమె తలపై కొట్టడంతో ఘటనాస్థలిలోనే(Incident Place) చనిపోయింది.

పగలు కావడంతో మృతదేహాన్ని(Dead Body) తరలించకుండా అర్ధరాత్రి వరకు ఇంట్లోనే దాచి పెట్టారు. అనంతరం అదే రోజు రాత్రి వాహనంలో మృతదేహాన్ని తీసుకెళ్లి నవీపేట మండలం కోస్లీ శివారులోని అలీసాగర్ కాల్వలో పడేసి పారిపోయారు. ఇందులో మరి కొంత మంది ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అనుమానితులను పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. చంద్రకళ మృతిపై విచారణ కొనసాగుతున్నట్లు నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీశ్ కుమార్ తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలో మహిళా డీలర్ దారుణహత్య

భర్తను కొట్టి.. భార్యకు ఉరేసి.. దారుణ హత్య.. దోపిడీ దొంగల పనేనా?

'మా ఫ్రెండ్​ చావుకు ప్రతీకారం తీర్చుకున్నాం' - యువకుడిని హత్య చేసి ఇన్​స్టాలో సెల్ఫీ వీడియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.