ETV Bharat / state

ఆనందంగా కుమార్తెను స్కూల్​కు పంపింది - అంతలోనే ఆ తల్లికి - Woman Died in Road Accident

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 12 hours ago

Woman Died in Road Accident in Hyderabad : హైదరాబాద్​ నాచారం పోలీసుస్టేషన్​ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కుమార్తెను స్కూల్​లో విడిచి పెట్టి ఇంటికి వెళ్తున్నా ఆ తల్లిని మృత్యువు కబలించింది. ఈ విషయం తెలియని ఆమె కుమార్తె సాయంత్రం ఆనందంగా ఇంటికి వచ్చింది. ఇక తన తల్లి లేదన్నా విషయం తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యింది. ఈ విషయం స్థానికుల సైతం కంటతడి పెట్టించింది.

WOMAN DIED IN ROAD ACCIDENT
WOMAN DIED IN ROAD ACCIDENT (ETV Bharat)

Woman Died in Road Accident in Hyderabad : కుమార్తెను బైక్​పై తీసుకొచ్చి స్కూల్​లో వదిలిపెట్టింది. బిడ్డను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది. అనంతరం బై చెప్పి తిరిగి ఇంటికి బయల్దేరింది. కానీ విధి వెక్కిరించింది. ఆ తల్లిని లారీ మృత్యువు రూపంలో కబలించింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్​లోని నాచారం పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది.

అసలు ఏం జరిగిందంటే : బాగ్‌అంబర్‌పేట శ్రీనివాసనగర్‌లో విజయ్‌, అతని భార్య నీతా, కుమార్తె (10), కుమారుడు (4) నివాసం ఉంటున్నారు. కుమార్తె లౌక్య నాచారంలోని జాన్సర్‌ గ్రామర్‌ స్కూల్‌లో 5 తరగతి చదువుతోంది. ప్రతిరోజు లౌక్య స్కూల్‌ బస్సులోనే ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తోంది. వినాయక చవితికి ప్రభుత్వం ప్రకటించిన సెలవులు మంగళవారంతో (sep 17న) ముగిశాయి. బుధవారం (Sep 18న) ఉదయం స్కూల్​ బస్సు రాలేదు. కుమార్తెను స్కూల్​కు తీసుకెళ్లేందుకు నీతా తమ్ముడి బైక్​ను తీసుకుని ఉదయం 7.45 సమయంలో ఇంటి నుంచి బయలుదేరింది.

8.20 గంటలకు స్కూల్​లో తన కుమార్తెను వదిలిపెట్టి తిరిగి ఇంటికి పయనం అయ్యింది. పట్టుమని 10 నిమిషాలు గడవక ముందే మార్గమధ్యలోనే ప్రమాదం జరిగింది. నాచారం హెచ్‌ఎంటీ నగర్‌ కమాన్‌ ప్రధాన రహదారి వద్దకు రాగానే అదే మార్గంలో చర్లపల్లిలోని ఐఓసీ నుంచి గ్యాస్‌ సిలిండర్లు తీసుకుని రామ్‌నగర్‌కు బయలుదేరిన లారీ బైక్​ను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలోనే నీతా కుప్పకూలిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ నరేష్‌ పోలీసు స్టేషన్​లో లొంగిపోయారని సీఐ రుద్విర్‌ కుమార్ తెలిపారు.

అనారోగ్యంతో కుమార్తె మృతి - తట్టుకోలేక నిమిషాల వ్యవధిలోనే ఆగిన తల్లి గుండె

తల్లి మృతి తెలియని చిన్నారి : తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందన్న విషయం కుమార్తె లౌక్యకు సాయంత్రం నుంచి ఇంటికి వచ్చేవరకు తెలియదు. ఇంట్లోని వారంతా విషాదంలో ఉండటాన్ని గమనించింది. విషయాన్ని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంది. స్కూల్​కు వెళ్లిన అమ్మ వస్తుందని కుమారుడు టిఫిన్​ చేయకుండా ఎదురు చూస్తూ అలా ఉండిపోయాడు. వీరిని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.

డబ్బులు ఇవ్వలేదని ఒకరు - మద్యం మత్తులో మరొకరు - తల్లులకు మరణశాసనం - Son Killed Mother Incidents

'అమ్మా నేనేం పాపం చేశాను-నన్నొదిలి పోయావ్' - తల్లి అంత్యక్రియల కోసం చిన్నారి భిక్షాటన - Daughter Begged For Mother Funeral

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.