Woman Complaint on Former Minister Mekathoti Sucharita Relative: మాజీ మంత్రి మేకతోటి సుచరిత మరిది మేకతోటి వెంకటప్పయ్య తమ స్థలాన్ని అద్దెకు తీసుకుని బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఓ మహిళ వాపోయారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరులోని విజయపురి కాలనీకి చెందిన చెట్టి జ్యోతిలక్ష్మి మాజీ మంత్రి మేకతోటి సుచరిత మరిది డిప్యూటీ డీఈవో మేకతోటి వెంకటప్పయ్య వాసవీనగర్‌లోని స్థలాన్ని 2019లో 500 గజాల స్థలం అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత ఖాళీ చేయమని పోలీసులను ఆశ్రయిస్తే 2 నెలల్లో ఖాళీ చేస్తానని చెప్పి నేటికీ చేయకుండా తమపైనే కేసులు పెడతానని బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. ప్రశ్నించిన తన భర్త, కుటుంబసభ్యులపై అట్రాసిటీ కేసు పెట్టారని అన్నారు.
అద్దె చెల్లింపులను వేర్వేరు పేర్లతో చెల్లిస్తున్నారని అతని పలుకుబడిని ఉపయోగించుకుని కరెంట్ బిల్లును అతని పేరుతో మార్పించుకుని ఇప్పుడు స్థలం వైపు రావద్దంటూ బెదిరిస్తున్నారని జ్యోతిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే మేకతోటి సుచరితకు చెప్పినా కూడా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. భర్త సంవత్సరాలుగా మంచం పట్టి ఈ ఏడాది చనిపోయారని కుమారుడిని డాక్టర్ చదివించాలనుకుంటే ఉన్న స్థలం ఇలా ఆక్రమించి బెదిరిస్తున్నారని జ్యోతిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు యంత్రాంగం స్పందించి తమ స్థలం ఇప్పించాలని జ్యోతిలక్ష్మి కోరుతున్నారు.
మాజీ మంత్రి మేకతోటి సుచరిత మరిది డిప్యూటీ డీఈవో మేకతోటి వెంకటప్పయ్య మా స్థలాన్ని అద్దెకు తీసుకుని ఐదేళ్లుగా ఖాళీ చేయకుండా బెదిరిస్తున్నారు. 2019లో తమ స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత ఖాళీ చేయమని ఎస్పీకి ఫిర్యాదు చేశాను. అప్పుడు రెండు నెలల్లో ఖాళీ చేస్తానని చెప్పారు. కాని ఇప్పటికీ ఖాళీ చేయకుండా మమ్మల్ని బెదిరిస్తున్నారు. అంతే కాకుండా మాపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారు. అతనిని ప్రశ్నించిన నా భర్త, కుటుంబసభ్యులపై అట్రాసిటీ కేసు పెట్టారు. ఈ విషయం సుచరిత దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదు. దొంగపత్రాలతో తమ స్థలం కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.- చెట్టి జ్యోతిలక్ష్మీ, బాధితురాలు
ఏలూరులో కాల్‌మనీ ఆగడాలు - మంగళవారం వచ్చిదంటే బాధితులకు వణుకు - Call Money Harassment in Eluru